Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

లేట్‌గా వెళ్లిన రుతురాజ్.. ముఖం మీదే డోర్ వేసిన బస్ డ్రైవర్ (వీడియో)

జొహానెస్‌బర్గ్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి వన్డేలో టీమిండియా ఎనిమిది వికెట్ల తేడాతో విజయం సాధించింది. మూడు వన్డేల సిరీస్‌లో 1-0 తో ఆధిక్యంలో నిలిచింది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా 27.3 ఓవర్లలో 116 పరుగులకే కుప్పకూలింది. టీమిండియా పేసర్లు అర్షదీప్ సింగ్ (5/37), అవేశ్ ఖాన్ (4/27) సఫారీ బ్యాటర్లను బెంబేలెత్తించారు.

అనంతరం ఛేదనకు దిగిన భారత్ 16.4 ఓవర్లలోనే రెండు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. సాయి సుదర్శన్ (55*), శ్రేయస్ అయ్యర్ (52) అర్ధశతకాలతో సత్తాచాటారు.ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ విఫలమయ్యాడు. 10 బంతులు ఎదుర్కొని 5 పరుగులే చేశాడు.

India vs South Africa: Ruthuraj went late.The bus driver closed the door on his face

అయితే రుతురాజ్ మీద విపరీతంగా ట్రోల్స్ వస్తున్నాయి. దానికి కారణం అతడు లేట్‌గా రావడంతో బస్సు డ్రైవర్ రుతురాజ్ ముఖం మీదే డోర్ వేశాడు. ఇప్పుడు దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది. అసలేం జరిగిందంటే.. టీమిండియా కోసం ఏర్పాటు చేసిన బస్సులో భారత ఆటగాళ్లు అందరూ కూర్చొన్నారు. కానీ రుతురాజ్ ఆలస్యంగా బస్సు దగ్గరకు చేరుకున్నాడు. అయితే సరిగ్గా బస్సు లోపలికి వెళ్లే టైమ్‌కు డోర్ మూసుకుంది. రుతురాజ్ వస్తున్నాడని తెలియక డ్రైవర్ డోర్‌ను క్లోజ్ చేశాడు.

కానీ తొలి వన్డేలో విఫలమవ్వడంతో డ్రైవర్ ఇలా చేశాడని నెటిజన్లు ఫన్నీగా ట్వీట్లు చేస్తున్నారు. అయితే ఓ నెటిజన్ బస్ డ్రైవర్‌ను బంగ్లాదేశ్ ప్లేయర్ షకిబ్ అల్ హసన్‌తో పోలుస్తూ లేట్‌గా వస్తే ఇలానే ఉంటుందని కామెంట్ పెట్టాడు. లంక ప్లేయర్ మాథ్యూస్‌ను 'టైమ్డ్ ఔట్'గా బంగ్లా ప్లేయర్ పెవిలియన్‌కు చేర్చిన సంగతి తెలిసిందే. కాగా, సెయింట్ జార్జ్ పార్క్ వేదికగా రేపు భారత్-సౌతాఫ్రికా రెండో వన్డే ఆడనుంది.

Story first published: Monday, December 18, 2023, 16:41 [IST]
Other articles published on Dec 18, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+