
హైదరాబాద్: బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా (బీసీసీఐ) బుధవారం మొదటి టెస్ట్ గురించి మరో సంచలన వార్త విడుదల చేసింది. దక్షిణాఫ్రికా పర్యటనలో భారత జట్టుకు ఎంపికైన రవీంద్ర జడేజా రాలేని పరిస్థితుల్లో ఉన్నాడట. ఇంకో శుభవార్త ఏమంటే కాలికి గాయంతో మ్యాచ్ ఆడలేనని చెప్పిన ఇప్పుడు గాయం తగ్గిపోవడంతో ఆడేందుకు మళ్ల సిద్ధమయ్యాడు.
భారత్ జట్టు ఆల్-రౌండర్ రవీంద్ర జడేజా కొద్ది రోజులుగా వైరల్ జ్వరంతో బాధపడుతున్నాడు. అది గమనించిన వైద్యలు 48గంటల పాటు చికిత్స నిమిత్తం విశ్రాంతి కావాలంటూ అభిప్రాయపడ్డారు. జనవరి 5న మ్యాచ్ ప్రారంభం కానున్న నేపథ్యంలో ఆ రోజు ఉదయానికి గానీ జట్టులో ఎవరు అడాదే అని తేల్చిచెప్పలేం.
ఈ విషయం అలా ఉంచితే భారత ఓపెనింగ్ బ్యాట్స్‌మన్ ధావన్ దక్షిణాఫ్రికా టూర్‌కు సెలక్టై కాలి గాయంతోనే మ్యాచ్ ఆడేందుకు వచ్చాడు. అయితే ప్రాక్టీస్‌లోనే ధావన్ ఆడలేడంటూ మ్యాచ్‌కు దూరం పెట్టారు. కాగా, ఈ రెండు రోజుల్లో ధావన్ మళ్లీ కోలుకుని ఫిట్ అని నిరూపించుకున్నాడు. దీంతో మళ్లీ మ్యాచ్ ఆడేందుకు పూర్తి ఫిట్‌నెస్‌తో ఉన్నట్లు ధావన్ స్పష్టం చేశాడు.
మూడు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ ఆడనున్న భారత జట్టు:
విరాట్ కోహ్లి (కెప్టెన్), ఎం విజయ్, కెఎల్ రాహుల్, శిఖర్ ధావన్, చేతేశ్వర్ పుజారా,
అజింక్య రహానే (వైస్ కెప్టెన్), రోహిత్ శర్మ, వృద్ధిమాన్ సాహా (వికెట్ కీపర్), ఆర్ అశ్విన్, రవీంద్ర జడేజా, పార్థివ్ పటేల్ (వికెట్కీపర్), హరికే పాండ్య,
భువనేశ్వర్ కుమార్, మొహమ్మద్ షామీ, ఇషాంత్ శర్మ, ఉమేష్ యాదవ్, జాస్ప్రీత్ బుమ్రా.
తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.