IND vs SA: ఫైనల్ మ్యాచ్ రూల్స్ ఏంటి? రిజర్వ్‌డే ఉన్నా ఎందుకు ఉపయోగించరు?
టీ20 వరల్డ్ కప్‌లో ఆఖరి సమరానికి వేళైంది. బార్బడోస్ వేదికగా టైటిల్ పోరులో భారత్- దక్షిణాఫ్రికా ఇవాళ రాత్రి 8 గంటలకు తలపడనున్నాయి. 13 ఏళ్లుగా దూరమవుతున్న ప్రపంచకప్‌ను ఈసారి తప్పక దక్కించుకోవాలని భారత్ పట్టుదలతో బరిలోకి దిగుతోంది. మరోవైపు ప్రపంచకప్ ఫైనల్‌కు తొలిసారి అర్హత సాధించిన దక్షిణాఫ్రికా.. 'చోకర్స్' ముద్రను చెరిపేసుకుని ట్రోఫీతో ఇంటికి వెళ్లాలని ఉవ్విళ్లూరుతోంది.
అయితే ఫైనల్ మ్యాచ్‌కు వరుణుడు ముంపు పొచ్చి ఉంది. తుదిపోరుకు వర్షం ఆటంకం కలిగించే పరిస్థితులు ఉన్నాయి. మ్యాచ్ ప్రారంభానికి కొన్ని గంటల ముందు వర్షం పడే అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయి. స్థానిక కాలమాన ప్రకారం ఉదయం 10.30 గంటలకు మొదలవుతుంది. వాతావారణ శాఖ సూచన ప్రకారం అక్కడ ఉదయం 7 గంటల నుంచి రెండు గంటల పాటు వాన కురిసే ఛాన్స్ ఉంది.

అయితే భారీ వర్షం కాకుండా మోస్తారు జల్లులే కురిసే అవకాశాలు ఉన్నాయి. మ్యాచ్ ప్రారంభమయ్యే సమయానికి వర్షం తగ్గుముఖం పడుతుంది. కానీ తడి ఔట్ ఫీల్డ్ కారణంగా టాస్ ఆలస్యమయ్యే ఛాన్స్ ఉంది. అయితే ఓ ఇన్నింగ్స్ ముగిసిన తర్వాత వరుణుడు మళ్లీ ఎంట్రీ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. దీంతో మ్యాచ్‌కు ఆటంకం కలిగే పరిస్థితి ఏర్పడుతుంది.
వరుణుడు తీవ్ర ప్రతాపం చూపి మ్యాచ్‌ను కొనసాగడానికి అవకాశం లేని పరిస్థితి ఏర్పడినా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఆదివారం రిజర్వ్ డేగా ప్రకటించారు. అయితే రిజర్వ్ డే ఉన్నప్పటికీ శనివారమే మ్యాచ్‌ను ముగించడానికి ప్రయత్నిస్తారు. దాని కోసం సెకండ్ ఇన్నింగ్స్‌లో ఓవర్లను తగ్గించే అనుమతి కూడా ఉంది. వర్షం కారణంగా మ్యాచ్‌కు ఆటంకం కలిగితే శనివారం అదనంగా 190 నిమిషాలు కేటాయిస్తారు.
ఆ సమయానికి ఛేదన చేసే జట్టు కనీసం 10 ఓవర్లు ఆడితే మ్యాచ్ విజేతను ప్రకటిస్తారు. ఈ పరిస్థితుల్లో ఆదివారం ఆటను కొనసాగించాలని భావించరు. సెమీఫైనల్స్, ఫైనల్స్ నిబంధనల ప్రకారం మ్యాచ్ విజేతను ప్రకటించడానికి ఇరు జట్లు కనీసం 10 ఓవర్లు ఆడాల్సి ఉంటుంది. అయితే శనివారం అదనపు సమయంలో కూడా ఇరు జట్లు కనీసం 10 ఓవర్లు కూడా ఆడలేని స్థితిలో ఉంటే రిజర్వ్ డే రోజుకు ఆటను కొనసాగిస్తారు. రిజర్వ్ డే రోజు కూడా మ్యాచ్ జరక్కపోతే ఉమ్మడి విజేతలుగా ప్రకటిస్తారు.
పిచ్ ఎలా ఉంది?
బార్బడోస్ వేదికగా ఈ ప్రపంచకప్‌లో ఎనిమిది మ్యాచ్‌లు జరిగాయి. అందులో ఓ మ్యాచ్ రద్దయింది. మరో మ్యాచ్ సూపర్ ఓవర్‌కు దారితీసింది. మిగిలిన మ్యాచ్‌ల్లో మొదట బ్యాటింగ్ చేసిన జట్టు, ఛేదన చేసిన జట్టు చెరో మూడు సార్లు గెలిచాయి. బ్యాటింగ్, బౌలింగ్‌కు పిచ్ సమాన అవకాశాలు ఉంటాయి. టాస్ గెలిచిన జట్టు ఛేజింగ్‌కే మొగ్గు చూపొచ్చు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications