India vs South Africa, 1st Test Day 2: రోహిత్ శర్మ ఔట్, 300 దాటిన భారత స్కోరు

హైదరాబాద్: విశాఖ వేదికగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా రెండో వికెట్ కోల్పోయింది. జట్టు స్కోరు 317 పరుగుల వద్ద రోహిత్ శర్మ(244 బంతుల్లో 176, 23 ఫోర్లు, 6 సిక్సులు) సఫారీ బౌలర్ మహరాజ్ బౌలింగ్‌లో వికెట్ కీపర్ క్వింటన్ డీకాక్ స్టంపౌట్ చేశాడు. దీంతో రోహిత్ శర్మ నిరాశగా పెవిలియన్‌కు చేరాడు.
టెస్టుల్లో రోహిత్ శర్మకు ఇది నాలుగో సెంచరీ. అంతకుముందు మిగతా మూడు సెంచరీలు మిడిల్ ఆర్డర్‌లో బ్యాటింగ్‌కు వచ్చి నమోదు చేయగా... ఈ సెంచరీని ఓపెనర్‌గా చేశాడు. ఫలితంగా ధావన్, రాహుల్, పృథ్వీ షా తర్వాత ఓపెనర్‌గా బరిలోకి దిగిన తొలి ఇన్నింగ్స్‌లోనే సెంచరీ చేసిన నాలుగో భారత బ్యాట్స్‌మన్ రోహిత్ నిలిచాడు.

ఓపెనర్‌గా వచ్చి మూడు ఫార్మాట్లలో
మరొవైపు ఓపెనర్‌గా వచ్చి మూడు ఫార్మాట్లలో (టి20, వన్డే, టెస్టు) సెంచరీలు చేసిన తొలి భారత క్రికెటర్ రోహిత్ రికార్డు సృష్టించాడు. రోహిత్ ఔటైన తర్వాత క్రీజులోకి పుజారా వచ్చాడు. ప్రస్తుతం 87 ఓవర్లకు గాను టీమిండియా వికెట్ నష్టానికి 324 పరుగులు చేసింది. క్రీజులో మయాంక్ అగర్వాల్(138), పుజారా(6) పరుగులతో క్రీజులో ఉన్నారు.

ఓపెనర్లు ఇద్దరూ 300కుపైగా పరుగుల భాగస్వామ్యం
కాగా, ఈ మ్యాచ్‌లో ఓపెనర్లు ఇద్దరూ 300కుపైగా పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేయడం విశేషం. తొలి రోజు రోహిత్ శర్మ సెంచరీతో రాణించగా... రెండో రోజైన బుధవారం మరో ఓపెనర్ మయాంక్ అగర్వాల్ సెంచరీతో సాధించాడు. టెస్టుల్లో మయాంక్ అగర్వాల్‌కు ఇదే తొలి సెంచరీ కావడం విశేషం. ఈ మ్యాచ్‌తో టెస్టుల్లో ఓపెనర్‌గా కొత్త ఇన్నింగ్స్‌ను ఆరంభించిన రోహత్ శర్మ సెంచరీతో అనేక రికార్డులను బద్దలు కొట్టాడు.

డాన్ బ్రాడ్‌మన్ రికార్డు సమం
ఈ క్రమంలో ఆస్ట్రేలియా క్రికెట్ లెజెండ్ డాన్ బ్రాడ్‌మన్ రికార్డును సమం చేశాడు. సొంత గడ్డపై అత్యధిక టెస్టు యావరేజిని నమోదు చేసిన ఆటగాళ్లలో బ్రాడ్‌మన్ సరసన చేరాడు. స్వదేశంలో రోహిత్ శర్మ ఆడిన 15 ఇన్నింగ్స్‌లలో 98.22 సగటుతో 884 పరుగులు చేశాడు. బ్రాడ్‌మన్ ఆస్ట్రేలియాలో ఆడిన 50 ఇన్నింగ్స్‌లలో 98.22 సగటుతో 4,322 పరుగులు చేశాడు.

టెస్టుల్లో నాలుగో సెంచరీ
కనీసం 10 ఇన్నింగ్స్‌లు ఆడి సొంత గడ్డపై అత్యధిక యావరేజిని నమోదు చేసిన ఆటగాడిగా రోహిత్ శర్మ నిలిచాడు. స్వదేశంలో ఇప్పటివరకూ 15 ఇన్నింగ్స్‌లు ఆడిన రోహిత్ శర్మ 98.22 టెస్టు యావరేజితో 884 పరుగులు సాధించాడు. ఇందులో నాలుగో సెంచరీలతో పాటు ఐదు హాఫ్ సెంచరీలు ఉన్నాయి.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications