Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

T20WC: ఆ స్టార్ ప్లేయర్లకు ఇదే చివరి మ్యాచ్!- సెహ్వగ్

టీ20 వరల్డ్ కప్‌‌లో క్లైమాక్స్ వేళైంది. బార్బడోస్ వేదికగా ఇవాళ ఫైనల్ మ్యాచ్ జరగనుంది. టైటిల్‌పోరులో భారత్-దక్షిణాఫ్రికా తలపడనున్నాయి. ఈ హైవోల్టేజ్ పోరు రాత్రి 8 గంటలకు ప్రారంభం కానుంది. ఒకవేళ వర్షం ఆటకు అంతరాయం కలిగించినా ఆందోళన లేదు. మ్యాచ్‌ సజావుగా సాగడానికి ఆదివారం రిజర్వ్ డే‌గా కేటాయించారు.

వన్డే వరల్డ్ కప్‌లో రన్నరప్‌గా నిలిచిన భారత్ ఫేవరేట్‌గా బరిలోకి దిగుతోంది. మరోవైపు ప్రపంచకప్ చరిత్రలో తొలిసారి ఫైనల్‌కు చేరిన దక్షిణాఫ్రికా‌పై కూడా భారీ అంచనాలు ఉన్నాయి. అయితే ఈ ఫైనల్ మ్యాచే స్టార్ ఆటగాళ్లు విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ ఫైనల్ అయ్యే అవకాశాలు ఉన్నాయని మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ అన్నాడు. మరో వరల్డ్ కప్‌‌లో ఈ ఇద్దరు ఆటగాళ్లు పాల్గొనే ఛాన్స్‌లు లేవని పేర్కొన్నాడు. ఐసీసీ పరిమిత ఓవర్ల మెగాటోర్నీలో రోహిత్, కోహ్లి శకం ముగిసినట్లేనే అని అభిప్రాయపడ్డాడు.

India vs South Africa Kohli and Rohit May Retire from World Cups After This T20 World Cup- Sehwag

అయితే వన్డే వరల్డ్ కప్ గెలిస్తే ఈ ప్రపంచకప్‌లో కోహ్లి, రోహిత్ ఇద్దరిలో ఒకరే పాల్గొనేవారని సెహ్వాగ్ అన్నాడు. 37 ఏళ్ల రోహిత్, 35 ఏళ్ల కోహ్లి భవిష్యత్‌లో ఫిట్‌నెస్ ప్రమాణాలు పాటిస్తే వచ్చే వరల్డ్ కప్‌లో బరిలోకి దిగే ఛాన్స్ కూడా ఉందని తెలిపాడు. ''ప్రపంచకప్ ఆడే ఏ సీనియర్ ఆటగాడైనా ఇదే తన చివరి మెగాటోర్నీగా భావిస్తుంటారు. విజయంతో ముగించాలని అనుకుంటారు. గత వన్డే వరల్డ్ కప్ భారత్ గెలిచి ఉంటే కోహ్లి, రోహిత్..ఇద్దరిలో ఒకరు టీ20 ప్రపంచకప్‌లో ఆడేవారు కాదు''

India vs South Africa Kohli and Rohit May Retire from World Cups After This T20 World Cup- Sehwag

''కానీ టీమిండియా విజయం సాధించలేకపోయింది. అందుకే జట్టు, అభిమానుల కోసం ట్రోఫీని గెలవాలని కసితో ఉన్నారు. ఈ టీ20 వరల్డ్ కప్ భారత్ అందుకుంటుంది. అయితే ఈ టోర్నీ తర్వాత మరో లిమిటెడ్ ఓవర్ల వన్డే/టీ20 వరల్డ్ కప్‌ల్లో కోహ్లి, రోహిత్ ఆడే అవకాశాలు లేకపోవచ్చు. ఫిట్‌గా ఉండి ఫామ్‌లో ఉంటే మాత్రం మరో ప్రపంచకప్ ఆడతారు'' అని వీరేంద్ర సెహ్వాగ్ అన్నాడు.

Story first published: Saturday, June 29, 2024, 9:37 [IST]
Other articles published on Jun 29, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+