Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

కేప్‌టౌన్ టెస్టులో భారత్ ఓటమికి కారణాలు

India vs South Africa: Reasons that pegged back Kohli's men

హైదరాబాద్: స్వదేశంలో కోహ్లీసేన వరుస విజయాల పరంపరను చూసి దక్షిణాఫ్రికా గడ్డపై చరిత్ర సృష్టిస్తుందని అంతా భావించారు. క్రికెట్ అభిమానులు ఒకటి తలిస్తే, అక్కడ మరొకటి జరిగింది. కేప్ టౌన్ వేదికగా జరిగిన తొలి టెస్టులో కోహ్లీసేన 72 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. తొలి టెస్టులో భారత్ ఓటమి కారణాలెంటో ఒక్కసారి చుద్దామా...

తొలి ఇన్నింగ్స్‌లో ఎక్కువ పరుగులు సమర్పించుకోవడం
కేప్‌టౌన్ టెస్టులో భారత పేసర్ భువనేశ్వర్ కుమార్ 12/3తో చక్కటి శుభారభాన్నిచ్చాడు. దక్షిణాఫ్రికా ఓపెనర్లు మక్రమ్, డీన్ ఎల్గర్‌తో పాటు హషీమ్ ఆమ్లాను ఔట్ పెవిలియన్‌కు చేర్చి తొలి సెషన్‌లో పట్టు సాధించాడు. అయితే ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన డివిలియర్స్ మాత్రం నిలకడగా ఆడి స్కోరు బోర్డుని పరిగెత్తించాడు. దీంతో తొలి ఇన్నింగ్స్‌లో దక్షిణాఫ్రికా 286 పరుగులు చేసి ఆలౌటైంది.

ఎక్కడ రాంగ్ స్టెప్ వేశారు
ఆరంభంలో మూడు వికెట్లను నేలకూల్చిన భారత పేసర్లు ఆ తర్వాత లైన్‌పై ఫోకస్ పెట్టలేదు. బౌండరీలు బాదే బంతులను సంధించారు. భువీ (4.57), హార్దిక్ పాండ్యా (4.41), బుమ్రా (3.84), షమీ (2.93)లు పరుగులు సమర్పించుకున్నారు. వీరిలో షమీ కాస్త ఫరవాలేదనిపించినా, వికెట్లను తీయడంలో విఫలమయ్యాడు.

భారత బ్యాటింగ్
దక్షిణాఫ్రికా పిచ్‌లంటేనే బంతులు ఎంత వేగంగా బ్యాట్‌పైకి దూసుకొస్తాయో చెప్పాల్సిన పని లేదు. స్వదేశంలో ఉన్న పరిస్థితులు, విదేశీ గడ్డపై ఉన్న పరిస్థితులు విభిన్నంగా ఉంటాయి. అయితే ఆయా పరిస్థితులకు తగ్గట్లుగా భారత బ్యాట్స్‌మెన్ ఇంకా అలవాటు పడినట్లు లేరు. రెండో ఇన్నింగ్స్‌లో ఫిలాండర్ తన అద్భుతమైన బంతులతో భారత బ్యాట్స్‌మెన్ ఏవిధంగా ఇబ్బంది పెట్టాడో మనం చూశాం.

ఉదహరణ
రెండో ఇన్నింగ్స్‌లో కెప్టెన్ విరాట్ కోహ్లీ ఆటను చూస్తుంటే అతడు బౌన్సీ పిచ్‌కు అలవాటు పడినట్లే కనిపించింది. అయితే క్రీజులో నిలదొక్కుకునే సమయంలో విరాట్ కోహ్లీ... ఫిలాండర్ బౌలింగ్‌లో ఎల్బీగా వెనుదిరిగాడు.

తొలి టెస్టుకు జట్టు ఎంపిక
తొలి టెస్టుకు ఎంపిక చేసిన తుది జట్టుపై కూడా ఇప్పుడు సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. దక్షిణాఫ్రికా గడ్డపై మంచి ట్రాక్ రికార్డు ఉన్న రహానేను కాదని అతడి స్ధానంలో రోహిత్ శర్మను ఎందుకు ఎంపిక చేశారని పలువురు ప్రశ్నిస్తున్నారు. టెస్టుల్లో శిఖర్ ధావన్‌తో పోలిస్తే కేఎల్ రాహుల్ చక్కటి ఓపెనర్.

అంతేకాదు మురళీ విజయ్, కేఎల్ రాహుల్‌ల మధ్య చక్కటి సమన్వయం కూడా ఉంది. అలాంటి కేఎల్ రాహుల్‌ను పక్కనపెట్టి అతడి స్థానంలో శిఖర్ ధావన్‌ను ఎంపిక చేయడాన్ని కూడా అభిమానులు విమర్శిస్తున్నారు. తొలి ఓటమి నేపథ్యంలో రెండో టెస్టులోనైనా జట్టు మేనేజ్మెంట్ కేఎల్ రాహుల్, రహానేలకు చోటు కల్పిస్తుందో లేదో చూడాలి మరి.

ప్రిపరేషన్ లేకుండానే!
ఎటువంటి వార్మప్ మ్యాచ్ లేకుండానే కోహ్లీసేన తొలి టెస్టు మ్యాచ్ ఆడింది. నిజానికి తొలి టెస్టుకు ముందు రెండు రోజుల వార్మప్ మ్యాచ్ షెడ్యూల్ చేసినప్పటికీ, ఆ తర్వాత దానిని బీసీసీఐ ఎందుచేతనో రద్దు చేసింది. 2011లో టీమిండియా దక్షిణాఫ్రికాలో పర్యటించినప్పుడు అప్పట్లో జట్టులోని కొందరు ఆటగాళ్లు మాజీ కోచ్ గ్యారీ కిరెస్టర్ అకాడమీని సందర్శించారు. కానీ ఇప్పుడు అలా జరగలేదు. అప్పట్లో గ్యారీ కిరెస్టర్ అకాడమీలో జట్టులోని కొందరు ఆటగాళ్లు లైన్ అండ్ లెంత్ బంతులతో పాటు బౌన్సర్లను ప్రాక్టీస్ చేశారు.

తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.

Story first published: Tuesday, January 9, 2018, 14:09 [IST]
Other articles published on Jan 9, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+