India vs South Africa: రెండో ఇన్నింగ్స్‌లోనూ రోహిత్ సెంచరీ, 6వ బ్యాట్స్‌మన్‌గా రికార్డు

హైదరాబాద్: విశాఖ వేదికగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్టులో రోహిత్ శర్మ చెలరేగుతున్నాడు. తొలి ఇన్నింగ్స్‌లో సెంచరీ సాధించిన రోహిత్ శర్మ(176) రెండో ఇన్నింగ్స్‌లోనూ సెంచరీతో కదం తొక్కాడు. 133 బంతుల్లో 9 ఫోర్లు, 4 సిక్సుల సాయంతో రోహిత్ శర్మ సెంచరీ సాధించాడు. ఈ టెస్టులో రోహిత్ శర్మకు ఇది వరుసగా రెండో సెంచరీ కావడం విశేషం.
మొత్తంగా టెస్టుల్లో రోహిత్ శర్మకు ఇది ఐదో సెంచరీ. ఈ క్రమంలో రోహిత్ శర్మ అరుదైన రికార్డుని తన ఖాతాలో వేసుకున్నాడు. టెస్టుల్లో ఓపెనర్‌గా బరిలో దిగి ఒకే టెస్టులో రెండు సెంచరీలు బాదిన ఆరో భారత బ్యాట్స్‌మన్‌గా అరుదైన రికార్డు సృష్టించాడు. మొత్తంగా చూస్తే తొమ్మిదవ బ్యాట్స్‌మన్. చివరగా భారత్ తరుపున అజ్యింకె రహానే రెండు ఇన్నింగ్స్‌ల్లో రెండు సెంచరీలు చేశాడు.
2015లో దక్షిణాఫ్రికాతో జరిగిన నాలుగు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో రహానే ఈ ఘనత సాధించాడు. మళ్లీ నాలుగేళ్ల తర్వాత అదే జట్టుపై రోహిత్ శర్మ ఇప్పుడు రెండు ఇన్నింగ్స్‌ల్లో రెండు సెంచరీలు బాదడం విశేషం. అయితే, ఓపెనర్‌గా ఒక టెస్టులో రెండు సెంచరీలు సాధించింది మాత్రం రోహిత్ శర్మనే. రోహిత్ శర్మ కెరీర్‌లోనే ఈ విశాఖపట్నం టెస్టు ప్రత్యేకంగా నిలువనుంది.
ఓపెనర్‌గా సక్సెస్
సుధీర్ఘ ఫార్మాట్‌లో ఓపెనర్‌గా సక్సెస్ అవుతాడో లేదోనని భావించిన జట్టు మేనేజ్‌మెంట్ నమ్మకాన్ని రోహిత్ శర్మ నిలబెట్టుకున్నాడు. అంతేకాదు ఈ టెస్టులో రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ ఓపెనర్‌గా రెండు సెంచరీలు సాధించి సరికొత్త చరిత్ర సృష్టించాడు. టీ విరామం తర్వాత పుజారా 148 బంతుల్లో 81 (13ఫోర్లు, 2సిక్సర్లు) ఎల్బీగా వెనుదిరిగాడు.
56వ ఓవర్‌లో హ్యాట్రిక్ సిక్సర్లు
సెంచరీ అనంతరం రోహిత్ శర్మ మరింత దూకుడుగా ఆడుతున్నాడు. ఇన్నింగ్స్ 56వ ఓవర్‌లో సఫారీ బౌలర్ డేన్ పైడిట్ బౌలింగ్‌లో రోహిత్ శర్మ వరుసగా మూడు సిక్సులు బాదాడు. వన్డే క్రికెట్ మాదిరి రెచ్చిపోయి ఆడుతున్నాడు. ప్రస్తుతం 56 ఓవర్లకు గాను టీమిండియా రెండు వికెట్లు కోల్పోయి 234 పరుగులు చేసింది. క్రీజులో రోహిత్ శర్మ(126), జడేజా(10) పరుగులతో ఉన్నారు.
300 దాటిన టీమిండియా ఆధిక్యం
తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం కలుపుకొని టీమిండియా 305 పరుగుల ఆధిక్యంలో ఉంది. అంతకముందు దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌లో 431 పరుగులకు ఆలౌట్ కాగా భారత జట్టు రెండో ఇన్నింగ్స్ ప్రారంభించింది. జట్టు స్కోరు 21 పరుగుల వద్ద టీమిండియా మయాంక్ అగర్వాల్ రూపంలో తొలి వికెట్ కోల్పోయింది.

ఏడు పరుగులకే పెవిలియన్‌కు చేరిన మయాంక్
తొలి ఇన్నింగ్స్‌లో డబుల్ సెంచరీతో అద్భుత ప్రదర్శన చేసిన మయాంక్ అగర్వాల్ రెండో ఇన్నింగ్స్‌లో ఏడు పరుగులకే ఔటయ్యాడు. కేశవ్ మహారాజ్ బౌలింగ్‌లో స్లిప్‌లో డుప్లెసిస్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు. అంతకముందు టీమిండియా తన తొలి ఇన్నింగ్స్‌లో 502/7 వద్ద తొలి ఇన్నింగ్స్ డిక్లేర్డ్ చేసిన సంగతి తెలిసిందే.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications