విశాఖ టెస్టులో ఆసక్తికర సన్నివేశం!: బంతి ఎక్కడుందో తెలుసా? (వీడియో)

హైదరాబాద్: విశాఖ వేదికగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్టులో రెండో రోజైన గురువారం ఓ ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. భారత్ ఇన్నింగ్స్‌లో భాగంగా 129 ఓవర్‌లో వికెట్ కీపర్ క్వింటాన్ డీకాక్ బంతిని పట్టడంలో విఫలం కావడంతో అది నేరుగా వెళ్లి బౌండరీకి వెళ్లింది.
అయితే బంతిని అనుసరించిన ఫీల్డర్‌కు అది ఎక్కడుందో కనిపించలేదు. బౌండరీ రోప్ వెనకాల ఉన్న కవర్లు ఎత్తి చూసినా అది సఫారీ ఫీల్డర్ ఫిలాండర్‌కు కనిపించలేదు. అదే సమయంలో సఫారీ రిజర్వ్ ఆటగాళ్లు వచ్చి వెతికినా ఆ బంతి ఎక్కడుందో వారికి కనిపించలేదు.
అభిమానులు కూడా విఫలం
దీంతో బంతిని వెతికే పనిని అభిమానులు తీసుకున్నారు. చివరకు అభిమానులు కూడా విఫలమయ్యారు. చివరకు టీవీ కెమెరాలు బంతిని ఎక్కడుందనే విషయాన్ని జూమ్ చేయడంతో మ్యాచ్‌ని వీక్షిస్తోన్న ప్రేక్షకులకు అది కనిపించింది. అయినప్పటికీ ఫిలాండర్‌తో పాటు రిజర్వ్ ఆటగాళ్లు బౌండరీ రోప్‌ను దాటి వెతుకుతూనే ఉన్నారు.
టీవీ ఫుటేజ్‌ని చూసి
అదే సమయంలో టీవీ ఫుటేజ్‌ని చూసిన దక్షిణాఫ్రికా ఆటగాడు ఐడెన్ మార్కరమ్ బంతి జాడను కనిపెట్టేశాడు. బంతి దగ్గరకు వెళ్లి దానిని బయటకు తీశాడు. ఫిలాండర్‌తో పాటు మిగతా ఆటగాళ్లందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఇంతకీ బంతి ఎక్కడుందో తెలుసా? బౌండరీ లైన్ వద్ద రెండు అడ్వర్‌టైజ్‌మెంట్ కుషన్స్ మధ్య ఇరుక్కుపోయింది.
వీడియో సోషల్ మీడియాలో వైరల్
ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇదిలా ఉంటే, ఈ మ్యాచ్‌లో భారత ఓపెనర్లు మయాంక అగర్వాల్ డబుల్ సెంచరీతో చెలరేగగా, రోహిత్ శర్మ సెంచరీతో రాణించడంతో టీమిండియా తన తొలి ఇన్నింగ్స్‌ను 502/7 వద్ద డిక్లేర్డ్ చేసిన సంగతి తెలిసిందే.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications