Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

టీమిండియా ఫీల్డింగ్: సిరిస్ నెగ్గుతారా? సమం చేస్తారా? పైచేయి ఎవరిదో!

India vs South Africa, Live Score, 2nd Womens ODI at Vadodara: India Eye Early Wickets

హైదరాబాద్: దక్షిణాఫ్రికాపై తొలి వన్డేలో విజయం సాధించి మరో జోరు మీదున్న టీమిండియా మహిళల జట్టు మరో సమరానికి సిద్ధమైంది. వడోదరలోని రిలయన్స్‌ స్టేడియంలో జరుగుతున్న రెండో వన్డేలో టాస్ గెలిచిన టీమిండియా కెప్టెన్ మిథాలీ రాజ్ ఫీల్డింగ్ ఎంచుకుంది.

పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలించే అవకాశం ఉండటంతో మిథాలీ ఛేజింగ్‌ వైపు మొగ్గు చూపింది. గాయం కారణంగా స్మృతి మంధాన స్థానంలో జట్టులోకి వచ్చిన పూజా వస్త్రాకర్‌కు తుది జట్టులో చోటు దక్కలేదు. తొలి వన్డేలో హాఫ్ సెంచరీతో జట్టు విజయంలో కీలకపాత్ర పోషించిన ప్రియా పూనియాపై అందరి దృష్టి ఉంది.

మూడు వన్డేల సిరీస్‌లో ఇప్పటికే టీమిండియా 1-0తో ఆధిక్యంలో ఉంది. దీంతో ఈ మ్యాచ్‌‌లో గెలిచి సిరీస్‌ను కైవసం చేసుకోవాలని చూస్తుటంగా.... మరోవైపు పర్యాటక దక్షిణాఫ్రికా జట్టు ఈ మ్యాచ్‌లో గెలిచి సిరిస్ ఆశలను సజీవంగా ఉంచుకోవాలని భావిస్తోంది. తొలి వన్డేలో ఓపెనర్లు రాణించడంతో మిగతా వారికి బరిలోకి దిగే అవకాశం రాలేదు.

మిథాలీ రాజ్‌, హర్మన్‌ ప్రీత్‌ కౌర్‌, రోడ్రిగ్స్‌లతో టీమిండియా బ్యాటింగ్‌ లైన్‌పై బలంగా కనిపిస్తోంది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన దక్షిణాఫ్రికా 23 ఓవర్లకు గాను వికెట్ నష్టానికి 98 పరుగులు చేసింది. క్రీజులో లౌరా వోల్వారెట్(41), త్రిష శెట్టి(12) పరుగులతో ఉన్నారు. దక్షిణాఫ్రికా కోల్పోయిన ఒక వికెట్ పూనమ యాదవ్ పడగొట్టింది.

Story first published: Friday, October 11, 2019, 10:52 [IST]
Other articles published on Oct 11, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+