
హైదరాబాద్: మూడు టీ20ల సిరిస్‌లో భాగంగా భారత్-దక్షిణాఫ్రికా జట్ల మధ్య తొలి టీ20 ఆదివారం జోహెన్స్‌బర్గ్‌లోని వాండరర్స్ స్టేడియంలో సాయంత్రం 6 గంటలకు జరగనుంది. ఆరు వన్డేల సిరిస్‌ను 5-1తో సొంతం చేసుకున్న కోహ్లీసేన టీ20 సిరిస్‌ను కూడా గెలుపుతో ప్రారంభించాలని భావిస్తోంది.
ఇందులో భాగంగా శనివారం జట్టులోని ఆటగాళ్లు కోచ్, సహాయ సిబ్బంది ఆధ్వర్యంలో నెట్స్‌లో చెమటోట్చారు. ఏడాది విరామం తర్వాత భారత టీ20 జట్టులోకి వచ్చిన మిడిలార్డర్ బ్యాట్స్‌మన్ సురేశ్ రైనాపైనే అందరి కళ్లు ఉన్నాయి. బ్యాటింగ్ కోచ్ సంజయ్ బంగర్ ఆధ్వర్యంలో రైనా బ్యాటింగ్ ప్రాక్టీస్ చేశాడు.
టీ20 ఫార్మాట్‌లో రైనాకు మంచి రికార్డు ఉంది. ఈ నేపథ్యంలో గత పూర్వ వైభవాన్ని అందుకుంటాడని అభిమానులు భావిస్తున్నారు. మరోవైపు ధోని సైతం ఈ ప్రాక్టీస్ సెషన్‌లో పాల్గొన్నాడు. దీనికి సంబంధించిన వీడియోని అభిమానుల కోసం బీసీసీఐ తన ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేసింది.