భారత్ మరో సమరానికి సిద్ధమైంది. దక్షిణాఫ్రికా పర్యటనలో టీ20 సిరీస్‌ను సమం చేసి వన్డే సిరీస్‌ను కైవసం చేసుకున్న టీమిండియా టెస్టు సిరీస్‌పై కన్నేసింది. రెండు టెస్టుల సిరీస్‌లో భాగంగా సెంచూరియన్ వేదికగా భారత్‌తో జరుగుతున్న తొలి టెస్టులో టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా బౌలింగ్ ఎంచుకుంది.
టాస్ గెలిచిన అనంతరం సౌతాఫ్రికా కెప్టెన్ బవుమా మాట్లాడుతూ.. ''ముందుగా బౌలింగ్ చేస్తాం. వికెట్ కవర్ కింద కప్పి ఉంచారు. తేమను ఉపయోగించుకొని పైచేయి సాధించాలని భావిస్తున్నాం.ఎంగిడీ ఇంకా పూర్తిగా కోలుకోలేదు. నలుగురు సీమర్లతో బరిలోకి దిగుతున్నాం. నార్గే బర్గర్, డేవిడ్ బెడింగ్‌హామ్ అరంగేట్రం చేస్తున్నారు. భారత్‌తో మ్యాచ్ అంటే ఎప్పడూ కష్టమే. కానీ మేం సిద్ధంగా ఉన్నాం'' అని అన్నాడు.

టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ మాట్లాడుతూ.. '' గతంలో ఇక్కడికి వచ్చాం. ఇక్కడ పరిస్థితుల గురించి అవగాహన ఉంది. పరుగులు చేయడానికి ప్రయత్నించాలి, తర్వాత బౌలర్లు మిగిలిన పనిని పూర్తి చేస్తారు. మొదట బ్యాటింగ్ చేయడం సవాలే. కానీ మేం దానికి సిద్ధంగా ఉన్నాం. గత రెండు పర్యటనల్లో సిరీస్ విజయానికి దగ్గర వరకు వచ్చాం. మా జట్టుపై మాకు నమ్మకం ఉంది''
'' ఇవాళ నలుగురు సీమర్లు, ఒక స్పిన్నర్‌తో బరిలోకి దిగుతున్నాం. జడేజా స్థానంలో అశ్విన్ ఆడుతున్నాడు. వెన్నునొప్పితో జడేజా ఇబ్బంది పడుతున్నాడు. అందుకే అశ్విన్ తుదిజట్టులోకి వచ్చాడు. అశ్విన్ నాణ్యమైన స్పిన్నర్. ఇవాళ మ్యాచ్‌లో ప్రసిధ్ కృష్ణ అరంగేట్రం చేస్తున్నాడు. అతడితో పాటు సీమర్లు బుమ్రా, సిరాజ్, శార్దూల్ బరిలోకి దిగుతున్నారు'' అని రోహిత్ శర్మ అన్నాడు.
31 ఏళ్లుగా దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్తున్న భారత్‌కు టెస్టు సిరీస్ విజయం అందని ద్రాక్షగా మిగిలింది. 1992 నుంచి ఇప్పటివరకు ఎనిమిది సార్లు సఫారీ గడ్డకు వచ్చింది. కానీ టెస్టు సిరీస్‌ను అందుకోలేకపోయింది. 2010లో మూడు టెస్టుల సిరీస్‌ను 1-1తో సమం చేయడమే టీమిండియా అత్యుత్తమ ప్రదర్శన. అయితే ఈ సారి చరిత్ర సృష్టించాలని టీమిండియా పట్టుదలతో బరిలోకి దిగుతుంది.
దక్షిణాఫ్రికా: డీన్ ఎల్గర్, మార్క్‌రమ్, టోనీ డి జోర్జి, టెంబా బవుమా (కెప్టెన్), కీగన్ పీటర్సన్, డేవిడ్ బెడింగ్‌హామ్, కైల్ వెర్రెయిన్నే, మార్కో జాన్సెన్, గెరాల్డ్ కొయెట్జీ, కగిసో రబాడ, నాండ్రే బర్గర్
భారత్ : రోహిత్ శర్మ(కెప్టెన్), యశస్వి జైస్వాల్, శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, రవిచంద్రన్ అశ్విన్, శార్దూల్ ఠాకూర్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, ప్రసిధ్ కృష్ణ