India Vs South Africa: రాంచీ టెస్టులో కుల్దీప్ స్థానంలో లోకల్ బాయ్ నదీమ్‌కు చోటు

హైదరాబాద్: వెస్టిండీస్-ఏ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో అద్భుత ప్రదర్శన చేసిన టీమిండియా స్పిన్నర్ షాబాజ్ నదీమ్ రాంచీ టెస్టుకు ఎంపికయ్యాడు. జార్ఖండ్‌కు చెందిన ఈ 30 ఏళ్ల స్పిన్నర్‌ను చైనామన్ బౌలర్ కుల్దీప్ యాదవ్ స్థానంలో రాంచీ టెస్టుకు సెలక్టర్లు ఎంపిక చేశారు. కుల్దీప్ యాదవ్ గత కొన్ని రోజులుగా భుజం నొప్పి గాయంతో బాధపడుతున్న సంగతి తెలిసిందే.
తనకు భుజం నొప్పి ఎక్కువగా ఉందని కుల్దీప్ స్పష్టం చేయడంతో నదీమ్‌ను తీసుకున్నారు. ఇప్పటివరకూ భారత జట్టు తరఫున ఆడని నదీమ్ శనివారం నుంచి ఆరంభం కానున్న మూడో టెస్టులో అరంగేట్రం చేయాలని ఎంతో ఆతృతగా ఉన్నాడు. చాలాకాలంగా నదీమ్ జార్ఖండ్ జట్టు తరఫున దేశవాళీ క్రికెట్లో రాణిస్తున్నాడు.

వరుసగా 50కిపైగా వికెట్లు
రంజీల్లో వరుసగా రెండు సీజన్లలో వరుసగా 50కిపైగా వికెట్లు పడగొట్టాడు. జూలై-ఆగస్టు నెలల్లో వెస్టిండీస్-ఏతో అనధికారిక సిరీస్‌లో భాగంగా భారత-ఏ జట్టు తరఫున నదీమ్ అద్భుత ప్రదర్శన చేశాడు. తొలి టెస్టులో 10 వికెట్లు తీసిన నదీమ్.. మూడో టెస్టులో ఐదు వికెట్లు సాధించాడు. 110 ఫస్ట్‌క్లాస్ మ్యాచుల్లో 424 వికెట్లు సాధించాడు.

19 సార్లు ఐదు వికెట్లు
19 సార్లు ఐదు వికెట్లు, 5 సార్లు 10 వికెట్ల ఘనత సాధించాడు. ఈ ప్రదర్శనే నదీమ్‌ను భారత జట్టులో ఎంపికయ్యేందుకు మార్గం సుగమం చేసింది. "ఎడమ భుజం నొప్పితో బాధపడుతున్నానని కుల్దీప్ యాదవ్ శుక్రవారం తెలియజేయడంతో నదీమ్‌ను ఎంపిక చేశాం" అని బీసీసీఐ సెలక్షన్ కమిటీ ఛైర్మన్ ఎమ్మెస్కే ప్రసాద్ అన్నారు.

తుది జట్టులో దక్కని చోటు
2018లో నదీమ్‌ను వెస్టిండీస్‌పై వన్డే, టీ20 సిరీస్‌కు ఎంపికైనప్పటికీ తుది జట్టులో చోటు దక్కలేదు. అయితే, మూడో టెస్టులో ఇషాంత్ శర్మ స్థానంలో కుల్దీప్‌ను ఆడించాలనే యోచనలో టీమిండియా యాజమాన్యం ఉంది. రాంచీ పిచ్ స్పిన్‌కు అనుకూలించే అవకాశం ఉండటంతో ఇషాంత్‌ను పక్కకు పెట్టి నదీమ్‌కు చోటు కల్పించాలనుకున్నారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications