Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

భారత్‌కు ఎదురుదెబ్బ: కేప్ టౌన్ టెస్టుకు ధావన్ దూరం!

 India vs South Africa: Shikhar Dhawan doubtful for Cape Town Test due to ankle injury

హైదరాబాద్: కీలకమైన దక్షిణాఫ్రికా పర్యటనకు ముందు భారత్‌కు ఎదురుదెబ్బ తగిలింది. మూడు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌ కోసం కోహ్లీ నేతృత్వంలోని టీమిండియా గురువారం ఉదయం దక్షిణాఫ్రికా బయల్దేరిన సంగతి తెలిసిందే. ఈ సిరిస్‌లో భాగంగా ఇరు జట్ల మధ్య తొలి టెస్టు జనవరి 5న ప్రారంభం కానుంది.

When a team loses, it comes back with better strategy - Shikhar Dhawan

ఓపెనర్ శిఖర్ ధావన్ ఎడమ మడమకు గాయమైంది. బుధవారం దక్షిణాఫ్రికా పర్యటనకు బయల్దేరే సమయంలో శిఖర్ ధావన్ కాలుకు కట్టుతో కనిపించాడు. గాయంతోనే ధావన్‌ కోహ్లీ సేనతో కలిసి దక్షిణాఫ్రికా బయల్దేరాడు. జట్టు ఫిజియో పాట్రిక్‌ ఫర్‌హార్ట్‌తో చర్చించిన తర్వాత ధావన్‌ గాయం తీవ్రతను తెలుసుకునేందుకు ఎమ్మారై స్కానింగ్‌ తీయించుకున్నాడు.

దీంతో జనవరి 5న కేప్ టౌన్ వేదికగా జరిగే తొలి టెస్టులో ధావన్ ఆడేది అనుమానంగా మారింది. ఈ సందర్భంగా బీసీసీఐ అధికారి ఒకరు మాట్లాడుతూ 'ధావన్‌ కాలి గాయంతో బాధపడుతున్నాడు. త్వరలో ఫిజియో సెలక్టర్లకు రిపోర్టు అందించనున్నాను. ఆ తర్వాతే సెలక్టర్లు ఓ నిర్ణయానికి వస్తారు. తొలి టెస్టుకు అందుబాటులో ఉండేది లేనిది ఇప్పుడే చెప్పలేం' అని అన్నాడు.

ఒకవేళ శిఖర్ ధావన్‌ తొలి టెస్టుకు దూరమైతే మురళీ విజయ్‌తో కలిసి కేఎల్‌ రాహుల్‌ ఓపెనర్‌గా బరిలోకి దిగే అవకాశం ఉంది.

తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.

Story first published: Thursday, December 28, 2017, 10:51 [IST]
Other articles published on Dec 28, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+