
నదీమ్ మాయ
ఓవర్‌నైట్ స్కోరు 132/8తో నాలుగో రోజు మంగళవారం ఇన్నింగ్స్‌ను ఆరంభించిన దక్షిణాఫ్రికా కేవలం రెండు ఓవర్లలోనే ఆలౌట్ అయింది. లోకల్ స్పిన్నర్ నదీమ్ చివరి రెండు వికెట్లు పడగొట్టడంతో సఫారీలు రెండో ఇన్నింగ్స్‌లో 133 పరుగులకే కుప్పకూలారు. నోర్జెతో కలిసి ఇన్నింగ్స్‌ను ఆరంభించిన డిబ్రుయిన్ (30).. రెండో ఓవర్‌లోనే నదీమ్ బౌలింగ్‌లో కీపర్ సాహాకు క్యాచ్ ఇచ్చాడు. దీంతో నిన్నటి నుండి పోరాడుతున్న డిబ్రుయిన్ కథ ముగిసింది.

ఎంగిడి డకౌట్:
అనంతరం బ్యాటింగ్‌కు వచ్చిన పేసర్ లుంగి ఎంగిడి ఒక్క బంతి మాత్రమే ఆడి ఖాతా తెరవకుండానే పెవిలియన్ చేరాడు. తొలి బంతినే షాట్ ఆడేందుకు ప్రయత్నించగా.. బంతి నేరుగా వెళ్లి అవతల ఎండ్‌లో ఉన్న నాన్ స్ట్రైకర్ నోర్జెకి బలంగా తగిలి గాల్లోకి ఎగిరింది. అక్కడే ఉన్న నదీమ్ వెంటనే స్పందించి సూపర్ క్యాచ్ పట్టడంతో సఫారీల పని అయిపొయింది. దీంతో మూడు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌ను కోహ్లీ సేన క్లీన్ స్వీప్ చేసింది.

లిండె పోరాటం:
తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన దక్షిణాఫ్రికాకు ఆదిలోనే భారీ షాక్ తగిలింది. ఎల్గర్ (0), డికాక్ (4), డుప్లెసిస్ (1) త్వరగానే ఔటయ్యారు. నాలుగో వికెట్‌కు 91 పరుగులు జోడించాక.. హమ్జ (61) ఔట్ అయ్యాడు. మరుసటి ఓవర్‌లో బవుమా కూడా వెనుదిరిగాడు. ఇక అక్కడి నుంచి వికెట్ల పతనం వేగంగా సాగింది. క్లాసెన్ (6), పీట్ (4), రబాడ (0) పెవిలియన్‌కు క్యూ కట్టారు. చివర్లో లిండె (81 బంతుల్లో 37), నోర్జే (55 బంతుల్లో 4) పోరాడటంతో దక్షిణాఫ్రికా 162 పరుగులు చేయగలిగింది.

ఫాలోఆన్ ఆడిన సఫారీలు:
తొలి ఇన్నింగ్స్‌లో భారత్‌కు 335 పరుగుల ఆధిక్యం లభించడంతో సఫారీకిలకు ఫాలోఆన్ తప్పలేదు. రెండో ఇన్నింగ్స్‌లో కూడా ప్రొటీస్ పోటీ ఇవ్వలేకపోయింది. రిటైర్డ్‌హర్ట్ ఎల్గర్ (16) మినహా తొలి ఐదుగురు బ్యాట్స్‌మెన్ 5 పరుగుల్లోపే పెవిలియన్ చేరారు. డికాక్ (5), హమ్జా (0), డుప్లెసిస్ (4), బవుమా (0)లు పరుగులు చేసారు. లిండే, పీట్ (23) నిలబడటంతో జట్టుస్కోరు వందకు చేరింది. ఎల్గర్ స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన బ్రుయిన్ ఆదుకున్నాడు. నాలుగో రోజు నదీమ్ మాయ చేయడంతో బ్రుయిన్, నోర్జే పెవిలియన్ చేరారు. భారత్ తన తొలి ఇన్నింగ్స్‌లో 497 రన్స్ చేసిన విషయం తెలిసిందే. రోహిత్ డబుల్ సెంచరీ, రహానే సెంచరీ చేసారు.


Click it and Unblock the Notifications
