Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఔరా అనిపించాడు: సాహా స్టన్నింగ్ క్యాచ్ చూశారా? (వీడియో)

Saha

హైదరాబాద్: పూణె వేదికగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో భారత బౌలర్లు చెలరేగుతున్నారు. ఆటలో భాగంగా నాలుగో రోజైన ఆదివారం వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహా అద్భుతమైన ఫీల్డింగ్‌తో ఆకట్టుకుంటున్నాడు. ఫాలోఆన్‌ ఆడుతున్న దక్షిణాఫ్రికా జట్టు స్కోరు 21 పరుగుల వద్ద రెండో వికెట్ కోల్పోయింది.

ఉమేశ్‌యాదవ్‌ వేసిన ఆరో ఓవర్‌ నాలుగో బంతి లెగ్‌సైడ్‌ వెళ్లినా డిబ్రుయిన్‌(8) షాట్‌ ఆడే ప్రయత్నం చేశాడు. బ్యాట్‌కు తగిలిన బంతి వికెట్ల వెనుక నుంచి దూరంగా వెళుతున్న క్యాచ్‌ను సాహా తనదైన మార్కుతో అందుకున్నాడు. డైవ్ చేసి మరీ పట్టిన ఈ అద్భుతమైన క్యాచ్‌తో వృద్ధిమాన్ సాహా అందరినీ ఆశ్చర్యపరిచాడు.

సాహాకే క్యాచ్ ఇచ్చి

తొలి ఇన్నింగ్స్‌లో సైతం డిబ్రుయిన్‌ వికెట్ కీపర్ సాహాకే క్యాచ్ ఇచ్చి వెనుదిరగడం విశేషం. మూడో రోజు ఆటలో భాగంగా డిబ్రుయిన్‌ క్యాచ్‌ను సాహా డైవ్‌ చేసి మరీ పట్టుకున్నాడు. తాజాగా రెండో ఇన్నింగ్స్‌‌లో కూడా డిబ్రుయిన్‌ మళ్లీ సాహా చేతికే చిక్కి పెవిలియన్‌కు చేరడం విశేషం. డిబ్రుయిన్‌ రెండు సార్లు ఉమేశ్‌ యాదవ్‌ బౌలింగ్‌లో ఔటయ్యాడు.

రెండో బంతికే ఇషాంత్‌ శర్మకు వికెట్

అంతకముందు మ్యాచ్‌ మొదలైన రెండో బంతికే ఇషాంత్‌ శర్మ తొలి వికెట్‌ వికెట్‌ పడగొట్టాడు. కేవలం రెండు బంతులు మాత్రమే ఆడిన మార్కరమ్‌ డకౌట్‌గా పెవిలియన్‌ చేరాడు. దీంతో పరుగుల ఖాతా తెరవకుండానే దక్షిణాఫ్రికా తొలి వికెట్‌ కోల్పోయింది. ఇన్నింగ్స్‌ తొలి ఓవర్‌ రెండో బంతికి మార్కరమ్‌ ఎల్బీగా పెవిలియన్‌ చేరాడు.

275 పరుగుల వద్ద ఆలౌట్

దక్షిణాఫ్రికా తన తొలి ఇన్నింగ్స్‌లో 275 పరుగుల వద్ద ఆలౌటైన సంగతి తెలిసిందే. అంతకముందు తొలి ఇన్నింగ్స్‌లో భారత్‌ 601/5 వద్ద డిక్లేర్డ్‌ చేయడంతో భారత్‌కు 326 పరుగుల భారీ ఆధిక్యం లభించింది. దీంతో దక్షిణాఫ్రికా ఫాలోఆన్‌లో పడింది. ప్రస్తుతం 19 ఓవర్లకు గాను దక్షిణాఫ్రికా రెండు వికెట్లు కోల్పోయి 64 పరుగులు చేసింది. క్రీజులో ఓపెనర్ డీన్ ఎల్గర్(42), కెప్టెన్ డుప్లెసిస్(5) పరుగులతో ఉన్నారు.

Story first published: Sunday, October 13, 2019, 12:13 [IST]
Other articles published on Oct 13, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+