Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

రాంచీలో మూడో టెస్టు: టెస్టుల్లో తొలి వికెట్ తీసిన ఆనందం ఇలా ఉంటుంది! (వీడియో)

India vs South Africa Live Score 3rd Test Day 3: Maiden Test scalp for Shahbaz Nadeem

హైదరాబాద్: రాంచీ టెస్టులో అంతర్జాతీయ టెస్టు అరంగేట్రం చేసిన టీమిండియా లెఫ్టార్మ్ స్పిన్నర్ షాబాజ్ నదీమ్ టెస్టుల్లో తొలి వికెట్ తీశాడు. ఇన్నింగ్స్ 28వ ఓవర్‌ రెండో బంతికి టెంబా బావుమా(32) పరుగుల వద్ద ఔటయ్యాడు. నదీమ్ వేసిన బంతిని అంచనా వేయడంలో విఫలమైన బావుమా వికెట్ల ముందుకొచ్చి ఆడాడు.

ఈ సమయంలో వృద్ధిమాన్ సాహా ఎంతో సమయస్ఫూర్తిగా వ్యవహారించి అతడిని పెవిలియన్‌కు చేర్చాడు. టెస్టుల్లో షాబాజ్ నదీమ్‌కు ఇదే తొలి వికెట్ కావడం విశేషం. ఫలితంగా స్టంపింగ్‌ ద్వారా తొలి అంతర్జాతీయ వికెట్‌గా దక్కించుకున్న నాల్గో టీమిండియా బౌలర్‌గా నదీమ్‌ గుర్తింపు పొందాడు.

అంతకుముందు ఈ జాబితాలో డబ్యూవీ రామన్‌, ఎమ్‌ వెంకట్రమణ, ఆశిష్‌ కపూర్‌లు ఉన్నారు. ఇప్పుడు వారి సరసన నదీమ్‌ చేరాడు. తొలి వికెట్ తీసిన ఆనందంలో అతడు మైదానంలో సంబరాలు చేసుకున్నాడు. మరోవైపు సహకర క్రికెటర్లు సైతం అతడిని అభినందనలతో ముంచెత్తారు.

ఆడిన తొలి బంతికే దక్షిణాఫ్రికా కెప్టెన్ డుప్లెసిస్ ఔట్

ఇందుకు సంబంధించిన వీడియోని బీసీసీఐ తన అధికారిక ట్విట్టర్‌లో అభిమానులతో పంచుకుంది. సోమవారం 9/2 ఓవర్‌నైట్‌ స్కోరుతో మూడో రోజు ఇన్నింగ్స్‌ను కొనసాగించిన దక్షిణాఫ్రికాకు ఆరంభంలోనే గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆడిన తొలి బంతికే దక్షిణాఫ్రికా కెప్టెన్ డుప్లెసిస్ ఔటయ్యాడు. దీంతో దక్షిణాఫ్రికా 16 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.

91 పరుగుల భాగస్వామ్యం

ఈ సమయంలో క్రీజులోకి వచ్చి బవుమా నిలకడగా ఆడుతూ స్కోరుని పెంచే ప్రయత్నం చేశాడు. మరోవైపు జుబైర్ హమ్జా హాఫ్ సెంచరీ చేసి క్రీజులో పాతుకుపోయాడు. వీరిద్దరి జోడీ నిలకడగా ఆడుతూ సుమారు 22 ఓవర్ల పాటు క్రీజులో నిలబడి వికెట్లు కోల్పోకుండా అడ్డుకున్నారు. ఇద్దరూ కలిసి 91 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు.

హమ్జా హాఫ్‌ సెంచరీ

అలాంటి సమయంలో వీరిద్దరి జోడిని నదీమ్ తన స్పిన్‌తో విడదీశాడు. సీనియర్ ప్లేయర్లు డీన్‌ ఎల్గర్‌, డీకాక్‌, డుప్లెసిస్‌ వంటి స్టార్‌ ఆటగాళ్లు విఫలమైన చోట హమ్జా హాఫ్‌ సెంచరీతో రాణించడం విశేషం. 56 బంతుల్లో 8 ఫోర్లు, 1 సిక్సర్‌తో అర్థ శతకం నమోదు చేశాడు. మూడో రోజు ఆటలో భాగంగా అశ్విన్‌ వేసిన 18 ఓవర్‌ ఆఖరి బంతిని సిక్స్‌ కొట్టడంతో హమ్జా హాఫ్‌ సెంచరీ పూర్తి చేసుకున్నాడు.

బావుమా నుంచి సహకారం

హమ్జాకు ఇది తొలి టెస్టు హాఫ్‌ సెంచరీ. ఏడాది ఆరంభంలో పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌ ద్వారా టెస్టుల్లో అరంగేట్రం చేసిన హమ్జాకు ఇది రెండో టెస్టు. బావుమా నుంచి సహకారం లభించడంతో 90.00 స్ట్రైక్‌రేట్‌తో హమ్జా హాఫ్ సెంచరీ సాధించడం విశేషం. తన అద్భుతమైన ఇన్నింగ్స్‌తో సఫారీని గాడిలో పెట్టే ప్రయత్నం చేశాడు.

Story first published: Monday, October 21, 2019, 12:36 [IST]
Other articles published on Oct 21, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+