For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

71 ఏళ్ల బ్రాడ్‌మన్ రికార్డు బద్దలు: రాంచీ టెస్టులో నమోదైన రికార్డులివే!

IND vs SA,3rd Test : Rohit Sharma Breaks Don-Bradman's 71 Year Old Record || Oneindia Telugu
India Vs South Africa: Rohit Sharma breaks Don Bradmans 71-year-old record

హైదరాబాద్: రాంచీ వేదికగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మూడో టెస్టులో టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మ డబుల్ సెంచరీ చేయడంతో ఓ అరుదైన రికార్డుని తన ఖాతాలో వేసుకున్నాడు. 71 ఏళ్ల ఆస్ట్రేలియా లెజెండరీ బ్యాట్స్‌మన్ డాన్ బ్రాడ్‌మన్ రికార్డుని రోహిత్ శర్మ బద్దలు కొట్టాడు.

భారత్‌లో ఆడిన 18 ఇన్నింగ్స్‌ (12 టెస్టులు)లో అతను 99.84 సగటుతో 1,298 పరుగులు సాధించాడు. ఇందులో ఆరు సెంచరీలు, ఐదు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అయితే, ఆస్ట్రేలియా గడ్డపై 33 టెస్టుల్లో 50 ఇన్నింగ్స్‌ ఆడిన డాన్‌ బ్రాడ్‌మన్ 98.22 సగటుతో 4322 పరుగులు సాధించాడు.

10 అంతకన్నా ఎక్కువ ఇన్నింగ్స్‌ల్లో

10 అంతకన్నా ఎక్కువ ఇన్నింగ్స్‌ల్లో

దీంతో 10 అంతకన్నా ఎక్కువ ఇన్నింగ్స్‌ల్లో రోహిత్‌ శర్మ అత్యధిక సగటుతో అగ్రస్థానంలోనిలిచాడు. కాగా, టెస్టుల్లో రోహిత్ శర్మకు ఇదే తొలి డబుల్ సెంచరీ కావడం విశేషం. వన్డేల్లో మూడుసార్లు డబుల్‌ సెంచరీ బాదిన రోహిత్‌ శర్మ ఇప్పుడు టెస్టుల్లో సైతం డబుల్ సెంచరీని తన ఖాతాలో వేసుకున్నాడు.

మూడు టెస్టుల్లో భారత్‌ తరఫున మూడు డబుల్‌ సెంచరీలు

మూడు టెస్టుల్లో భారత్‌ తరఫున మూడు డబుల్‌ సెంచరీలు

మరోవైపు వరుసగా మూడు టెస్టుల్లో భారత్‌ తరఫున మూడు డబుల్‌ సెంచరీలు నమోదు కావడం ఇది రెండోసారి. గతంలో ఇంగ్లండ్‌పై కోహ్లీ 235, కరుణ్‌ నాయర్‌ 303 నాటౌట్‌, కోహ్లీ 204 (బంగ్లాదేశ్‌పై) చేశారు. ఓ సిరీస్‌లో 500కుపైగా పరుగులు సాధించిన ఐదో భారత బ్యాట్స్‌మన్‌‌గా రోహిత్‌ మరో రికార్డుని తన ఖాతాలో వేసుకున్నాడు.

అజహరుద్దీన్‌ రికార్డు బద్దలు

అజహరుద్దీన్‌ రికార్డు బద్దలు

వినూ మన్కడ్‌, బుధి కుందరన్‌, గవాస్కర్‌ (5 సార్లు), సెహ్వాగ్‌‌లు ఈ జాబితాలో ముందంజలో ఉన్నారు. అంతేకాదు దక్షిణాఫ్రికాతో సిరీస్‌లో రెండుసార్లు 150కిపైగా పరుగులు చేసిన తొలి ఓపెనర్‌‌గా రోహిత్‌ శర్మ నిలిచాడు. ఇదే జట్టుపై 500కు పైగా పరుగులు సాధించిన భారత ఆటగాడిగా అజహరుద్దీన్‌ (1996/97లో 388 పరుగులు) రికార్డును రోహిత్‌ బద్దలు కొట్టాడు.

ఒకే సిరీస్‌లో ముగ్గురు

ఒకే సిరీస్‌లో ముగ్గురు

దక్షిణాఫ్రికాతో జరుగుతున్న ఈ సిరిస్‌లో భారత బ్యాట్స్‌మెన్‌ సరికొత్త రికార్డు నెలకొల్పారు. ఒకే సిరిస్‌లో ముగ్గురు భారత ఆటగాళ్లు డబుల్‌ సెంచరీలు చేయడం ఇదే తొలిసారి. తొలి టెస్టులో మయాంక్‌, రెండో టెస్టులో విరాట్‌, తాజాగా రోహిత్‌ ఈ ఫీట్‌ సాధించారు. అయితే 1955/56లో న్యూజిలాండ్‌తో జరిగిన సిరిస్‌లో కూడా మూడు డబుల్‌ సెంచరీలు సాధించారు.

Story first published: Monday, October 21, 2019, 8:47 [IST]
Other articles published on Oct 21, 2019
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+