న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

India Vs South Africa: అమ్ముడైంది 1500 టికెట్లే! రాంచీ టెస్టుకు ప్రేక్షకుల హాజరు తక్కువే!

India Vs South Africa: Low attendance, SA players unhappy with hotel in Ranchi: JSCA faces challenge on two fronts

హైదరాబాద్: మూడు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో చివరిదైన మూడో టెస్టు శనివారం రాంచీ వేదికగా ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. అయితే, ఈ మ్యాచ్‌కి ప్రేక్షకుల హాజరు చాలా తక్కువగా ఉండే అవకాశం ఉంది. మూడో టెస్టుకు కేవలం 1500 లోపే టికెట్లు అమ్ముడైనట్లు తెలుస్తోంది.

జేఎస్‌సీఏ స్టేడియం కెపాసిటీ 39000. ఈ స్టేడియం ఆతిథ్యమిస్తోన్న రెండో టెస్టు మ్యాచ్ ఇది. మార్చి 16, 2017లో భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య జరిగిన టెస్టు డ్రాగా ముగిసింది. తాజాగా, రెండోసారి టెస్టు మ్యాచ్‌కు ఆతిథ్యమిస్తోన్న నేపథ్యంలో జార్ఖండ్ క్రికెట్ అసోసియేషన్(జేఎస్‌సీఏ) వినూత్నంగా ఆలోచించింది.

<strong>పాక్ కెప్టెన్‌గా సర్ఫరాజ్ తొలగింపు: సోషల్ మీడియాలో నెటిజన్ల సెటైర్లు!</strong>పాక్ కెప్టెన్‌గా సర్ఫరాజ్ తొలగింపు: సోషల్ మీడియాలో నెటిజన్ల సెటైర్లు!

5000 టికెట్లు వారికే

5000 టికెట్లు వారికే

సీఆర్పీఎఫ్‌ జవాన్లు, సైనికులు, ఎన్‌సీసీ క్యాడెట్ల కోసం ఉచితంగా 5000 టికెట్లను పక్కనబెట్టింది. యూనిఫాం ధరించి దేశానికి సేవ చేస్తున్నవారికి ఉచితంగా టికెట్లు ఇవ్వాలని జేఎస్‌సీఏ నిర్ణయం తీసుకుంది. అయితే, స్టేడియానికి వచ్చే అభిమానుల సంఖ్య 20వేలకు మించకపోవచ్చని జేఎస్‌సీఏ భావిస్తోంది.

మ్యాచ్‌ని నిర్వహించడం వల్ల

మ్యాచ్‌ని నిర్వహించడం వల్ల

అయితే, ఈ మ్యాచ్‌ని నిర్వహించడం వల్ల స్టేడియంలో పిచ్‌, లైట్స్‌, అగ్నిమాపక వసతులు ఎలా ఉన్నాయో తెలుసుకోవచ్చని జేఎస్‌సీఏ సెక్రటరీ సంజయ్ సహాయ్ అన్నారు. నిజానికి టెస్టుల్లో రోజువారి టికెట్లు రూ. 200-2000 మధ్యలో ఉంటాయి. టెస్టు డిమాండ్ ఉంటే టికెట్‌ ధర రూ.2వేలు ఉంటుంది.

క్లీన్ స్వీప్: చరిత్ర సృష్టించేందుకు ఒక టెస్టు దూరంలో టీమిండియా!

ఇప్పటికే 2-0తో సిరిస్‌ కైవసం

ఇప్పటికే 2-0తో సిరిస్‌ కైవసం

కానీ, మూడు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో టీమిండియా ఇప్పటికే 2-0తో సిరిస్‌ను కైవసం చేసుకోవడంతో మూడో టెస్టు నామమాత్రంగానే ఉంది. దీంతో మూడో టెస్టుకు ప్రేక్షకుల హాజరు చాలా తక్కువగా ఉండే అవకాశం ఉంది. అయితే, మూడో టెస్టుకు ధోనీ వస్తే అభిమానుల్లో ఆసక్తి పెరుగుతుందని సంజయ్ సహాయ్ తెలిపారు.

ఆటగాళ్లకు వేర్వేరు హోటళ్లలో గదులు

ఆటగాళ్లకు వేర్వేరు హోటళ్లలో గదులు

దక్షిణాఫ్రికా ఆటగాళ్లకు వేర్వేరు హోటళ్లలో గదులు కేటాయించడంలో తమ పాత్రేమీ లేదని జేఎస్‌సీఏ సెక్రటరీ సంజయ్ సహాయ్ తెలిపాడు. రాంచీ స్టేడియానికి 13 కిలోమీటర్ల దూరంలో సఫారీలకు, 9 కిలోమీటర్ల దూరంలో టీమిండియాకు బస ఏర్పాటు చేశారు. సాధారణంగా రెండు జట్లు ఒకే హోటల్‌లో బస చేస్తాయి.

భిన్నంగా విడిది ఏర్పాటు

భిన్నంగా విడిది ఏర్పాటు

అయితే, ఈసారి అందుకు భిన్నంగా విడిది ఏర్పాటు చేశారు. ఈసారి డాక్టర్ల కాన్ఫరెన్స్ జరుగుతుండటంతో వేర్వేరుగా ఏర్పాటు చేయాల్సి వచ్చిందని సంజయ్ సహాయ్ తెలిపాడు. "గదులను ఏడాది ముందుగానే బుక్‌ చేస్తారు. ఏదేమైనప్పటికీ గదులు బుక్‌ చేసింది మేం కాదు. బీసీసీఐ" అని సంజయ్‌ చెప్పుకొచ్చాడు.

Story first published: Friday, October 18, 2019, 20:04 [IST]
Other articles published on Oct 18, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X