Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

'ఆ ధాటికి తట్టుకోవాలంటే మరికొంత సమయం కావాలి'

హైదరాబాద్: భారత్‌తో తలపడి వరుసగా రెండు పరాజయాలను ఎదుర్కొన్న సఫారీ జట్టు మూడో వన్డే గెలవాలనే కాంక్షతో భారీగా సన్నద్ధమవుతోంది. ఇది చాలదన్నట్లు సఫారీ జట్టుకు తాత్కాలిక కెప్టెన్‌గా కొనసాగుతోన్న మార్‌క్రమ్ ఇంకాస్త వ్యవధి కావాలంటూ అభిప్రాయపడ్డాడు.

కేప్‌టౌన్‌లో గెలవకపోతే:

కేప్‌టౌన్‌లో గెలవకపోతే:

రెండో వన్డే తర్వాత మాట్లాడిన మర్‌క్రామ్‌..' సిరీస్‌లో నిలబడాలంటే కచ్చితంగా మూడో వన్డేలో గెలుపు మాకు అవసరం. ఆ మేరకు సన్నద్ధమవడానికి యత్నిస్తాం. అయితే తగినంత సమయం లేదనే చెప్పాలి. కేవలం రెండు రోజుల సమయం మాత్రమే ఉంది. రెండో వన్డేలో మా జట్టు సమష్టి ప్రదర్శన చేయలేదు. కేప్‌టౌన్‌లో వన్డే మాకు చాలా చాలా కీలకం. ఆ వన్డేలో అంతా రాణిస్తారని ఆశిస్తున్నా. రెండు వన్డేల్లో ఎదురైన పరాభవాల నుంచి గుణపాఠం నేర్చుకుని తదుపరి మ్యాచ్‌కు సిద్ధం కావాల్సి ఉంది.' అని మర్‌క్రామ్‌ తెలిపాడు.

India vs South Africa : How India Crush South Africa by 9 Wickets
 తాత్కాలిక సారథిగా కొత్త బాధ్యతలు:

తాత్కాలిక సారథిగా కొత్త బాధ్యతలు:

ఆదివారం మ్యాచ్ జరగక ముందు మీడియా సమావేశంలో పాల్గొన్న మార్‌క్రమ్ భారత జట్టును మేము విజయవంతంగా ఎదుర్కోగలమని ఇదే కెప్టెన్ చెప్పడం గమనార్హం. రెండో వన్డేకు ముందు దక్షిణాఫ్రికా రెగ్యులర్‌ కెప్టెన్‌ డుప్లెసిస్‌ గాయపడటంతో ఆ స్థానంలో మర్‌క్రామ్‌కు సారథిగా బాధ్యతలు అప్పజెప్పారు. దక్షిణాఫ్రికా-భారత్‌ జట్ల మధ్య మూడో వన్డే కేప్‌టౌన్‌లో బుధవారం జరగనుంది.

ఇతనిది అదే తంతు:

ఇతనిది అదే తంతు:

భారత మణికట్టు స్పిన్నర్లని ఎదుర్కోవాలంటే దక్షిణాఫ్రికా బ్యాట్స్‌మెన్‌కి కొంచెం సమయం పడుతుందని ఆ జట్టు బ్యాటింగ్ కోచ్ డేల్ బెకెన్‌స్టైన్ అభిప్రాయపడ్డాడు. సెంచూరియన్ వేదికగా ఆదివారం జరిగిన రెండో వన్డేలో భారత స్పిన్నర్లు చాహల్ (5/22), కుల్దీప్ యాదవ్ (3/20) ధాటికి దక్షిణాఫ్రికా జట్టు 118 పరుగులకే కుప్పకూలింది.

 బ్యాట్స్‌మెన్ తడబాటు:

బ్యాట్స్‌మెన్ తడబాటు:

గతంలో తాము ఎదుర్కొన్న స్పిన్నర్ల కంటే.. చాహల్, కుల్దీప్ తక్కువ వేగంతో బంతులు వేస్తుండటం కూడా సఫారీ బ్యాట్స్‌మెన్ తడబాటుకి మరో కారణమని డేల్ వెల్లడించాడు. రెండో వన్డేలో లక్ష్యాన్ని భారత్ 20.3 ఓవర్లలోనే ఛేదించి ఆరు వన్డేల సిరీస్‌లో 2-0తో ఆధిక్యంలో నిలిచింది. మూడో వన్డే బుధవారం కేప్‌టౌన్ వేదికగా జరగనుంది.

 వరుస పెట్టి వికెట్లు తీశారు:

వరుస పెట్టి వికెట్లు తీశారు:

'అప్పట్లో అనిల్ కుంబ్లే కూడా ఇలానే బ్యాట్స్‌మెన్‌కి దొరక్కుండా బంతుల్ని సంధించేవాడు. అయితే.. అతని బంతులు కొంచెం వేగంగా వచ్చేవి. కానీ.. చాహల్, కుల్దీప్ విసురుతున్న బంతులు చాలా నెమ్మదిగా వస్తున్నాయి. దక్షిణాఫ్రికా జట్టుకీ ఇద్దరు మణికట్టు స్పిన్నర్లు అందుబాటులో ఉన్నారు. వారి బౌలింగ్‌లో ఎక్కువగా ప్రాక్టీస్ చేస్తాం' అని డేల్ బెకెన్‌స్టైన్ వెల్లడించాడు. తొలి వన్డేలో చాహల్, కుల్దీప్ ఇద్దరూ కలిసి 5 వికెట్లు తీయగా.. రెండో వన్డేలో ఆ సంఖ్య 8కి చేరడం విశేషం.

తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.

Story first published: Monday, February 5, 2018, 15:19 [IST]
Other articles published on Feb 5, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+