
అగ్ర స్థానంలో కుంబ్లే:
మాజీ స్పిన్నర్, మాజీ కెప్టెన్ అనిల్ కుంబ్లే టీమిండియా తరపున దక్షిణాఫ్రికాపై అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా మొదటి స్థానంలో ఉన్నాడు. కుంబ్లే 21 టెస్టుల్లో 84 వికెట్లు తీసాడు. మాజీ పేసర్ జగవల్ శ్రీనాథ్ 13 టెస్టుల్లో 64 వికెట్లతో రెండో స్థానంలో ఉన్నాడు. హర్భజన్ సింగ్ 11 టెస్టుల్లో 60 వికెట్లతో మూడో స్థానంలో కొనసాగుతున్నాడు. ఇక రవిచంద్రన్ అశ్విన్ 9 టెస్టుల్లో 52 వికెట్లు తీసి నాలుగో స్థానంలో ఉన్నాడు.

మరో 9 వికెట్లు తీస్తే:
మూడో టెస్టులో అశ్విన్ 8 వికెట్లు తీస్తే భజ్జీతో సమానంగా నిలుస్తాడు. ఇక 9 వికెట్లు తీస్తే అతడిని అధిగమించి మూడో స్థానానికి చేరుకుంటాడు. మాజీ పేస్ బౌలర్ జహీర్ ఖాన్ దక్షిణాఫ్రికాపై 12 మ్యాచ్‌ల్లో 40 వికెట్లు పడగొట్టి ఐదో స్థానంలో ఉన్నాడు. ప్రస్తుత ఫామ్ చూస్తే.. అశ్విన్ సునాయాసంగా భజ్జీ రికార్డును బద్దలు కొట్టే అవకాశం ఉంది. స్వదేశంలో మ్యాచ్ కాబట్టి అశ్విన్‌కు మరో సానుకూలత.

27 సార్లు 5 వికెట్లు:
అశ్విన్ మొత్తం 67 టెస్టుల్లో 356 వికెట్లు పడగొట్టాడు. ఇందులో ఐదు వికెట్లు 27 సార్లు తీసాడు. భారత్ ఇప్పటికే 2-0తో సిరీస్‌ను కైవసం చేసుకుంది. మూడో టెస్టులోనూ గెలిచి దక్షిణాఫ్రికాను వైట్‌వాష్ చేయాలని భావిస్తోంది. భారత్ ప్రస్తుతం 200 పాయింట్లతో ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌లో అగ్రస్థానంలో కొనసాగుతున్న విషయం తెలిసిందే.

వ్యతిరేకించిన కుంబ్లే:
అశ్విన్ విషయంలో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ఫ్రాంఛైజీ వెనక్కి తగ్గింది. ఐపీఎల్ 2019 సీజన్‌లో కెప్టెన్‌గా జట్టుని విజయంతంగా నడిపించలేకపోయాడని భావించిన ఫ్రాంఛైజీ.. అతడ్ని ఢిల్లీ క్యాపిటల్స్‌కి ఇచ్చేయాలని చర్చలు జరిపింది. అంతేకాదు అశ్విన్ ధరకి సమానమైన ఆటగాళ్లని తీసుకోవాలని చూసింది. కానీ ఇటీవల కింగ్స్ ఎలెవన్ పంజాబ్ హెడ్ కోచ్‌గా ఎంపికైన అనిల్ కుంబ్లే ఆ నిర్ణయాన్ని వ్యతిరేకించడంతో మళ్లీ వెనక్కి తగ్గింది.


Click it and Unblock the Notifications












