For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

రోహిత్‌ను కిందపడేసిన అభిమాని: ఫ్రీగా మ్యాచ్‌ చూడటానికి కాదంటూ సన్నీ ఆగ్రహం

India vs South Africa: ‘Security not there to watch free match’ - Gavaskar fumes after fan invades pitch to meet Rohit Sharma

హైదరాబాద్: పూణె టెస్టులో శనివారం చోటు చేసుకున్న ఘటనపై టీమిండియా మాజీ క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. భారత్-దక్షిణాఫ్రికా జట్ల మధ్య పూణె వేదికగా జరుగుతున్న రెండో టెస్టులో మూడో రోజైన శనివారం ఓ అభిమాని భద్రతా వలయాన్ని ఛేదించుకొని వచ్చి రోహిత్‌శర్మ పాదాలను తాకడానికి ప్రయత్నించాడు.

ఈ క్రమంలో బ్యాలెన్స్‌ తప్పిన రోహిత్‌ శర్మ ఆ అభిమాని మీద పడిపోయాడు. ఈ ఘటనపై కామెంట్రీ బాక్సులో ఉన్న గవాస్కర్‌ ఆందోళన వ్యక్తంజేశాడు. అభిమానుల అత్యుత్సాహ చర్యల వల్ల ఆటగాళ్లకు ఏమైనా జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారని స్టేడియం నిర్వహాకులపై గవాస్కర్ మండిపడ్డాడు.

భద్రతా సిబ్బంది మ్యాచ్‌ను చూస్తూ

భద్రతా సిబ్బంది మ్యాచ్‌ను చూస్తూ

భద్రతా సిబ్బంది మ్యాచ్‌ను చూస్తూ అభిమానులను గమనించకపోవడంవల్లే ఇలా జరుగుతోందని గవాస్కర్ పేర్కొన్నాడు. ఈ సందర్భంగా గవాస్కర్ మాట్లాడుతూ "ఇలాంటి సంఘటనలు భద్రతా సిబ్బంది బాధ్యతారాహిత్యం వల్లనే జరుగుతున్నాయి. మైదానంలోకి వస్తున్న అభిమానులను నిలువరించకుండా వారు మ్యాచ్‌ను చూస్తున్నారు" అని అన్నాడు.

నిప్పులు చెరిగిన గవాస్కర్

నిప్పులు చెరిగిన గవాస్కర్

"భారత్‌లో ఇలాంటి సమస్యలు పునరావృతమవుతూనే ఉన్నాయి. వాటిని భద్రతా సిబ్బందే అడ్డుకోవాలి. వారు ఉన్నది ఉచితంగా మ్యాచ్‌ను ఆస్వాదించడానికి కాదు. అభిమానుల అత్యుత్సాహంతో ఆటగాళ్లకు ఏమైనా జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారు?" అని గవాస్కర్ ప్రశ్నించాడు.

అసలేం జరిగింది?

అసలేం జరిగింది?

మూడో రోజైన శనివారం ఒక అభిమాని అత్యుత్సాహం ప్రదర్శించాడు. లంచ్ విరామం అనంతరం భారత ఆటగాళ్లు ఫీల్డింగ్ చేసేందుకు మైదానంలోకి వచ్చారు. కొద్ది సమయానికే తమ అభిమాన క్రికెటర్ అయిన రోహిత్ శర్మను కలిసేందుకు ఫెన్సింగ్ దాటి ఓ అభిమాని మైదానంలోకి దూసుకువచ్చాడు.

రోహిత్‌ వద్దకు పరిగెత్తుకు వచ్చి

అభిమాని మైదానంలో ఫీల్డింగ్ చేస్తున్న రోహిత్‌ వద్దకు పరిగెత్తుకు వచ్చి అతడి పాదాలను ముద్దాడేందుకు ప్రయత్నించాడు. పక్కనే ఉన్న రహానే వద్దు అని సూచించినా.. అభిమాని మాత్రం ఆగలేదు. అయితే ఈ ప్రయత్నంలో అదుపు తప్పిన రోహిత్ కిందపడ్డాడు. దీంతో భద్రతా సిబ్బంది వెంటనే పరిగెత్తుకొచ్చి అతడిని దూరంగా తీసుకెళ్లారు. ఇది చూసిన రహానే నవ్వుకున్నాడు.

ఇది మొదటిసారేం కాదు

ఇది మొదటిసారేం కాదు

ఇలా అభిమానులు రోహిత్ కోసం మైదానంలోకి దూసుకురావడం ఇది మొదటిసారేం కాదు. గతంలో విజయ్ హజారే ట్రోఫీలో భాగంగా ముంబై-బీహార్ మధ్య జరిగిన మ్యాచ్‌లో మైదానంలోకి దూసుకొచ్చిన అభిమాని రోహిత్‌ను ముద్దుపెట్టేందుకు ప్రయత్నించాడు. గతేడాది హైదరాబాద్‌లోని ఉప్పల్‌లో జరిగిన మ్యాచ్‌లో విరాట్ కోహ్లీకి అభిమాని ముద్దిచ్చాడు. ఇక ధోనీ అభిమానులు అయితే చాలా సార్లే వచ్చి అతని పాదాలు తాకి వెళ్లారు. ఓసారి ధోనీ తన అభిమానిని సరదాగా మైదానంలో పరిగెత్తించాడు.

ఫాలో ఆన్‌‌లో సఫారీలు

ఫాలో ఆన్‌‌లో సఫారీలు

కాగా, పూణె వేదికగా జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా గెలుపు దిశగా పయనిస్తోంది. తొలి ఇన్నింగ్స్‌లో టీమ్‌ఇండియా 601/5 స్కోరు వద్ద డిక్లేర్‌ చేసిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌లో 275 పరుగులకే ఆలౌటైంది. దీంతో కోహ్లీసేనకు 326 పరుగుల భారీ ఆధిక్యం లభించింది. ఇంకా రెండు రోజుల ఆట మిగిలున్న నేపథ్యంతో కోహ్లీ సఫారీలను ఫాలో ఆన్‌ ఆడిస్తున్నాడు.

Story first published: Sunday, October 13, 2019, 10:06 [IST]
Other articles published on Oct 13, 2019
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+