
హైదరాబాద్: కేప్‌టౌన్ వేదికగా జరిగిన తొలి టెస్టులో దక్షిణాఫ్రికా విజయం సాధించింది. చివరి వరకు ఉత్కంఠ భరితంగా సాగిన ఈ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా 72 పరుగుల తేడాతో భారత్‌పై విజయం సాధించింది. 208 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా 135 పరుగులకే కుప్పకూలింది.
భారత ఓపెనర్లు ధావన్ (16), మురళీ విజయ్ (13)లు జట్టు స్కోరు 30 పరుగుల వద్ద పెవిలియన్ చేరగా, అనంతరం క్రీజులోకి వచ్చిన పుజారా 4 పరుగులు మాత్రమే చేసి మోర్కెల్ బౌలింగ్‌లో క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు. ఈ సమయంలో క్రీజులోకి వచ్చిన కోహ్లీ (28), రోహిత్ (10), హార్థిక్ (1)లు ఒక్కొక్కరిగా పెవిలియన్‌కు క్యూ కట్టారు.
ఆ తర్వాత బౌలర్లు భువనేశ్వర్ కుమార్ (13), అశ్విన్ (37) పరుగులతో ఫరవాలేదనిపించారు. చివర్లో దిగిన షమీ (4), బుమ్రా పరుగులేమీ చేయకుండానే వెనుదిరగడంతో కోహ్లీసేన 135 పరుగులకే ఆలౌటైంది. దీంతో మూడు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో ఆతిథ్య దక్షిణాఫ్రికా 1-0 ఆధిక్యంలో నిలిచింది.
సంక్షిప్త స్కోర్లు:
దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్: 286 ఆలౌట్
ఇండియా తొలి ఇన్నింగ్స్: 209 ఆలౌట్
దక్షిణాఫ్రికా రెండో ఇన్నింగ్స్: 130 ఆలౌట్
ఇండియా తొలి ఇన్నింగ్స్: 135 ఆలౌట్
భారత ఇన్నింగ్స్ తీరు సాగిందిలా:
టీ విరామానికి టీమిండియా 82/7
కేప్‌టౌన్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరుగుతోన్న తొలి టెస్ట్ రెండో ఇన్నింగ్స్‌లో టీమిండియా టీ విరామానికి గాను 7 వికెట్లు కోల్పోయి 82 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో రవిచంద్రన్ అశ్విన్ (1) పరుగుతో ఉన్నాడు. ఈ మ్యాచ్‌లో భారత్ విజయానికి 125 పరుగులు అవసరం కాగా, దక్షిణాఫ్రికా 3 వికెట్లు తీస్తే సరిపోతుంది. ఇంకా భువనేశ్వర్ కుమార్, షమీ, బుమ్రా బ్యాటింగ్ చేయాల్సి ఉంది. చివరి వికెట్‌గా వృద్ధిమాన్ సాహా (8) పరుగుల వద్ద పెవిలియన్‌కు చేరాడు.
వెనువెంటనే రెండు వికెట్లు కోల్పోయిన భారత్
కేప్‌టౌన్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరుగుతోన్న తొలి టెస్ట్ రెండో ఇన్నింగ్స్‌లో టీమిండియా కష్టాల్లో పడింది. వెనువెంటనే రెండు వికెట్లు కోల్పోయింది. రోహిత్ శర్మ (10) ఔటైన తర్వాత క్రీజులోకి వచ్చిన హార్ధిక్ పాండ్యా కేవలం 1 పరుగు చేసి రబాడ బౌలింగ్‌లో ఏబీ డివిలియర్స్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. దీంతో టాపార్డర్ కుప్పకూలింది. దీంతో 25 ఓవర్లకు గాను 6 వికెట్లు కోల్పోయి 77 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో సాహా (4), అశ్విన్ పరుగులేమీ చేయకుండా క్రీజులో ఉన్నారు. ఈ మ్యాచ్‌లో విజయం సాధించేందుకు ఇండియా ఇంకా 130 పరుగులు చేయాల్సి ఉంది.
నాలుగో వికెట్ కోల్పోయిన భారత్
కేప్‌టౌన్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరుగుతోన్న తొలి టెస్ట్ రెండో ఇన్నింగ్స్‌లో టీమిండియా నాలుగో వికెట్ కోల్పోయింది. జట్టు స్కోరు 71 పరుగుల వద్ద ఫిలాండర్ బౌలింగ్లో విరాట్ కోహ్లీ (28) ఎల్బీగా వెనుదిరిగాడు. దీంతో 22 ఓవర్లకు గాను టీమిండియా 4 వికెట్లు కోల్పోయి 71 పరుగులు చేసింది. కోహ్లీ ఔటైన తర్వాత క్రీజులోకి సాహా వచ్చాడు. ప్రస్తుతం రోహిత్ శర్మ (9), సాహా పరుగులేమీ చేయకుండా క్రీజులో ఉన్నారు. ఈ మ్యాచ్‌లో విజయం సాధించేందుకు ఇండియా ఇంకా 137 పరుగులు చేయాల్సి ఉంది.
39 పరుగులకే 3 వికెట్లు కోల్పోయిన టీమిండియా
కేప్‌టౌన్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరుగుతోన్న తొలి టెస్ట్ రెండో ఇన్నింగ్స్‌లో టీమిండియా మూడో వికెట్ కోల్పోయింది. జట్టు స్కోరు 39 పరుగుల వద్ద పుజారా (4) పరుగుల వద్ద మోర్నీ మోర్కెల్ బౌలింగ్‌లో వికెట్ కీపర్ డీకాక్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు. దీంతో 13 ఓవర్లకు గాను 39 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి టీమిండియా కష్టాల్లో పడింది. ప్రస్తుతం క్రీజులో విరాట్ కోహ్లీ (5), రోహిత్ శర్మ పరుగులేమీ చేయకుండా క్రీజులో ఉన్నాడు. ఈ మ్యాచ్‌లో విజయం సాధించేందుకు ఇండియా ఇంకా 169 పరుగులు చేయాల్సి ఉంది.
రెండో వికెట్ కోల్పోయిన భారత్
కేప్‌టౌన్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరుగుతోన్న తొలి టెస్ట్ రెండో ఇన్నింగ్స్‌లో టీమిండియా రెండో వికెట్ కోల్పోయింది. ఇన్నింగ్స్ 8.5 ఓవర్‌లో ఫిలాండర్ వేసిన బంతికి మురళీ విజయ్ ఏబీ డివిలియర్స్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు. మురళీ విజయ్ ఔటైన తర్వాత విరాట్ కోహ్లీ క్రీజులోకి వచ్చాడు. దీంతో 9 ఓవర్లకు గాను టీమిండియా 2 వికెట్లు కోల్పోయి 30 పరుగులు చేసింది. ప్రస్తుతం పుజారా, కోహ్లీ పరుగులేమీ చేయకుండా క్రీజులో ఉన్నారు.
తొలి వికెట్ కోల్పోయిన భారత్
కేప్‌టౌన్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరుగుతోన్న తొలి టెస్ట్ రెండో ఇన్నింగ్స్‌లో టీమిండియా తొలి వికెట్ కోల్పోయింది. 208 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా, లక్ష్యాన్ని చేధించేందుకు గాను ఓపెనర్లు తొలుత కాస్త నెమ్మదిగా ఆడుతున్నారు. అయితే మోర్కెల్ వేసిన 8వ ఓవర్ ఆఖరి బంతికి శిఖర్ ధావన్(16) స్లిప్‌లో ఉన్న మోరిస్‌కి క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. దీంతో 8 ఓవర్లు ముగిసేసరికి భారత్ ఒక వికెట్ నష్టానికి 30 పరుగులు చేసింది. క్రీజ్‌లో విజయ్(13), పుజారా(0) ఉన్నారు. ఈ మ్యాచ్‌లో విజయం సాధించేందుకు ఇండియా ఇంకా 178 పరుగులు చేయాల్సి ఉంది.
కేప్‌టౌన్ టెస్టులో భారత టార్గెట్ 208
కేప్‌టౌన్ వేదికగా భారత్‌తో జరుగుతున్న తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో దక్షిణాఫ్రికా 41.2 ఓవర్లకు గాను 130 పరుగులు చేసి ఆలౌటైంది. దీంతో తొలి ఇన్నింగ్స్‌లో 77 పరుగుల ఆధిక్యం కలుపుకుని కోహ్లీసేనకు 208 పరుగుల విజయ లక్ష్యాన్ని నిర్దేశించింది.
ఓవర్ నైట్ స్కోరు 65/2తో నాలుగో రోజైన సోమవారం ఆటను కొనసాగించిన దక్షిణాఫ్రికా మరో 65 పరుగులు మాత్రమే జోడించి మిగతా 8 వికెట్లను కోల్పోయింది. దక్షిణాఫ్రికా బ్యాట్స్‌మెన్లలో మక్రమ్ (34), డీన్ ఎల్గర్ (25), ఏబీ డివిలియర్స్ (35), కేశవ్ మహారాజ్ (15) రెండంకెల స్కోరు చేయగా మిగతా వారంత సింగిల్ డిజికే పరిమితమయ్యారు.
నైట్ వాచ్‌మన్ రబాడ (5), హషీం ఆమ్లా (4), డీకాక్ (8), మోర్కెల్ (2) పరుగులు చేయగా... డుప్లెసిస్, ఫిలాండర్ పరుగులేమీ చేయకుండా డకౌట్‌గా వెనుదిరిగారు. ఇక భారత బౌలర్లలో షమీ, బుమ్రా చెరో 3వికెట్లు తీసుకోగా... భువనేశ్వర్ కుమార్, పాండ్యా తలో 2వికెట్లు తీసుకున్నారు.
దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్ తీరు సాగిందిలా:
ఏడు వికెట్లు కోల్పోయిన దక్షిణాఫ్రికా
కేప్‌టౌన్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్టుపై భారత్ పట్టు బిగిస్తోంది. నాలుగో రోజు ఆట ప్రారంభమైన కొద్ది సేపటికే భారత బౌలర్లు వరుస పెట్టి వికెట్లు తీశారు. ఈ క్రమంలో రెండో ఇన్నింగ్స్‌లో 35 ఓవర్లు ముగిసే సరికే దక్షిణాఫ్రికా 7 వికెట్లు కోల్పోయి 99 పరుగులు చేసింది.
భారత బౌలర్లు షమి, బుమ్రా సత్తా చాటుతున్నారు. దీంతో నాలుగో రోజు ఆట మొదలైన గంటలోపే దక్షిణాఫ్రికా ఐదు వికెట్లను చేజార్చుకుంది. నైట్ వాచ్‌మన్ రబడ (5), హషీమ్ ఆమ్లా (4)ను షమి పెవిలియన్ పంపగా.. ఇన్నింగ్స్ 28.4 వ బంతికి 82 పరుగుల వద్ద కెప్టెన్ డుప్లెసిస్ (0)ను బుమ్రా డకౌట్ చేశాడు.
ఆ తర్వాత మరో పది పరుగులకే వికెట్ కీపర్ డికాక్ (8) బుమ్రా బౌలింగ్‌లో వృద్ధిమాన్ సాహాకు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఆఫ్‌సైడ్ వెళ్తున్న బంతి డికాక్ బ్యాట్ అంచుకు తగిలి కీపర్ చేతిలో పడింది. అంఫైర్‌కు అప్పీల్ చేసినప్పటికీ, ఔట్ ఇవ్వకపోవడంతో భారత్ రివ్యూకి వెళ్లింది. రివ్యూలో ఔట్ అని తేలడంతో పెవిలియన్‌కు చేరాడు.
ఆ తర్వాత ఫిలాండర్... మహమ్మద్ షమీ బౌలింగ్ డకౌట్‌గా వెనుదిరిగాడు. అనంతరం క్రీజులోకి దిగిన కేశవ్ మహారాజ్‌తో కలిసి ఏబీ డివిలియర్స్ కాసేపు ఇన్నింగ్స్‌ను నడిపించాడు. ప్రస్తుతం ఏబీ డివిలియర్స్ (18), కేశవ్ మహారాజ్ (3) పరుగులతో క్రీజులో ఉన్నారు.
నాలుగో రోజు ప్రారంభమైన ఆట
కేప్‌టౌన్ వేదికగా భారత్-దక్షిణాఫ్రికా జట్ల మధ్య జరుతున్న తొలి టెస్ట్ నాలుగో రోజు ఆట ప్రారంభమైంది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి సఫారీ జట్టు రెండో ఇన్నింగ్స్‌లో 65/2తో నిలిచింది. రబాడ (2), హషీమ్ ఆమ్లా (4) నైట్ వాచ్‌మెన్‌గా ఉన్న సంగతి తెలిసిందే.
భారత్ vs దక్షిణాఫ్రికా తొలి టెస్టు లైవ స్కోరు కార్డు
దీంతో దక్షిమాఫ్రికా జట్టు 142 పరుగుల ఆధిక్యంలో ఉంది. కాగా, మూడో రోజైన ఆదివారం వరుణుడు అడ్డంకిగా మారడంతో అంఫైర్లు ఆటను రద్దు చేస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ టెస్టులో తొలి ఇన్నింగ్స్‌లో సఫారీలు 286 పరుగులు చేసి ఆలౌట్ కాగా టీమిండియా 209 పరుగుల చేసి ఆలౌటైంది.