Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IND vs SA: పక్కా ప్లాన్‌తో రోహిత్ శర్మ వికెట్.. ఊరించే బంతితో!

సెంచూరియన్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా కష్టాల్లో పడింది. భారత్ ఓపెనర్లు పది ఓవర్ల పాటు కూడా క్రీజులో నిలవలేకపోయారు. రోహిత్ శర్మ (5; 14 బంతుల్లో), యశస్వీ జైశ్వాల్ (17; 37 బంతుల్లో) నిరాశపరిచారు. వన్‌డౌన్‌లో వచ్చిన శుభ్‌మన్ గిల్ (2) కూడా సఫారీ బౌలర్ల ధాటికి నిలవలేకపోయాడు. 24 పరుగులకే టీమిండియా మూడు వికెట్లు కోల్పోయింది. క్రీజులో విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్ ఉన్నారు.

టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్ 13 పరుగులకే తొలి వికెట్ కోల్పోయింది. కెప్టెన్ రోహిత్‌ను రబాడ తెలివిగా బోల్తా కొట్టించాడు. శరీరం మీదకు బౌన్సర్లు విసిరితే రోహిత్ పుల్ షాట్లు ఆడతాడని, దానికి తగ్గట్టుగా ఫీల్డర్లను మోహరించారు. దక్షిణాఫ్రికా వేసిన వలలో రోహిత్ చిక్కుకున్నాడు. పుల్ షాట్‌కు యత్నించి బౌండరీ లైన్ వద్ద ఉన్న బర్గర్ చేతికి చిక్కాడు.

India vs South Africa: Team India in trouble. Hunting for South Africas wickets with a clear plan

ఆ తర్వాత కాస్త దూకుడుగా ఆడిన మరో ఓపెనర్ జైశ్వాల్ ఎక్కువ సేపు క్రీజులో నిలవలేదు. బర్గర్ బౌలింగ్‌లో షాట్‌కు యత్నించి వికెట్‌కీపర్ చేతికి చిక్కాడు. గిల్‌ను కూడా బర్గర్ ఔట్ చేశాడు. తొలుత అంపైర్లు నాటౌట్‌గా ప్రకటించగా రివ్యూలో దక్షిణాఫ్రికా సక్సెస్ అయ్యింది.

దక్షిణాఫ్రికా: డీన్ ఎల్గర్, మార్క్‌రమ్, టోనీ డి జోర్జి, టెంబా బవుమా (కెప్టెన్), కీగన్ పీటర్సన్, డేవిడ్ బెడింగ్‌హామ్, కైల్ వెర్రెయిన్నే, మార్కో జాన్సెన్, గెరాల్డ్ కొయెట్జీ, కగిసో రబాడ, నాండ్రే బర్గర్

భారత్ : రోహిత్ శర్మ(కెప్టెన్), యశస్వి జైస్వాల్, శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, రవిచంద్రన్ అశ్విన్, శార్దూల్ ఠాకూర్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, ప్రసిధ్ కృష్ణ

Story first published: Tuesday, December 26, 2023, 15:12 [IST]
Other articles published on Dec 26, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+