T20WC: మేం కాదు..కప్ అందుకోవడానికే అతనే అర్హుడు- రోహిత్ శర్మ
భారత్ జగజ్జేతగా నిలిచింది. ఫైనల్‌లో దక్షిణాఫ్రికాను చిత్తుచేసి టీ20 వరల్డ్ కప్ సాధించింది. 13 ఏళ్ల ప్రపంచకప్, 11 ఏళ్ల ఐసీసీ టోర్నీ నిరీక్షణకు తెరపడింది. కాస్త ఆలస్యమైనా చరిత్రలో నిలిచేలా తుదిపోరులో టీమిండియా విజయం సాధించింది. గెలుపు ఆశలు లేని స్థితి నుంచి అద్భుతంగా పోరాడింది. నరాలు తెగే ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్‌లో ఏడు పరుగుల తేడాతో విజయం సాధించింది.
మొదట భారత్ నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్లకు 176 పరుగులు చేసింది. విరాట్ కోహ్లి (76; 59 బంతుల్లో, 6 ఫోర్లు, 2 సిక్సర్లు), అక్షర్ పటేల్ (47; 31 బంతుల్లో, 1 ఫోర్, 4 సిక్సర్లు) సత్తాచాటారు. మహరాజ్ (2/23), నోకియా (2/26) చెరో రెండు వికెట్లు తీశారు. అనంతరం ఛేదనలో దక్షిణాఫ్రికా 20 ఓవర్లలో ఎనిమిది వికెట్లకు 169 పరుగులు చేసింది. హెన్రిచ్ క్లాసెన్ (52; 27 బంతుల్లో, 2 ఫోర్లు, 5 సిక్సర్లు) పోరాడాడు. హార్దిక్ (3/20) మూడు వికెట్లు, బుమ్రా (2/18), అర్షదీప్ సింగ్ (2/20) చెరో రెండు వికెట్లతో విజృంభించారు.

కాగా, విజయానంతరం భారత కెప్టెన్ రోహిత్ శర్మ మాట్లాడాడు. అందరి కంటే తమ జట్టు ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్ ప్రపంచకప్ ట్రోఫీకి అసలైన అర్హుడు అని అన్నాడు. రెండు దశాబ్దాలకు పైగా భారత క్రికెట్‌కు ద్రవిడ్ సేవలందించాడని తెలిపాడు. ''ప్రపంచకప్ ట్రోఫీకి అందరి కంటే రాహుల్ ద్రవిడే అర్హుడు. గత 20-25 ఏళ్లు భారత క్రికెట్ అతనెంతో చేశాడు. అయితే అతని ఖాతాలో అంతకుముందు ప్రపంచకప్ ఒక్కటి మిస్ అయ్యింది. ఇప్పుడు సంపూర్ణం అయ్యింది''

''ద్రవిడ్ కోసం దీన్ని సాధించిందుకు జట్టు మొత్తం సంతోషంగా ఉంది. ఇక ద్రవిడ్ ఎంతో ఉత్సాహంగా, గర్వంగా ఉన్నారో మీరు చూశారు!'' అని రోహిత్ శర్మ అన్నాడు. సాధారణంగా భావోద్వేగాలను నియంత్రించుకునే రాహుల్ ద్రవిడ్ ఫైనల్‌లో విజయం అనంతరం ఎమోషనల్ అయ్యాడు. మైదానంలోకి వచ్చి ఆటగాళ్లతో సంబరాల్లో తేలిపోయాడు.ప్రపంచకప్ అందుకుని గట్టిగా అరుస్తూ ఉద్వేగాన్ని బయటపెట్టాడు.
2021 నవంబర్‌లో టీమిండియా కోచ్ బాధ్యతలు అందుకున్న ద్రవిడ్ గత టీ20 ప్రపంచకప్‌లో సెమీస్‌కు,గత వన్డే వరల్డ్ కప్‌లో ఫైనల్‌కు జట్టును చేర్చడం కీలకపాత్ర పోషించాడు. కోచ్‌గా భారత్ వరల్డ్ టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్స్‌కు కూడా చేర్చాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications