Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

'ఓపెనింగ్‌ ప్రత్యేకమైన జాబ్‌.. రోహిత్‌ టెస్టు ఓపెనర్‌గా సక్సెస్‌ కావడం అంత ఈజీ కాదు'

India vs South Africa: Rohit Sharma as opener in Tests, Opening is a specialized job says Nayan Mongia

న్యూఢిల్లీ: టెస్టుల్లో ఓపెనింగ్‌ అనేది ఒక ప్రత్యేకమైన జాబ్‌. 'హిట్ మ్యాన్' రోహిత్ శర్మ టెస్టు ఓపెనర్‌గా సక్సెస్‌ కావడం అంత ఈజీ కాదు అని మాజీ వికెట్‌ కీపర్‌ నయాన్‌ మోంగియా పేర్కొన్నాడు. దక్షిణాఫ్రికాతో త్వరలో జరిగే టెస్ట్ సిరీస్ కోసం భారత జట్టును ప్రకటించే ముందు చీఫ్‌ సెలక్టర్‌ ఎంఎస్‌కే ప్రసాద్‌ రోహిత్‌ను ఓపెనర్‌గా టెస్టుల్లో కూడా పరీక్షించాలనుకుంటున్నామని తెలిపాడు. అందుకు అనుగుణంగానే కేఎల్‌ రాహుల్‌ను తప్పించడంతో రోహిత్‌ ఓపెనర్‌గానే బరిలోకి దిగడం ఖాయం అయింది.

మాజీల మద్దతు:

మాజీల మద్దతు:

టెస్ట్ యువ ఓపెనర్ మయాంక్ అగర్వాల్ జతగా రోహిత్ ఓపెనింగ్ చేయనున్నాడు. భారత మాజీలు సౌరవ్‌ గంగూలీ, వీవీఎస్‌ లక్ష్మణ్‌లు రోహిత్‌ను టెస్టు ఓపెనర్‌గా పంపడానికి మద్దతు తెలిపిన సంగతి తెలిసిందే. మరోవైపు ఆసీస్ ఆటగాడు ఆడమ్ గిల్ క్రిస్ట్ కూడా అండగా నిలవగా.. రోహిత్‌ టెస్టు ఓపెనర్‌గా సక్సెస్‌ కావడం అంత ఈజీ కాదు అని నయాన్‌ మోంగియా అంటున్నాడు. అంతేకాదు ఈ కొత్త ప్రతిపాదన అంతగా విజయవంతం కాకపోవచ్చు అని తన అభిప్రాయాన్ని తెలిపాడు.

ప్రత్యేకమైన జాబ్‌:

ప్రత్యేకమైన జాబ్‌:

నయాన్‌ మోంగియా మాట్లాడుతూ... 'టెస్టుల్లో ఓపెనింగ్‌ అనేది ఒక ప్రత్యేకమైన జాబ్‌. టెస్టుల్లో ఓపెనర్‌గా సెట్‌ కావడం చాలా కష్టం. రోహిత్‌ పరిమిత ఓవర్ల క్రికెట్‌లో ఓపెనర్‌గా బాగా రాణిస్తున్నాడు. అయితే టెస్టుల్లో ఓపెనింగ్‌ స్థానంలో రాణించడం వేరు. ఇక్కడ ఒక ప్రత్యేక మైండ్‌సెట్‌తో ఆడాలి. భారీ సర్దుబాటు అవసరం. వన్డే, టీ20ల్లో తరహాలో ఆడితే ఇక‍్కడ కుదరదు. టెస్టు క్రికెట్‌లో రోహిత్‌ ఓపెనర్‌గా సెట్‌ అయితే.. అతని పరిమిత ఓవర్ల క్రికెట్‌పై ప్రభావం చూపే అవకాశం ఉంది' అని మోంగియా పేర్కొన్నాడు.

ఓపెనింగ్‌ అవకాశం ఇవ్వాలనుకున్నాం:

ఓపెనింగ్‌ అవకాశం ఇవ్వాలనుకున్నాం:

'టెస్ట్ ఫార్మట్‌లో రోహిత్‌ శర్మకు ఓపెనింగ్‌ అవకాశం ఇవ్వాలని బీసీసీఐ భావించింది. రోహిత్ చాలా ఆసక్తిగా ఉన్నాడు. అతనితో పాటు సెలక్షన్ కమిటీలోని అందరూ ఆసక్తి కనబరుస్తున్నారు. అతనికి కొన్ని అవకాశాలు ఇచ్చి ఎలా రాణిస్తాడో చూడాలి. మిడిలార్డర్‌ బ్యాట్స్‌మన్‌గా రాణించని రోహిత్‌.. ఓపెనర్‌గా తన సత్తా ఏంటో నిరూపించుకుంటాడని భావిస్తున్నాం. వన్డే, టీ20ల్లో ఓపెనర్‌గా రాణిస్తున్నాడు. ఇప్పటివరకు టెస్టుల్లో రోహిత్‌కు ఓపెనింగ్‌ అవకాశం రాలేదు. దీంతో దక్షిణాఫ్రికా సిరీస్‌కు అతడిని ఓపెనర్‌గా ఎంపిక చేశాం. పరుగులు చేస్తాడని ఆశిస్తున్నాం' అని ఎమ్మెస్కే ఇంతకుముందు అన్నారు.

జట్టు:

జట్టు:

విరాట్ కోహ్లీ (కెప్టెన్), అజింక్య రహానే (వైస్‌కెప్టెన్), రోహిత్ శర్మ, వృద్ధిమాన్ సాహా (వికెట్ కీపర్), చటేశ్వర్ పుజారా, మయాంక్ అగర్వాల్, ఆర్ అశ్విన్, రవీంద్ర జడేజా, కుల్‌దీప్ యాదవ్, మొహ్మద్ షమీ, జస్ప్రీత్ బుమ్రా, ఇషాంత్ శర్మ, శుభ్‌మన్ గిల్‌.

Story first published: Monday, September 16, 2019, 15:15 [IST]
Other articles published on Sep 16, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+