India vs South Africa: 22 ఏళ్ల రికార్డు బద్దలు, మయాంక్-రోహిత్‌లు నమోదు చేసిన రికార్డులివే!

హైదరాబాద్: విశాఖ వేదికగా జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా ఓపెనర్లు సెంచరీలతో చెలరేగడంతో టీమిండియా భారీ స్కోరు దిశగా పయనిస్తోంది. రెండో రోజైన గురువారం లంచ్ విరామ సమయానికి 88 ఓవర్లకు గాను టీమిండియా వికెట్ నష్టానికి 324 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో మయాంక్ అగర్వాల్(138), పుజారా(6) పరుగులతో క్రీజులో ఉన్నారు.
202/0 ఓవర్‌నైట్ స్కోరుతో గురువారం రెండో రోజు ఆట కొనసాగించిన టీమిండియా జట్టు స్కోరు 317 పరుగుల వద్ద రోహిత్ శర్మ వికెట్‌ను చేజార్చుకుంది. రెండో రోజు ఆటలో మరో 115 పరుగులు జోడించిన తర్వాత రోహిత్ శర్మ(244 బంతుల్లో 176, 23 ఫోర్లు, 6 సిక్సులు) సఫారీ బౌలర్ మహరాజ్ బౌలింగ్‌లో వికెట్ కీపర్ క్వింటన్ డీకాక్ స్టంపౌట్ చేశాడు.
దీంతో రోహిత్ శర్మ నిరాశగా పెవిలియన్‌కు చేరాడు. టెస్టుల్లో రోహిత్ శర్మకు ఇది నాలుగో సెంచరీ. ఫలితంగా ధావన్, రాహుల్, పృథ్వీ షా తర్వాత ఓపెనర్‌గా బరిలోకి దిగిన తొలి ఇన్నింగ్స్‌లోనే సెంచరీ చేసిన నాలుగో భారత బ్యాట్స్‌మన్ రోహిత్ నిలిచాడు. మరోవైపు ఓపెనర్ మయాంక్ అగర్వాల్ కూడా సెంచరీతో సాధించాడు.
ఈ మ్యాచ్‌లో ఓపెనర్లు ఇద్దరూ 300కుపైగా పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేయడంతో అనేక రికార్డులను తమ ఖాతాలో వేసుకున్నారు. ఆ రికార్డులేంటో ఒక్కసారి చూద్దాం...

తొలి ఓపెనింగ్ జోడీగా
దక్షిణాఫ్రికా జట్టుపై సెంచరీలు సాధించిన తొలి ఓపెనింగ్ జోడీగా మయాంక్ అగర్వాల్, రోహిత్ శర్మలు నిలిచారు. అంతేకాదు భారత్-దక్షిణాఫ్రికా జట్ల మధ్య జరిగిన టెస్టుల్లో అత్యధిక భాగస్వామ్యాన్ని నమోదు చేసిన జోడీగా అరుదైన ఘనత సాధించారు. ఈ క్రమంలో 1996/97లో కోల్‌కతా వేదికగా జరిగిన టెస్టులో గ్యారీ కిరెస్టన్, ఆండ్రూ హుడ్సన్‌లు నెలకొల్పిన 236 పరుగుల రికార్డుని అధిగమించారు.

300 పరుగులకు పైగా ఓపెనింగ్ భాగస్వామ్యం
దక్షిణాఫ్రికా జట్టుపై 300 పరుగులకు పైగా ఓపెనింగ్ భాగస్వామ్యాన్ని నెలకొల్పిన జోడీగా మయాంక్ అగర్వాల్-రోహిత్ శర్మలు నిలిచారు. టెస్టు క్రికెట్‌లో భారత ఓపెనర్లు మూడొందలకు పైగా పరుగులు చేయడం ఇది మూడోసారి. భారత్-దక్షిణాఫ్రికా జట్ల మధ్య ఏ వికెట్‌కైనా అత్యుత్తమ భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. జట్టు స్కోరు 317 పరుగుల వద్ద రోహిత్ శర్మ వికెట్‌ను చేజార్చుకుంది.

తొలి టెస్టులో సెంచరీలు సాధించిన
సొంతగడ్డపై జరిగిన తొలి టెస్టులో సెంచరీలు సాధించిన తొలి ఓపెనింగ్ జోడీగా మయాంక్ అగర్వాల్-రోహిత్ శర్మలు నిలిచారు. టెస్టు క్రికెట్‌లో భారత ఓపెనర్లు తొలి ఇన్నింగ్స్‌లో ఇలా రెండు సెంచరీలు చేయడం ఇది 10వసారి. చివరగా 2018లో బెంగళూరు వేదికగా ఆప్ఘనిస్థాన్‌తో జరిగిన ఏకైక మ్యాచ్‌లో ఓపెనర్లు శిఖర్ ధావన్, మురళీ విజయ్‌లు సెంచరీలు సాధించారు.

అత్యధిక ఓపెనింగ్ పరుగుల భాగస్వామ్యం
భారత్ తరఫున అత్యధిక ఓపెనింగ్ పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పిన మూడో జోడిగా రోహిత్-మయాంక్‌లు నిలిచారు. భారత్ తరఫున అత్యధిక ఓపెనింగ్ పరుగుల భాగస్వామ్యం నెలకొల్పిన జోడీగా వినోద్ మన్కడ్-పంకజ్ రాయ్‌లు ఉన్నారు. 1955-56 సీజన్‌లో వీరిద్దరూ న్యూజిలాండ్‌పై 413 పరుగుల భాగస్వామ్యాన్ని సాధించారు. ఆ తర్వాత 2005-06 సీజన్‌లో పాకిస్తాన్‌పై వీరేంద్ర సెహ్వాగ్-రాహుల్ ద్రవిడ్‌ల జోడీ 410 పరుగులు సాధించారు.
413- Vinoo Mankad and Pankaj Roy, 1955-56
410 - Sehwag-Dravid, 2006
317 - Rohit-Mayank, 2019
289 - Vijay-Dhawan, 2013
276 - C Dempster-J Mills, 1930
260 - B Mitchell-J Siedle, 1931
254 - Gayle-Powell, 2012

2004లో కాన్పూర్ వేదికగా
ఇక, స్వదేశంలో దక్షిణాఫ్రికాపై అత్యధిక పరుగుల భాగస్వామ్యం నెలకొల్పిన జోడీగా మయాంక్-రోహిత్ శర్మలు నిలిచారు. ఈ క్రమంలో 2004లో కాన్పూర్ వేదికగా గౌతమ్ గంభీర్-వీరేంద్ర సెహ్వాగ్‌లు నెలకొల్పిన 218 పరుగుల రికార్డుని వీరి బద్దలు కొట్టారు. గతేడాది టెస్టు క్రికెట్‌లోకి అరంగేట్రం చేసిన మయాంక్ తన ఐదో టెస్టులో సెంచరీ సాధించాడు.

తొలి వికెట్‌కు 9 సిక్సర్లు
ఈ మ్యాచ్‌లో టీమిండియా తొలి వికెట్‌కు కోల్పోయే సరికి భారత ఓపెనర్లు కొట్టిన సిక్సర్లు 9. దాంతో టెస్టు ఫార్మాట్‌లో ఒక ఇన్నింగ్స్‌లో అత్యధిక సిక్సర్లు కొట్టిన భారత జోడిగా మయాంక్-రోహిత్‌లు నిలిచారు. ఈ క్రమంలోనే నవజ్యోత్ సిద్ధూ, మనోజ్ ప్రభాకర్‌లు(1993-94 సీజన్), వీరేంద్ర సెహ్వాగ్-మురళీ విజయ్(2009-10 సీజన్)ల పేరిట సంయుక్తంగా ఉన్న 8 సిక్సర్ల రికార్డును రోహిత్-మయాంక్‌లు బద్ధలు కొట్టారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications