Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

పూణె టెస్టులో దక్షిణాఫ్రికా ఫాలోఆన్: 21 పరుగులకే 2 వికెట్లు కోల్పోయిన దక్షిణాఫ్రికా

India vs South Africa Live Score 2nd Test Day 4: India enforce follow-on after taking 326-run lead

హైదరాబాద్: పూణె టెస్టులో అనుకున్నదే అయింది. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ సఫారీలను ఫాలోఆన్‌కే మొగ్గు చూపాడు. టీమిండియాతో జరుగుతున్న రెండో టెస్టు నాలుగో రోజైన ఆదివారం ఫాలోఆన్‌ ఆడుతున్న దక్షిణాఫ్రికా జట్టు ఆరంభంలోనే వికెట్‌ను కోల్పోయింది.

మ్యాచ్‌ మొదలైన రెండో బంతికే ఇషాంత్‌ శర్మ తొలి వికెట్‌ వికెట్‌ పడగొట్టాడు. కేవలం రెండు బంతులు మాత్రమే ఆడిన మార్కరమ్‌ డకౌట్‌గా పెవిలియన్‌ చేరాడు. దీంతో పరుగుల ఖాతా తెరవకుండానే దక్షిణాఫ్రికా తొలి వికెట్‌ కోల్పోయింది. ఇన్నింగ్స్‌ తొలి ఓవర్‌ రెండో బంతికి మార్కరమ్‌ ఎల్బీగా పెవిలియన్‌ చేరాడు.

దక్షిణాఫ్రికా తన తొలి ఇన్నింగ్స్‌లో 275 పరుగుల వద్ద ఆలౌటైన సంగతి తెలిసిందే. తొలి ఇన్నింగ్స్‌లో కేశవ్‌ మహారాజ్‌(72), ఫిలాండర్‌(44)ల జోడి తొమ్మిదో వికెట్‌కు 109 పరుగుల కీలక భాగస్వామ్యం నెలకొల్పిన సంగతి తెలిసిందే. అంతకముందు తొలి ఇన్నింగ్స్‌లో భారత్‌ 601/5 వద్ద డిక్లేర్డ్‌ చేయడంతో భారత్‌కు 326 పరుగుల భారీ ఆధిక్యం లభించింది.

దీంతో దక్షిణాఫ్రికా ఫాలోఆన్‌లో పడింది. ఆటలో భాగంగా ఆదివారం ఫాలో ఆన్ ఇన్నింగ్స్‌ ఆరంభించిన దక్షిణాఫ్రికా ఆరంభంలోనే వికెట్ కోల్పోవడంతో భారత బౌలర్లు చెలరేగుతున్నారు. అనంతరం జట్టు స్కోరు 21 పరుగుల వద్ద డి బ్రుయిన్(8) పరుగులకే పెవిలియన్‌కు చేరాడు.

పేసర్ ఉమేశ్ యాదవ్ బౌలింగ్‌లో వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహాకు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఇంకా రెండు రోజుల ఆట మిగిలున్న నేపథ్యంలో భారత బౌలర్లు రాణిస్తే టీమిండియా ఇన్నింగ్స్‌ విజయం సాధించేలా కనిపిస్తోంది. ప్రస్తుతం 9 ఓవర్లకు గాను దక్షిణాఫ్రికా రెండు వికెట్లు కోల్పోయి 33 పరుగులు చేసింది.

క్రీజులో ఓపెనర్ డీన్ ఎల్గర్(19), కెప్టెన్ డుప్లెసిస్(2) పరుగులతో ఉన్నారు. తొలి ఇన్నింగ్స్‌లో టీమ్‌ఇండియా 601/5 స్కోరు వద్ద డిక్లేర్‌ చేసిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌లో 275 పరుగులకే ఆలౌటైంది. దీంతో కోహ్లీసేనకు 326 పరుగుల భారీ ఆధిక్యం లభించింది.

Story first published: Sunday, October 13, 2019, 10:49 [IST]
Other articles published on Oct 13, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+