న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

India vs South Africa, Day 1: పూణె టెస్టులో నిరాశపరిచిన రోహిత్ శర్మ

IND VS SA 2019,2nd Test : Kagiso Rabada Removes Rohit Sharma During 2nd Test In Pune
India vs South Africa Live Score 2nd Test Day 1: Kagiso Rabada removes Rohit Sharma to jolt Indias start

హైదరాబాద్: ఓపెనర్‌గా విశాఖ టెస్టులో అద్భుత ప్రదర్శన చేసిన రోహిత్ శర్మ రెండో టెస్టు తొలి ఇన్సింగ్స్‌లో నిరాశపరిచాడు. పూణెలోని మహారాష్ట్ర క్రికెట్‌ అసోసియేషన్‌ స్టేడియంలో గురువారం ప్రారంభమైన రెండో టెస్టులో టాస్ గెలిచిన టీమిండియా బ్యాటింగ్ ఎంచుకున్నాడు. అయితే, మ్యాచ్ ప్రారంభమైన కొద్దిసేపటికే రోహిత్ శర్మ ఔటయ్యాడు.

దక్షిణాఫ్రికా పేసర్ రబాడ వేసిన ఇన్నింగ్స్ 10వ ఓవర్ చివరి బంతిని రోహిత్ శర్మ(14) డికాక్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. రోహిత్ శర్మ ఔటైన తర్వాత పుజారా క్రీజులోకి వచ్చాడు. విశాఖ టెస్టులో రెండు ఇన్నింగ్స్‌ల్లో సెంచ‌రీల‌తో రోహిత్‌ శర్మ అలరించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం 16 ఓవర్లకు గాను టీమిండియా వికెట్ నష్టానికి 50 పరుగులు చేసింది.

India vs South Africa: కెప్టెన్‌గా కోహ్లీకి 50వ మ్యాచ్‌, టీమిండియా బ్యాటింగ్India vs South Africa: కెప్టెన్‌గా కోహ్లీకి 50వ మ్యాచ్‌, టీమిండియా బ్యాటింగ్

క్రీజులో మయాంక్ అగర్వాల్(26), పుజారా(1) ఉన్నారు. ఈ మ్యాచ్‌లో టీమిండియా ఒక మార్పు చేసింది. ఆంధ్ర కుర్రాడు హనుమ విహారి స్థానంలో పేసర్ ఉమేశ్ యాదవ్‌కి తుది జట్టులో చోటు కల్పించింది. కెప్టెన్‌గా విరాట్‌ కోహ్లికి ఇది 50వ టెస్టు. ఈ క్రమంలో విరాట్ కోహ్లీ ఖాతాలో అరుదైన రికార్డు చేరింది.

India vs South Africa Live Score 2nd Test Day 1: Kagiso Rabada removes Rohit Sharma to jolt Indias start

అత్యధిక మ్యాచ్‌లకు నాయకత్వం వహించిన భారత కెప్టెన్ల జాబితాలో సౌరవీ గంగూలీ (49) రికార్డుని కోహ్లీ అధిగమించాడు. 60 టెస్టులతో ఈ జాబితోలా టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని అగ్రస్థానంలో ఉన్నాడు. భారత జట్టు సొంతగడ్డపై 2013 నుంచి 30 టెస్టులు ఆడితే 24 గెలిచి ఒకే ఒక్క టెస్టులో ఓడిపోయింది.

1
46114

Gymnastic World Championship: చరిత్ర సృష్టించిన సిమోనా బైల్స్Gymnastic World Championship: చరిత్ర సృష్టించిన సిమోనా బైల్స్

ఆ ఒక్క ఓటమి ప్రస్తుతం సఫారీలతో రెండో టెస్టు జరుగుతున్న పూణె స్టేడియంలోనే కావడం విశేషం. 2017లో ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టులో టీమిండియా ఏకంగా 333 పరుగులతో ఓడిపోయింది. ఇప్పుడు రెండున్నరేళ్ల విరామం తర్వాత అదే పూణె రెండో టెస్టుకు ఆతిథ్యమిస్తోంది.

మూడు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో ఇప్పటికే తొలి టెస్టులో గెలిచి ఉత్సాహంలో ఉన్న టీమిండియా... పూణె టెస్టులో కూడా విజయం సాధించి టెస్టు సిరిస్‌ను కైవసం చేసుకోవాలని భావిస్తోంది. మరోవైపు సఫారీ జట్టు రెండో టెస్టులో విజయం సాధించి సిరిస్‌ను సమం చేయాలని భావిస్తోంది.

Story first published: Thursday, October 10, 2019, 14:52 [IST]
Other articles published on Oct 10, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X