For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

India vs South Africa: మయాంక్ డబుల్ సెంచరీ, 400 దాటిన భారత స్కోరు

IND vs SA 2019,1st Test : Mayank Agarwal Hits Test Double Hundred In Only His 8th Innings
India vs South Africa Live Score 1st Test Day 2: Mayank Agarwal double hundred takes India past 400

హైదరాబాద్: విశాఖ వేదికగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా ఓపెనర్ మయాంక్ అగర్వాల్ డబుల్ సెంచరీ సాధించాడు. సఫారీ బౌలర్ కేశవ్ మహారాజ్ బౌలింగ్‌లో రెండు పరుగులు తీసి మయాంక్ అగర్వాల్(358 బంతుల్లో 200, 22 ఫోర్లు, 5 సిక్సులు) టెస్టుల్లో తొలి డబుల్ సెంచరీ సాధించాడు.

ఈ క్రమంలో మయాంక్ అగర్వాల్ అరుదైన ఘనత సాధించాడు. టెస్టు క్రికెట్‌లో తన తొలి సెంచరీని డబుల్ సెంచరీగా మార్చిన నాలుగో భారత క్రికెటర్‌గా గుర్తింపు పొందాడు. అంతకముందు దిలిప్ సర్దేశాయి, వినోద్ కాంబ్లీ, కరుణ్ నాయర్‌లు మాత్రమే ఈ ఘనత సాధించారు.

116 ఓవర్లకు 419 పరుగులు చేసిన టీమిండియా

ప్రస్తుతం 116 ఓవర్లకు గాను టీమిండియా 3 వికెట్లు కోల్పోయి 419 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో మయాంక్ అగర్వాల్(202), రహానే(12) పరుగులతో ఉన్నారు. అంతకముందు టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ 20 పరుగులకే ఔటయ్యాడు. దీంతో టీమిండియా జట్టు స్కోరు 377 పరుగుల వద్ద మూడో వికెట్‌ను కోల్పోయింది.

సఫారీ బౌలర్ ముత్తు స్వామి అరుదైన ఘనత

దక్షిణాఫ్రికా స్పిన్నర్‌ సెనురాన్‌ ముత్తు స్వామి బౌలింగ్‌లో రిటర్న్‌ క్యాచ్‌ ఇచ్చి ఔటయ్యాడు. తన తొలి టెస్టులోనే విరాట్ కోహ్లీ లాంటి దిగ్గజ ఆటగాడి వికెట్ సాధించడంపై ముత్తుస్వామి ఆనందానికి అవధులు లేకుండాపోయాయి. ఈ క్రమంలో ముత్తు స్వామి అరుదైన రికార్డుని తన ఖాతాలో వేసుకున్నాడు.

తొలి వికెట్‌గా తీసిన ఆటగాళ్ల జాబితాలో

విరాట్ కోహ్లీని తమ తొలి వికెట్‌గా తీసిన ఆటగాళ్ల జాబితాలో చేరాడు. అంతకముందు విరాట్ కోహ్లీని తమ తొలి వికెట్‌గా తీసిన వారిలో కగిసో రబడా(దక్షిణాఫ్రికా), అల్జెరీ జోసెఫ్‌(వెస్టిండీస్‌)లు ఉన్నారు. మరోవైపు పుజారా(6) విఫలం కాగా, రోహిత్‌ శర్మ(176; 244 బంతుల్లో 23 ఫోర్లు, 6 సిక‍్సర్లు) డబుల్ సెంచరీ ముంగిట ఔటయ్యాడు.

202/0 ఓవర్‌నైట్‌ స్కోరుతో

202/0 ఓవర్‌నైట్‌ స్కోరుతో గురువారం రెండో రోజు ఆట కొనసాగించిన టీమిండియా జట్టు స్కోరు 317 పరుగుల వద్ద రోహిత్ శర్మ వికెట్‌ను చేజార్చుకుంది. రెండో రోజు ఆటలో మరో 115 పరుగులు జోడించిన తర్వాత రోహిత్ శర్మ(244 బంతుల్లో 176, 23 ఫోర్లు, 6 సిక్సులు) సఫారీ బౌలర్ మహరాజ్ బౌలింగ్‌లో వికెట్ కీపర్ క్వింటన్ డీకాక్ స్టంపౌట్ చేశాడు.

సెంచరీ చేసిన నాలుగో బ్యాట్స్‌మన్

దీంతో రోహిత్ శర్మ నిరాశగా పెవిలియన్‌కు చేరాడు. టెస్టుల్లో రోహిత్‌ శర్మకు ఇది నాలుగో సెంచరీ. ఫలితంగా ధావన్, రాహుల్, పృథ్వీ షా తర్వాత ఓపెనర్‌గా బరిలోకి దిగిన తొలి ఇన్నింగ్స్‌లోనే సెంచరీ చేసిన నాలుగో భారత బ్యాట్స్‌మన్‌ రోహిత్‌ నిలిచాడు. మరోవైపు ఓపెనర్ మయాంక్ అగర్వాల్ కూడా సెంచరీతో సాధించాడు. ఈ మ్యాచ్‌లో ఓపెనర్లు ఇద్దరూ 300కుపైగా పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేయడంతో అనేక రికార్డులను తమ ఖాతాలో వేసుకున్నారు.

Story first published: Thursday, October 3, 2019, 14:55 [IST]
Other articles published on Oct 3, 2019
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+