Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఆరు సార్లుగా రబాడ చేతిలో... రో'హిట్' ఏమైంది..?

India vs South Africa: 'Khaya Zondo better than him', Rohit Sharma trolled for becoming Kagiso Rabada's bunny

హైదరాబాద్: దక్షిణాఫ్రికా పర్యటనలో టీమిండియా వైస్ కెప్టెన్ రోహిత్‌ శర్మ వైఫల్యాల పరంపర కొనసాగుతోంది. ధావన్, రోహిత్ ఫాస్ట్ బౌలింగ్ పిచ్‌లలో ఆడగల నైపుణ్యం లేనివారు. అయితే ఈ సమస్య నుంచి ధావన్ అధిగమించినా రోహిత్‌లో ఎటువంటి మార్పు లేదు. టెస్టుల్లోనే కాక వన్డేల్లోనూ అతను ఘోరంగా విఫలమవుతున్నాడు.

రబాడ వేగం ముందు నిలవలేక:
145 కిలోమీటర్లకు తగ్గని వేగంతో బంతులేసే రబాడ దెబ్బకు రోహిత్‌ నిలవలేకపోతున్నాడు. అయితే శనివారం అతను ఔటైన బంతి అంత కష్టమైందేమీ కాదు. యార్కర్‌, గుడ్‌ లెంగ్త్‌ మధ్య పడ్డ బంతిని డ్రైవ్‌ చేయబోయిన రోహిత్‌.. రబాడకే చిక్కాడు. తన లాగే ఫాస్ట్‌ పిచ్‌లపై ఆడలేడని పేరున్న ధావన్‌ వన్డేల్లో నిలకడగా రాణిస్తుండగా.. రోహిత్‌ మాత్రం వైఫల్యాల బాట వీడలేక పోతుండటం ఆశ్చర్యకరమే.

మూడో టెస్టులో చోటును సైతం:
రెండు టెస్టుల్లో వరుసగా రోహిత్ శర్మ 11, 10, 10, 47 పరుగులు చేసి మూడో టెస్టుకు జట్టులో చోటు కోల్పోయాడు. ఇంతటితో ఆగక తనకు మంచి రికార్డున్న వన్డేల్లో సైతం పేలవ ప్రదర్శన పరంపరను కొనసాగిస్తున్నాడు.

నాలుగు వన్డేల్లోనూ పేలవం:
నాలుగు వన్డేల్లో వరుసగా 20, 15, 0, 5 స్కోర్లతో పెవిలియన్ బాట పట్టాడు. ఈ పర్యటనలో ఇప్పటిదాకా రోహిత్‌ ఎనిమిది ఇన్నింగ్స్‌లో ఆడాడు. అయితే ఆరుసార్లు ఒకే వ్యక్తి చేతిలో అవుట్ అవడం గమనార్హం. దక్షిణాఫ్రికా యువ ఫాస్ట్‌బౌలర్‌ కాగిసో రబాడ బౌలింగ్ రోహిత్‌కు ముప్పు తెచ్చిపెడుతోంది

తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.

Story first published: Sunday, February 11, 2018, 12:20 [IST]
Other articles published on Feb 11, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+