Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IND vs SA: రింకూకు షాక్ ఇచ్చిన కేఎల్ రాహుల్.. టాస్ గెలిచిన సౌతాఫ్రికా

సౌతాఫ్రికా పర్యటనలో భారత్ మరో సిరీస్‌కు సిద్ధమైంది. టీ20 సిరీస్‌ను 1-1తో పంచుకున్న దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్‌లో తలపడనుంది. మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా జొహానెస్‌బర్గ్ వేదికగా ఇవాళ మొదటి వన్డే జరనుంది. వన్డే ప్రపంచకప్ అనంతరం ఇరు జట్లకు ఇదే తొలి వన్డే కావడంతో ఈ మ్యాచ్‌పై ఆసక్తి పెరిగింది. ఈ మ్యాచ్‌లో సౌతాఫ్రికా పింక్ జెర్సీతో బరిలోకి దిగనుంది. బ్రస్ట్ కాన్సర్ అవగాహన కోసం సఫారీ సేన పింక్ జెర్సీని ధరించనుంది.

టాస్ గెలిచిన సౌతాఫ్రికా బ్యాటింగ్ ఎంచుకుంది. సాయి సుదర్శన్ ఇవాళ మ్యాచ్‌తో వన్డేల్లో అరంగేట్రం చేయనున్నాడు.లిస్ట్-ఎ క్రికెట్‌లో ఓపెనర్‌గా అతడు 56 సగటుతో పరుగులు చేశాడు. కాగా, ఇరు జట్లు ఇప్పటివరకు 91 వన్డేలు ఆడగా.. సౌతాఫ్రికా 50, ఇండియా 38 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. మూడు మ్యాచ్‌ల్లో ఫలితం రాలేదు. ఇక 2020 నుంచి జొహానెస్‌బర్గ్ వేదికగా 5 వన్డేలు జరిగాయి. తొలుత బ్యాటింగ్ చేసిన జట్టు మూడు మ్యాచ్‌ల్లో గెలిచింది. ఫస్ట్ ఇన్నింగ్స్ ఏవరేజ్ స్కోరు 295.

India vs South Africa: South Africa won the toss choose to bat first

టాస్ అనంతరం కేఎల్ రాహుల్ మాట్లాడుతూ.. ''దక్షిణాఫ్రికాలో పింక్ వన్డేలు ఎంతో స్పెషల్. ఈ మ్యాచ్ లో సత్తాచాటాడానికి ప్రయత్నిస్తాం. ఇక్కడ స్పిన్‌కు అనుకూలిస్తుందని భావిస్తున్నాం. సౌతాఫ్రికాపై ఒత్తిడి తీసుకురావడానికి ట్రై చేస్తాం. సాయి సుదర్శన్ ఇవాళ అరంగేట్రం చేయనున్నాడు. రుతురాజ్, తిలక్ వర్మ, సంజు శాంసన్ ఆతృతగా ఎదురుచూస్తున్నారు. కుల్‌దీప్, అక్షర్ పటేల్ ఇద్దరు స్పిన్నర్లతో బరిలోకి దిగుతున్నాం. మా ప్లేయర్లకు ఒత్తిడిని ఎలా అధిగమించాలో తెలుసు. ఐపీఎల్‌లో ఆడిన అనుభవంతో ఇక్కడ సత్తాచాటుతారని ఆశిస్తున్నా'' అని అన్నాడు.

జట్టు వివరాలు
భారత్: సాయి సుదర్శన్, రుతురాజ్ గైక్వాడ్, తిలక్ వర్మ, శ్రేయస్ అయ్యర్, KL రాహుల్ (కెప్టెన్ ), సంజు శాంసన్, అక్షర్ పటేల్,అర్షదీప్ సింగ్,అవేష్ ఖాన్,కుల్‌దీప్ యాదవ్,ముకేశ్ కుమార్

దక్షిణాఫ్రికా: హెండ్రిక్స్, టోనీ డి జోర్జి, డస్సెన్, మార్క్‌రమ్ (కెప్టెన్),హెన్రిచ్ క్లాసెన్, డేవిడ్ మిల్లర్, వియాన్ ముల్డర్, ఫెహ్లుక్వాయో , కేశవ్ మహారాజ్, నాండ్రే బర్గర్, షంసీ

Story first published: Sunday, December 17, 2023, 13:24 [IST]
Other articles published on Dec 17, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+