Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

సింహంతో గిల్ సెల్ఫీ..ఇంత తీట పోరడివి ఏంటన్నా?

దక్షిణాఫ్రికా పర్యటనలో భారత్ టీ20, వన్డే మ్యాచ్‌లను ఘనంగా ముగించింది. పొట్టి ఫార్మాట్ సిరీస్‌ను 1-1తో సమం చేయగా, వన్డే సిరీస్‌ను 2-1తో కైవసం చేసుకుంది. ఇక టెస్టు సమరానికి సిద్ధమైంది. ఇప్పటివరకు సఫారీ గడ్డపై సుదీర్ఘ ఫార్మాట్ సిరీస్‌ను భారత్ ఒక్కసారి కూడా గెలవలేకపోయింది. 1992 నుంచి ఇప్పటివరకు దక్షిణాఫ్రికాలో భారత్‌ 8 టెస్టు సిరీస్‌లాడింది. కానీ ఏడింట్లో పరాజయం పాలైంది. ఓ సిరీస్‌ను మాత్రం డ్రాగా ముగించింది. ఈ సారి సిరీస్ విజయం సాధించి చరిత్ర స‌ృష్టించాలని టీమిండియా పట్టుదలతో ఉంది.

డిసెంబర్ 26 నుంచి దక్షిణాఫ్రికాతో రెండు టెస్టుల సిరీస్‌ ప్రారంభం కానుంది. సెంచూరియన్ వేదికగా తొలి టెస్టు జరగనుంది. చివరి టెస్టు కేప్‌టౌన్‌లో జనవరి 03న మొదలవుతుంది. అయితే తొలి టెస్టుకు వర్షం ముప్పు పొంచి ఉంది. భారీ వర్షం వల్ల తొలి రోజు ఆట దాదాపుగా తుడిచిపెట్టుకుపోయే అవకాశముంంది. రెండో రోజు కూడా చాలా ఓవర్ల ఆట నష్టం జరగొచ్చు.ఇక పిచ్‌ విషయానికొస్తే ఫాస్ట్‌ బౌలర్లకు అనుకూలిస్తుంది.

India vs South Africa: Shubman Gill took a selfie with a lion

అయితే కొందరు టీమిండియా ప్లేయర్లు దక్షిణాఫ్రికాలో ప్రత్యేక ప్రదేశాల సందర్శనకు వెళ్లారు. ఫారెస్ట్ సఫారీకి యువ ఓపెనర్ శుభ్‌మన్ గిల్‌తో పాటు టీమిండియా సిబ్బంది రాహుల్ ద్రవిడ్, విక్రమ్ రాథూర్, టీ దిలీప్ వెళ్లారు. వారందరూ ఖడ్గమృగంతో కలిసి ఫొటోకు ఫోజులు ఇచ్చారు. రైనో మీద చేతులు వేసి సరదాగా గడిపారు.

అయితే గిల్ సింహంతో సెల్ఫీ దిగాడు. పర్యాటకుల వాహనం నుంచి ఫొటో తీసుకున్నాడు. ఈ ఫొటోలు నెట్టింట్లో వైరల్‌గా మారాయి. నెటిజన్లు గిల్ ఫొటోపై భిన్నంగా స్పందిస్తున్నారు. సింహంతో మరో సింహం అని, ఫొటోలు ఉన్న ఇద్దరూ టీమిండియా ఓపెనర్లు అని కామెంట్లు చేస్తున్నారు. మ్యాచ్ ముందు ఇలాంటి సాహసాలు అవసరమా?, గిల్ ఇంత తీట పోరడు అనుకోలేదని.. మరికొందరు సరదాగా కామెంట్లు చేస్తున్నారు.

Story first published: Sunday, December 24, 2023, 18:09 [IST]
Other articles published on Dec 24, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+