For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

కెమెరామెన్‌‌తో కుల్దీప్ సైగలు: సోషల్ మీడియాలో వీడియా వైరల్

By Nageshwara Rao
See how kuldeep yadav makes fun of Shamsi in 1st t2o at Johensburg.

హైదరాబాద్: జోహెన్స్‌బర్గ్ వేదికగా ఆతిథ్య దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టీ20లో కోహ్లీసేన 28 పరుగుల తేడాతో ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. అయితే, ఈ మ్యాచ్‌కు గాయం కారణంగా చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ దూరమైన సంగతి తెలిసిందే.

గాయం కారణంగా బెంచ్‌కే పరిమితమైన కుల్దీప్ తొలి టీ20లో చేసిన ఓ పనికిగాను సోషల్ మీడియాలో హైలెటయ్యాడు. వాండరర్స్ స్టేడియం డగౌట్‌లోని కూర్చొని కుల్దీప్ చేసిన సైగలకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది.

తొలి టీ20లో కోహ్లీసేన విజయం ఖాయమైన వేళ కెమెరామెన్‌ డగౌట్‌లో ఉన్న కుల్దీప్‌ను పదే పదే చూపించాడు. దీనిని గమనించిన కుల్దీప్‌ ఫన్నీగా చేతులతో సైగలు చేశాడు. అదే సయమంలో దక్షిణాఫ్రికా డగౌట్‌లో షమ్సీ బ్యాటింగ్‌కు దిగేందుకు గాను సిద్దంగా ఉన్నాడు.

కుల్దీప్ చేసిన సైగలకు అర్ధం ఏంటంటే ఓడిపోతున్న దక్షిణాఫ్రికను చూపించడండి అని కెమెరామెన్‌తో కుల్దీప్ చెబుతున్నాడంటూ సోషల్ మీడియాలో అభిమానులు కామెంట్లు పెట్టారు. ప్రొటీస్‌ మరో వికెట్‌ కోల్పోతుంది.. మరో బ్యాట్స్‌మన్‌ బ్యాటింగ్‌ వెళ్తాడు చూడండీ అని ఇంకొందరు కామెంట్‌ చేశారు.

కాగా, తొలి టీ20లో టీమిండియా 28 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. 204 పరుగుల విజయ లక్ష్యంతో బరిలో దిగిన దక్షిణాఫ్రికా జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 175 పరుగులకే పరిమితమైంది. అంతకముందు తొలుత బ్యాటింగ్ చేసిన కోహ్లీసేన 203 పరుగులు చేసిన సంగతి తెలిసిందే.

Story first published: Monday, February 19, 2018, 11:13 [IST]
Other articles published on Feb 19, 2018
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+