ఉమేశ్ బౌన్సర్ ఎంత పనిచేసింది! డీన్ ఎల్గర్ రిటైర్డ్‌హర్ట్

హైదరాబాద్: రాంచీ వేదికగా టీమిండియాతో జరుగుతున్న మూడో టెస్టులో దక్షిణాఫ్రికా రెండో ఇన్నింగ్స్‌లో టీమిండియా పేసర్ ఉమేశ్ యాదవ్ వేసిన బంతికి ఓపెనర్ డీన్ ఎల్గర్ విలవిల్లాడు. ఉమేశ్ యాదవ్ వేసిన ఇన్నింగ్స్ 9వ ఓవర్ మూడో బంతి డీన్ ఎల్గర్ హెల్మెట్‌కు బలంగా తాకింది. దీంతో డీన్ ఎల్గర్ ఒక్కసారిగా క్రీజులో కూలబడ్డాడు.

పరిగెత్తుకొచ్చిన ఫిజియో
వెంటనే ఆ జట్టు ఫిజియో మైదానంలోకి పరుగెత్తుకువచ్చాడు. డీన్ ఎల్గర్ తలను బంతి బలంగా తాకడంతో అతడు రిటైర్డ్‌హర్ట్‌గా వెనుదిరిగాడు. ఒక క్రికెటర్ తలకు బంతి తగిలి ఆడలేని స్థితిలో రిటైర్డ్‌హర్ట్ అయినప్పుడు వచ్చే సబ్‌స్టిట్యూట్‌కు బ్యాటింగ్, బౌలింగ్ కూడా చేసే అవకాశం కల్పిస్తూ ఐసీసీ సవరణ చేసిన సంగతి తెలిసిందే.
కాంకషన్ సబ్‌స్టిట్యూట్‌కు అనుమతి
ఈ నేపథ్యంలో డీన్ ఎల్గర్ విషయంలో మ్యాచ్ రిఫరీ కాంకషన్ సబ్‌స్టిట్యూట్‌కు అనుమతిచ్చారు. టీ విరామం అనంతరం జార్జి లిండే బరిలోకి దిగనున్నాడు. అంతకముందు తొలి ఇన్నింగ్స్‌లో 162 పరుగులకే కుప్పకూలిన ఆ జట్టు ఫాలో ఆన్‌లోనూ అదే తరహాలో ఆడుతోన్న సంగతి తెలిసిందే. ఆట మొదలైన కొద్దిసేపటికే రెండు వికెట్లను కోల్పోయింది.

టీ విరామానికి దక్షిణాఫ్రికా 26/4
ఉమేశ్ యాదవ్ వేసిన ఇన్నింగ్స్ రెండో ఓవర్ తొలి బంతికి క్వింటన్ డికాక్(5) బౌల్డ్ అయ్యాడు. ఆ తర్వాత ఇన్నింగ్స్ మూడో ఓవర్ మూడో బంతికి హమ్జా బౌల్డయ్యాడు. అనంతరం షమీ బౌలింగ్‌లో బవుమా డకౌట్ కాగా, డుప్లెసిస్ (4) ఔటయ్యారు. డుప్లెసిస్ రివ్యూ కోరినప్పటికీ ఫలితం ప్రతికూలంగా వచ్చింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications