For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

టెస్టు ఓపెనర్‌గా రోహిత్ శర్మ: ప్రెస్ మీట్‌లో కోహ్లీ ఏమన్నాడో తెలుసా? (వీడియో)

India vs South Africa 2019 : Kohli Speaks About Rohit As Test Opener || Oneindia Telugu
 India vs South Africa: Rohit Sharma not to be rushed in Test opener role, says Virat Kohli

హైదరాబాద్: టెస్టు ఓపెనర్‌గా రోహిత్ శర్మ సక్సెస్ అవుతాడా? లేదా అన్నది అప్పుడే చెప్పలేమని టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ అన్నాడు. మూడు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో భాగంగా విశాఖపట్నం వేదికగా బుధవారం తొలి టెస్టు మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో మంగళవారం విరాట్ కోహ్లీ మీడియా సమావేశంలో మాట్లాడాడు.

కోహ్లీ మాట్లాడుతూ "టెస్టు ఓపెనర్‌గా రోహిత్ శర్మ విషయంలో ఎప్పటి నుంచో చర్చిస్తున్నాం. రోహిత్ విషయానికి వస్తే బ్యాటింగ్ ఆర్డర్‌లో ముందు పంపడం అతడికి ఓ సరికొత్త స్పాట్‌ని కనుగొనడం లాంటిదే. ఓపెనర్‌గా వచ్చే బ్యాట్స్‌మన్‌కు అతడి ఆటపై అవగాహన వచ్చేవరకు సమయమివ్వాలి" అని వెల్లడించాడు.

ఓపెనర్‌గా రోహిత్ శర్మ

"ఇప్పటివరకు టెస్టుల్లో ఓపెనర్‌గా రోహిత్ శర్మను పంపే పరిస్థితి మనకు రాలేదు. ప్రస్తుతం ఇది రోహిత్ శర్మకు సువర్ణావకాశం. ఈ మార్పుని జట్టు మేనేజ్ మెంట్ సైతం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోంది. రోహిత్‌ విషయంలో మాకేమీ తొందరలేదు. విదేశాలతో పోలిస్తే భారత్‌లో కాస్త భిన్నంగా ఉంటుంది. ఓపెనింగ్ స్లాట్ అనేది గేమ్‌ను అర్ధం చేసుకునేందుకు ఒక చక్కటి అవకాశం" అని కోహ్లీ తెలిపాడు.

భారత్‌లోని పిచ్‍‌లు తొలి రోజు బ్యాటింగ్‌కు

"ఎవరో చెబితే సెహ్వాగ్‌ దూకుడుగా ఆడి శతకం బాదలేదని, అది అతడి సహజసిద్ధమైన బ్యాటింగ్‌. రోహిత్‌కు అలా ఆడే సామర్థ్యముందని చెప్పిన కోహ్లీ పరిస్థితులకు అనుగుణంగా కూడా ఆడతాడు. భారత్‌లోని పిచ్‍‌లు తొలి రోజు బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉంటాయి. ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, ఇంగ్లాండ్‌లతో పోలిస్తే షాట్లు ఆడేందుకు అవకాశం ఉంటుంది. అయితే, రోహిత్ టెస్టు ఓపెనర్‌గా సక్సెస్‌ అవుతాడా.. లేదా అప్పుడే తెలియదు. కచ్చితంగా రోహిత్‌ టెస్టు ఓపెనర్‌గా కూడా రాణిస్తాడు. సరైన సమయంలో రోహిత్‌ గాడిలో పడతాడు. ఈ విషయంలో రోహిత్‌కు సమయం ఇవ్వాలి" అని కోహ్లీ అన్నాడు.

కేఎల్ రాహుల్ విఫలం

విండిస్ పర్యటనలో ఓపెనర్‌గా బరిలోకి దిగిన కేఎల్ రాహుల్ విఫలం కావడంతో ఓపెనర్‌గా ఆడేందుకు రోహిత్ శర్మకు సువర్ణావకాశం వచ్చింది. మరోవైపు కేఎల్ రాహుల్ స్థానంలో ఈ టెస్టు సిరి‌స్‌కు సెలక్టర్లు యువ ఆటగాడు శుభమాన్ గిల్‌ను ఎంపిక చేశారు. విశాఖ వేదికగా బుధవారం నుంచి జరగనున్న తొలి టెస్టులో మయాంక్‌ అగర్వాల్‌తో కలిసి రోహిత్‌ ఇన్నింగ్స్‌ ఆరంభిస్తాడు.

వార్మప్ మ్యాచ్‌లో డకౌట్

ఇదిలా ఉంటే, టెస్టు సిరిస్‌కు ముందు దక్షిణాఫ్రికాతో జరిగిన మూడు రోజుల ప్రాక్టీస్‌ మ్యాచ్‌లో బోర్డు ప్రెసిడెంట్స్‌ ఎలెవన్‌ కెప్టెన్‌‌గా బరిలోకి దిగిన రోహిత్ శర్మ డకౌట్‌గా వెనుదిరిగిన సంగతి తెలిసిందే. దీంతో రోహిత్‌ శర్మ టెస్టు ఓపెనింగ్‌పై క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఉన్నారు.

Story first published: Tuesday, October 1, 2019, 15:28 [IST]
Other articles published on Oct 1, 2019
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+