For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

20 వికెట్లు తీసినా బ్యాటింగ్ బాగా చేయకపోతే..: కోహ్లీ

India Vs South Africa: Taking 20 wickets of little value if we don't bat well, says Virat Kohli

హైదరాబాద్: తొలి టెస్టులో భారత బౌలర్లు చేసిన ప్రదర్శనపై విరాట్ కోహ్లీ పెదవి విరిచాడు. ఎంతో నేర్పుతో కూడిన ప్రదర్శన చేసినా జట్టుకు పేరు రాలేదని వాపోయాడు. బ్యాట్స్‌మెన్‌ల ప్రదర్శన బాగాలేదనే అంటున్నారు కానీ బౌలర్ల ప్రతిభను మెచ్చుకోవడం లేదని గుచ్చి చెప్తున్నాడు.

నాలుగు రోజులు జరిగిన తొలి టెస్ట్ మ్యాచ్‌లో భారత్ రెండు ఇన్నింగ్స్‌లలో 209, 135స్కోరును చేసి 72 పరుగుల తేడాతో ఓడిపోయింది.

'20 వికెట్లు తీసి మ్యాచ్ గెలవడమే అసలు ప్రాధాన్యం. కానీ, ఇరవై వికెట్లు తీసినా బ్యాటింగ్ చేయకపోతే ప్రయోజనం ఏముంది. వారి స్కోరును దాటకపోతే ఎన్ని వికెట్లు తీసినా ఉపయోగమేముంది. అదే ఇప్పుడు జరిగింది.' అని కోహ్లీ వ్యాఖ్యానించాడు.

'బౌలర్లు జస్ప్రీత్ బుమ్రా, భువనేశ్వర్ కుమార్, మొహమ్మద్ షమీ తన అసమాన స్థాయిలో బౌలింగ్ వేసి హృదయాలను గెలుచుకున్నారు. అంతే కాదు వాళ్లు మళ్లీ అదే స్థాయిలో రాణించేందుకు సిద్ధంగా ఉన్నారు. అంతేకాదు, హార్ధిక్ పాండ్యా కూడా మంచి ప్రదర్శన చేశాడు. తొలి ఇన్నింగ్స్‌లో 93 స్కోరు చేసి జట్టుకు మంచి బలాన్ని చేకూర్చాడు.' అంటూ జట్టుకు మంచి కితాబిచ్చాడు.

'ఒకానొక దశలో నాలుగు వికెట్లు బౌల్డ్ అయిన తర్వాత నేను(కోహ్లీ), రోహిత్ బ్యాటింగ్‌లో ఉన్నాం. ఆ కాసేపు కొంచెం కంఫర్ట్‌గానే ఫీలయ్యాం. కానీ చేసేదేముంది. ఎంతో స్కోరును సాధించలేకపోయాం.' అని మ్యాచ్ పరిస్థితిని విశ్లేషించాడు.

ఈ పిచ్ ఏ ఒక్కరికో అనుకూలంగా లేదు. ఇరు జట్లు సమస్యను ఒకే రకంగా ఎదుర్కొన్నాయి. గడిచిన దాని నుంచి ప్రేరణ తీసుకోవాల్సిందే కానీ, బాధపడుతూ కూర్చోకూడదు అంటూ తన ప్రసంగాన్ని ముగించాడు.

తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.

Story first published: Tuesday, January 9, 2018, 12:57 [IST]
Other articles published on Jan 9, 2018
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+