
హైదరాబాద్: మూడు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో భాగంగా భారత్-దక్షిణాఫ్రికా జట్ల మధ్య సెంచూరియన్ పార్కులో శనివారం (జనవరి 13) నుంచి రెండో టెస్టు మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో దక్షిణాఫ్రికా జట్టు కోచ్ గిబ్సన్ రెండో టెస్టులో తమ జట్టు అనుసరించబోయే వ్యూహాంపై సూచనప్రాయంగా చెప్పుకొచ్చాడు.
'నేను ఫాస్ట్ బౌలింగ్ మైండ్ కలిగి ఉన్న కోచ్‌ని. జట్టులో నలుగురు బౌలర్లను తీసుకున్నప్పటికీ సమానత్వం కలిగేలా చూస్తా. కేప్‌టౌన్‌లో జరిగిన తొలి టెస్టులో నలుగురు సీమర్లతో బరిలోకి దిగిన మా వ్యూహం ఫలించింది. శనివారం ప్రారంభంకానున్న రెండో టెస్టులోనూ ఇదే వ్యూహంతో బరిలోకి దిగుతాం' అని అన్నాడు.
'నిజానికి సెంచూరియన్ పిచ్ పేసర్ల స్వర్గధామం. తొలి టెస్టులో నలుగురు సీమర్లలో ముగ్గురు 140కి పైగా వేగంతో బంతులేశారు. కేప్‌టౌన్ టెస్టు విజయం మాలో ఆత్మవిశ్వాసాన్ని నింపింది. నెంబర్‌వన్ జట్టుపై ఆడేప్పుడు చాలా జాగ్రత్త వహించాలి. అన్ని విభాగాలను బ్యాలెన్స్ చేసుకోవాలి' అని గిబ్సన్ తెలిపాడు.
'స్వదేశంలో మ్యాచ్‌లు ఆడేటప్పుడు మన బలాలను మనం తెలుసుకుని అందుకు తగ్గట్లుగా ఆడాలి. ప్రపంచంలోనే బెస్ట్ టీమ్ అయిన టీమిండియా ఎదుర్కొవాలంటే కొంచెం విభిన్నంగా తమ జట్టు ప్రదర్శన చేయాల్సి ఉంటుంది' అని అన్నాడు. తొలి టెస్టులో గాయపడిన పేసర్ డేల్ స్టెయిన్ స్థానంలో యువ పేసర్ డ్యున్ ఒలివరన్‌ను సెలక్టర్లు ఎంపిక చేసిన సంగతి తెలిసిందే.
పాదం గాయం కారణంగా స్టెయిన్ ఈ సిరీస్‌లో మిగతా రెండు టెస్టులకు దూరమయ్యాడు. ఒలివర్‌తో పాటు మరో పేసర్ లుంగి కూడా దక్షిణాఫ్రికా జట్టులో చోటు దక్కించుకున్నాడు. తొలి టెస్టులో ముగ్గురు బౌలర్లు 140 kph వేగంతో బౌలింగ్ వేశారని, దానిని సద్వినియోగం చేసుకున్నామని చెప్పాడు.
తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.