ప్రపంచంలోనే అత్యుత్తమ బౌలింగ్ టీమిండియా సొంతం.. డెడ్ వికెట్లపై కూడా రాణిస్తున్నారు!!

హైదరాబాద్: ప్రపంచంలోనే అత్యుత్తమ బౌలింగ్ టీమిండియాకు ఉంది. డెడ్ వికెట్లపై కూడా వికెట్లు తీస్తూ అద్భుతంగా రాణిస్తున్నారు అని పాకిస్థాన్ మాజీ క్రికెటర్, కామెంటేటర్ రమీజ్ రాజా అన్నాడు. టీమిండియా టెస్టుల్లో నిలకడగా రాణించడానికి పేస్ బౌలింగ్ ప్రధాన కారణం. గతంలో జట్టు ప్రతిసారీ ఓ పేసర్‌ను తక్కువగా తీసుకునేది. బౌలింగ్ బలహీనత ఉండడంతో.. అదనపు బ్యాట్స్‌మన్ అవసరం ఉండేది. కానీ.. ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది.
గత 3-4 సంవత్సరాలలో భారత బౌలర్లు గతంలో కంటే ఎంతో మెరుగ్గా రాణిస్తున్నారు. జస్ప్రీత్ బుమ్రా, మొహమ్మద్ షమీ, ఉమేష్ యాదవ్, ఇశాంత్ శర్మ లాంటి అత్యుత్తమ ఫాస్ట్ బౌలర్లు టీమిండియాకు ఉన్నారు. దక్షిణాఫ్రికా, ఇంగ్లాండ్‌లో టీమిండియా మెరుగ్గా రాణించటానికి వీరే కారణం. ఆర్ అశ్విన్, రవీంద్ర జడేజాలు కూడా అద్భుతంగా రాణిస్తున్నారు. బౌలింగ్ అండతో ఆస్ట్రేలియాలో తొలి టెస్ట్ సిరీస్‌ను కూడా గెలుచుకుంది. ఇటీవలే పూణేలో జరిగిన రెండో టెస్టులో ప్రోటీస్‌ను ఓడించి వరుసగా 11వ సిరీస్‌ను సొంతం చేసుకుంది. ప్రస్తుతం అందరూ భారత బౌలింగ్ గురించే మాట్లాడుకుంటున్నారు.
తాజాగా రమీజ్ రాజా కూడా భారత బౌలింగ్‌ను ప్రశంసించాడు. 'టెస్టుల్లో విజయం సాధించాలంటే 20 వికెట్లు తీయాలని నేను బలంగా నమ్ముతాను. ప్రస్తుతం భారత్‌కు ఆ సత్తా ఉంది. టీమిండియా ప్రపంచంలోనే అత్యుత్తమ బౌలింగ్ దాడిని కలిగి ఉంది. పేస్, స్పిన్ విభాగాల్లో అత్యుత్తమ బౌలర్లు ఉన్నారు. మంచి ఫీల్డింగ్ నైపుణ్యంతో పాటు గొప్ప కెప్టెన్ భారత్ సొంతం. బౌలర్లు అందరూ సమిష్టిగా రాణిస్తున్నారు' అని అన్నాడు.
'పుణె టెస్టులో మొహమ్మద్ షమీ బౌలింగ్ సూపర్. డెడ్ వికెట్లపై కూడా మెరుగ్గా రాణిస్తున్నాడు. ఉపఖండ పిచ్‌లపై లైన్ అండ్ లెంగ్త్ విషయంలో దక్షిణాఫ్రికా బౌలర్లు అతడి నుంచి ఎంతో నేర్చుకోవాలి. విరాట్ కోహ్లీ గురించి ఏం చెప్పినా తక్కువే. జట్టును ముందుండి నడిపిస్తున్నాడు. కోహ్లీ ఎప్పటినుండే కెరీర్‌లో అత్యుత్తమ ఫామ్‌లో ఉన్నాడు' అని రమీజ్ రాజా పేర్కొన్నాడు. మూడు టెస్టుల సిరీస్‌లో భారత్ మరో మ్యాచ్ మిగిలి ఉండగానే 2-0తో కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. చివరి టెస్ట్ రాంచిలో 19న ప్రారంభం కానుంది. ఐసీసీ ఛాంపియన్‌షిప్ పాయింట్ల పట్టికలో భారత్ 200 పాయింట్లు సాధించి అగ్రస్థానంలో ఉంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications