
హైదరాబాద్: రాంచీ వేదికగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న చివరిదైన మూడో టెస్టులో టీమిండియా లంచ్ విరామానికి 23 ఓవర్లకు గాను 3 వికెట్లు కోల్పోయి 71 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో రోహిత్ శర్మ(38), రహానే(11) పరుగులతో ఉన్నారు. సఫారీ బౌలర్లలో కగిసో రబాడకు రెండు, అన్రిచ్ నోర్ఝికు ఒక వికెట్ లభించింది.
ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియాకు ఆరంభంలోనే షాక్ తగిలింది. తొలి సెషన్‌లోనే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. టీమిండియా ఓపెనర్ మయాంక్ అగర్వాల్(10) తొలి వికెట్‌గా పెవిలియన్ చేరితే, రెండో వికెట్‌గా ఛటేశ్వర్ పుజారా పెవిలియన్‌కు చేరాడు.
దీంతో జట్టు స్కోరు 16 పరుగుల వద్ద రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. రబడా వేసిన ఐదో ఓవర్ ఆఖరి బంతికి అగర్వాల్(10) ఔటయ్యాడు. రబాడ వేసిన బంతిని నిర్లక్ష్యంగా ఆడిన మయాంక్ థర్డ్ స్లిప్‌లో ఉన్న డీన్ ఎల్గర్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు. ఆ తర్వాత ఫస్ట్ డౌన్‌లో వచ్చిన పుజారా కూడా నిరాశపరిచాడు.
రబడా వేసిన ఏడో ఓవర్ తొలి బంతికి తృటిలో ఎల్బీడబ్యూ అయ్యే అవకాశం తప్పించుకున్న పుజారా ఇన్నింగ్స్ తొమ్మిదో ఓవర్ మూడో బంతికి ఎల్బీగానే ఔటయ్యాడు. దీంతో ఈ మ్యాచ్‌లో మొత్తం తొమ్మిది బంతులు ఆడిన పుజారా డకౌట్‌గా పెవిలియన్ చేరాడు. అనంతరం నోర్జే 16వ ఓవర్లో కోహ్లీని ఎల్బీగా పెవిలియన్ పంపాడు.
రబాడ వేసిన ఏడో ఓవర్ తొలి బంతికి తృటిలో ఎల్బీడబ్యూ అయ్యే అవకాశం తప్పించుకున్న పుజారా ఇన్నింగ్స్ తొమ్మిదో ఓవర్ మూడో బంతికి ఎల్బీగానే ఔటయ్యాడు. దీంతో ఈ మ్యాచ్‌లో మొత్తం తొమ్మిది బంతులు ఆడిన పుజారా డకౌట్‌గా పెవిలియన్ చేరాడు. అనంతరం నోర్జే 16వ ఓవర్లో కోహ్లీని ఎల్బీగా పెవిలియన్ పంపాడు.
భారత్ తరుపున లెఫ్టార్మ్ స్పిన్నర్ షాబాజ్ నదీమ్ టెస్టు అరంగేట్రం చేస్తున్నాడు. చాలాకాలంగా నదీమ్ జార్ఖండ్ జట్టు తరఫున దేశవాళీ క్రికెట్లో రాణిస్తున్నాడు. రంజీల్లో వరుసగా రెండు సీజన్లలో వరుసగా 50కిపైగా వికెట్లు పడగొట్టాడు. జూలై-ఆగస్టు నెలల్లో వెస్టిండీస్-ఏతో అనధికారిక సిరీస్‌లో భాగంగా భారత-ఏ జట్టు తరఫున నదీమ్ అద్భుత ప్రదర్శన చేశాడు.
110 ఫస్ట్‌క్లాస్ మ్యాచుల్లో 424 వికెట్లు సాధించాడు. రాంచీ పిచ్ స్పిన్‌కు అనుకూలించే అవకాశం ఉండటంతో ఇషాంత్‌ను పక్కకు పెట్టి షాబాజ్ నదీమ్‌కు తుది జట్టులో చోటు కల్పించారు.
ఇప్పటికే విశాఖ టెస్టులో 203 పరుగులు, పుణె టెస్టులో ఏకంగా ఇన్నింగ్స్ 137 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికాను ఓడించి సిరిస్‌ను కైవసం చేసుకున్న టీమిండియా క్లీన్ స్వీప్‌పై కన్నేసింది. రాంచీ టెస్టులో టీమిండియా గెలిస్తే దక్షిణాఫ్రికాను వైట్‌వాష్ చేసిన తొలి జట్టుగా కోహ్లీసేన చరిత్ర సృష్టిస్తుంది.