న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

దక్షిణాఫ్రికా vs భారత్‌: పంత్‌కి ఆఖరి ఛాన్స్.. నిరూపించుకోకపోతే ఇక అంతే!!

India vs South Africa: Pressure mounts on Rishabh Pant as teams gear up for second T20I

మొహాలి: చాలా రోజుల తర్వాత స్వదేశంలో పరుగుల వరద పారిద్దామనుకున్న టీమిండియాకు గత ఆదివారం షాక్ తగిలింది. ఆదివారం ధర్మశాల వేదికగా జరగాల్సిన తొలి టీ20 మ్యాచ్ వర్షం కారణంగా.. కనీసం టాస్ కూడా పడకుండానే రద్దయింది. ఇక మిగిలిన రెండు టీ20ల్లో సత్తా చాటేందుకు భారత్‌-దక్షిణాఫ్రికా సిద్ధమయ్యాయి. బ్యాటింగ్‌కు అనుకూలించే మొహాలీలో పరుగుల వరద పారించేందుకు ఇరు జట్లు సిద్ధమయ్యాయి.

<strong>కోచ్‌ను అమాంతం గాల్లోకి ఎగిరి తన్నిన ఆటగాడు.. ఎందుకో తెలుసా? (వీడియో)</strong>కోచ్‌ను అమాంతం గాల్లోకి ఎగిరి తన్నిన ఆటగాడు.. ఎందుకో తెలుసా? (వీడియో)

టీమిండియాను ఓపెనింగ్ సమస్య బాధిస్తున్నా.. శిఖర్ ధావన్ బ్యాట్ జూలుపిస్తే సద్దుమణగనుంది. ఇక నాలుగో స్థానంలో మనీశ్‌ పాండేకు తుదిజట్టులో అవకాశం దక్కుతుందా.. లేక శ్రేయస్‌ అయ్యర్‌కు చాన్స్‌ ఇస్తారా అనేది ఆసక్తికరంగా మారింది. అనంతరం వచ్చే యువ వికెట్‌ కీపర్‌ రిషభ్‌ పంత్‌ ఫామ్ ఆందోళనకరంగా మారింది. సీనియర్ వికెట్‌ కీపర్‌ ఎంఎస్ ధోనీ స్వయంగా విరామం తీసుకోవడంతో ఆ స్థానం భర్తీ చేసిన పంత్ ఆకట్టుకోలేకపోయాడు.

2017 ఫిబ్రవరిలో అరంగేట్రం చేసిన రిషబ్ పంత్.. ఇప్పటి వరకూ 18 మ్యాచ్‌లాడి 302 పరుగులు మాత్రమే చేసాడు. ఇందులో రెండు అర్ధ శతకాలు మాత్రమే ఉన్నాయి. పవర్ హిట్టర్‌గా పేరొందిన పంత్ సగటు 21.57‌ కూడా ఏమంత బాగాలేదు. విండీస్ పర్యటనలో ఘోరంగా విఫలమైన పంత్‌కు కోచ్, కెప్టెన్ మరో అవకాశం ఇచ్చారు. దీంతో దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్‌లో అతడు తీవ్ర ఒత్తిడితో బరిలోకి దిగుతున్నాడు.

పంత్ తనకు అలవాటైన పేలవ షాట్ సెలక్షన్‌ను పక్కన పెట్టి ఈ పర్యటనలో పరుగులు చేస్తేనే మళ్లీ జట్టులో చోటు దక్కుతుంది. ఈ సిరీస్‌లో నిరూపించుకోకపోతే అతనిపై వేటు వేసి ఇషాన్ కిషన్ లేదా సంజు శాంసన్‌లకి అవకాశమివ్వాలని భారత సెలక్టర్లు ఆలోచిస్తున్నారు. ఇప్పటికే హెడ్ కోచ్ రవిశాస్త్రి, కెప్టెన్ విరాట్ కోహ్లీ హెచ్చరించిన నేపథ్యంలో ఫామ్ నిరూపించుకోకపోతే పంత్‌కి ఆఖరి పర్యటన ఇదే అవనుంది.

Story first published: Wednesday, September 18, 2019, 16:03 [IST]
Other articles published on Sep 18, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X