India vs South Africa: రాంచీ టెస్ట్ మ్యాచ్‌కు ధోనీ.. స్టేడియానికి పోటెత్తనున్న అభిమానులు!!

రాంచీ: మూడు టెస్ట్ మ్యాచ్‌ల ఫ్రీడమ్ సిరీస్‌లో భాగంగా అక్టోబర్ 19 నుంచి భారత్-దక్షిణాఫ్రికా జట్ల మధ్య చివరిదైన మూడో టెస్ట్ ప్రారంభం కానుంది. రాంచీ వేదికగా జార్ఖండ్ స్టేట్ క్రికెట్ అసోసియేషన్ (జెఎస్‌సిఎ) స్టేడియంలో శనివారం ప్రారంభం కానున్న మూడో మ్యాచ్‌కు భారత మాజీ కెప్టెన్, వికెట్ కీపర్ మహేంద్రసింగ్ ధోనీ హాజరుకానున్నారు. మూడో టెస్ట్ తొలి రోజే మ్యాచ్ చూడడానికి ధోనీ మైదానానికి వస్తున్నాడని సమాచారం తెలుస్తోంది.

టెస్ట్ మ్యాచ్‌కు ధోనీ
'ధోనీ శనివారం రాంచీ చేరుకుంటాడు. అతను ఖచ్చితంగా మ్యాచ్‌కు హాజరవుతాడు. నాకు తెలిసినంతవరకు ధోనీ మొదటి రోజే మ్యాచ్ చూడడానికి మైదానంకు వస్తాడు' అని ధోనీ చిన్ననాటి కోచ్ ఓ మీడియాకు తెలిపాడు. అయితే ధోనీ పక్కాగా మ్యాచ్‌కు హాజరవుతాడని మాత్రం చెప్పలేం. ఇదిలా ఉంటే.. 'ధోనీ రాంచీలో ఉంటే మ్యాచ్‌కు ఖచ్చితంగా వస్తాడు. అయితే ఏ రోజు వస్తాడో చెప్పలేం. చివరిసారి భారత్-ఆస్ట్రేలియా టెస్ట్ మ్యాచ్‌కు చివరి రోజు వచ్చాడు. ఈసారి కూడా మ్యాచ్‌కు హాజరవుతాడని భావిస్తున్నాం' అని ధోనీ సన్నిహిత వర్గాలు అంటున్నాయి.

భారీ సంఖ్యలో అభిమానులు
ధోనీ స్వస్థలం రాంచీ. అక్కడ ధోనీకి విపరీతమైన క్రేజ్ ఉన్న విషయం తెలిసిందే. ఒకవేళ ధోనీ మ్యాచ్‌కు కచ్చితంగా వస్తాడని తెలిస్తే.. అతనిని చూడటానికి భారీ సంఖ్యలో అభిమానులు స్టేడియానికి వస్తారు. ధోనీ వస్తే.. రాంచీ స్టేడియం మొత్తం అభిమానులతో కళకళలాడనుంది. ఇప్పటికే రెండు టెస్టులు గెలిచిన భారత జట్టు సిరీస్‌ను సొంతం చేసుకోగా.. మూడో టెస్టులోనూ విజయం సాధించి సఫారీలను వైట్‌వాష్ చేయాలని భావిస్తోంది.

క్రికెట్‌కు తాత్కాలిక విరామం:
ప్రపంచకప్ అనంతరం ధోనీ క్రికెట్‌కు తాత్కాలిక విరామం ప్రకటించాడు. భారత ఆర్మీకి సేవలందిచాలనే ఉద్దేశంతో వెస్టిండీస్ పర్యటనకు దూరమయ్యాడు. దక్షిణాఫ్రికా సిరీస్‌కు కూడా అందుబాటులో లేడు. నవంబర్‌లో బంగ్లాదేశ్‌తో జరగనున్న టీ20 సిరీస్‌కు కూడా అందుబాటులో ఉండకపోవచ్చని సమాచారం. ప్రస్తుతం ధోనీ కుటుంబంతో గడుపుతున్నాడు.

కుల్‌దీప్‌కు చోటు:?
మూడో టెస్టు కోసం టీమిండియా కష్టపడుతోంది. గురువారం రాంచీ మైదానంలో ప్రాక్టీస్ చేయగా.. బీసీసీఐ ఆ ఫొటోలను ట్విటర్‌లో అభిమానులతో పంచుకుంది. రాంచీ పిచ్ స్పిన్నర్లకు అనుకూలమైనందున మూడో టెస్టులో ఒక పేసర్‌ని తగ్గించి.. స్పిన్నర్ కుల్‌దీప్ యాదవ్‌ను జట్టులోకి తీసుకునే అవకాశం ఉందని సమాచారం.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications