Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఇంటర్యూ: పూర్వీకుల గడ్డపై సఫారీ బౌలర్ కేశవ్ మహారాజ్ తండ్రి పుత్సోత్సాహం!

India vs South Africa: Keshav Maharaj back in his ancestral land; family proud

హైదరాబాద్: కేశవ్ మహారాజ్... విశాఖపట్నం వేదికగా టీమిండియాతో జరుగుతున్న తొలి టెస్టులో అంతర్జాతీయ టెస్టు అరంగేట్రం చేశాడు. తన కుమారుడి తొలి టెస్టు ప్రదర్శనను వీక్షించేందుకు గాను దక్షిణాఫ్రికా నుంచి కేశవ్ మహారాజ్ తల్లిదండ్రులు ఇండియాకు వచ్చారు. నిజానికి కేశవ్ మహారాజ్ వాళ్ల పూర్వీకులది ఇండియానే.

అయితే, కొన్నేళ్ల క్రితం వారు దక్షిణాఫ్రికాకు వలస వచ్చారు. దక్షిణాఫ్రికా జాతీయ జట్టులో చోటు దక్కించుకుని తన పూర్వీకుల భూమిలో తన కుమారుడు తొలి టెస్టు ఆడటం ఎంతో సంతోషంగా ఉందని కేశవ్ మహారాజ్ తండ్రి ఆత్మానంద్ మహారాజ్ తెలిపారు. ఆత్మానంద్ మహారాజ్ తన భార్య కంచన్, కాబోయే కోడలు లారిషాలతో కలిసి విశాఖ టెస్టుకు హాజరయ్యారు.

ఈ సందర్భంలో ఆయన మైకేల్ తెలుగుకు ఇచ్చిన ఇంటర్యూలో పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు. కేశవ్ మహారాజ్‌కు దక్షిణాఫ్రికా జాతీయ జట్టులో చోటు అంతతేలిగ్గా దక్కలేదని అన్నారు. ఎన్నో అడ్డంకులను ఎదుర్కొని అతడు ఈ స్థాయికి చేరుకున్నాడని కేశవ్ మహారాజ్ తండ్రి ఆత్మానంద్ మహారాజ్ తెలిపారు.

ఆత్మానంద్ మహారాజ్ మాట్లాడుతూ

ఆత్మానంద్ మహారాజ్ మాట్లాడుతూ

ఆయన మాట్లాడుతూ "దక్షిణాఫ్రికా కౌన్సిల్ ఆఫ్ స్పోర్ట్ చేసిన సాయం వల్లే నేను ప్రాంతీయ క్రికెట్ ఆడగలిగాను. కేశవ్ నాతో కలిసి మైదానంలోకి వచ్చి క్రికెట్ పట్ల ఆసక్తి పెంచుకున్నాడు. ప్రాథమిక పాఠశాల పిల్లలు క్రికెట్‌లో చురుకుగా పాల్గొనడానికి బేకర్స్ మినీ క్రికెట్ కార్యక్రమం ఎంతోగానో దోహదపడింది" అని పేర్కొన్నారు.

లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్‌ నైపుణ్యాన్ని గ్రహించాను

లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్‌ నైపుణ్యాన్ని గ్రహించాను

"మా పెరట్లో ఎక్కువగా మేము క్రికెట్ ఆడుతుంటాం. ఆ సమయంలో అతడిలో నేను లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్‌ నైపుణ్యాలను గ్రహించాను. అదే సమయంలో దక్షిణాఫ్రికా జట్టులో పాల్ హారిస్, నిక్కీ బోజే వంటి వారు తప్ప నాణ్యమైన లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు లేకపోవడం కూడా కేశవ్‌కు కలిసొచ్చింది. ఇదే అతడిని జాతీయ జట్టులో చోటు దక్కించుకునేలా చేసింది" అని కేశవ్ తండ్రి తెలిపారు.

దక్షిణాఫ్రికా జాతీయ జట్టుకు ఆడే అవకాశం

దక్షిణాఫ్రికా జాతీయ జట్టుకు ఆడే అవకాశం

2016లో పెర్త్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో ఆ సమయం వచ్చేసింది. "కొన్ని కారణాల వల్ల నా జీవితంలో దక్షిణాఫ్రికా జాతీయ జట్టుకు ఆడే అవకాశం నాకు లభించలేదు. ఎప్పుడైతే కేశవ్‌కు ఆ ఆవకాశం వచ్చిందో మేమెంతో ఉత్కంఠకు గురయ్యాం. దక్షిణాఫ్రికా జట్టుకు ఆడాలనే నాకలను నెరవేర్చుకోలేకపోయాను. అయితే, కేశవ్ రూపంలో ఆ కల నెరవేరింది. ప్రస్తుతం అతడు ప్రపంచ క్రికెట్‌లోకి అడుగుపెట్టిన కేవలం మూడేళ్లు అవుతోంది. రాబోయే రోజుల్లో అతడు ఎంతో నేర్చుకుంటాడు. ప్రస్తుతం అతడు సరైన ట్రాక్‌లో కొనసాగుతున్నాడు" అని సంతోషంగా ఉందని అన్నారు.

తొలి ఇన్నింగ్స్‌లో మూడు వికెట్లు తీసిన కేశవ్ మహారాజ్

తొలి ఇన్నింగ్స్‌లో మూడు వికెట్లు తీసిన కేశవ్ మహారాజ్

ఇదిలా ఉంటే, విశాఖ వేదికగా టీమిండియాతో జరుగుతున్న తొలి టెస్టులో కేశవ్ మహారాజ్ తన ప్రదర్శనతో ఫరవాలేదనిపించాడు. కేశవ్‌ 55 ఓవర్ల పాటు బౌలింగ్‌ చేసి మూడు వికెట్లు తీయగా, అవతలి నుంచి అతడికి సహకారం లభించలేదు. డేన్‌ పీట్‌, ముతుస్వామి చెరో వికెట్‌ తీసినా ప్రభావం చూపలేకపోయారు. కాగా, భారత ఓపెనర్లు మయాంక అగర్వాల్ డబుల్‌ సెంచరీతో చెలరేగగా, రోహిత్ శర్మ సెంచరీతో రాణించడంతో టీమిండియా తన తొలి ఇన్నింగ్స్‌ను 502/7 వద్ద డిక్లేర్డ్‌ చేసిన సంగతి తెలిసిందే.

మా బౌలర్లు చెత్త బంతులేసినట్లు కాదు

మా బౌలర్లు చెత్త బంతులేసినట్లు కాదు

మరోవైపు టీమిండియా తొలి ఇన్నింగ్స్‌పై కేశవ్ మహారాజ్ మాట్లాడుతూ "బ్యాట్స్‌మన్‌ ముందుకొచ్చి షాట్లు ఆడినంత మాత్రాన మా బౌలర్లు చెత్త బంతులేసినట్లు కాదు, బ్యాట్స్‌మన్‌ క్రీజులో ఉండి ఆడినా, నిలదొక్కుకొని కట్‌షాట్లు ఆడినా అది వేరే విషయం. డేన్‌కు ఈ రోజు కలిసిరాలేదు.. టీమిండియా బ్యాట్స్‌మెన్‌ మయాంక్‌, రోహిత్‌ అద్భుతంగా బ్యాటింగ్‌ చేశారు. టెస్టులో టాస్‌ ఎంతో కీలకం. స్పిన్‌ బౌలింగ్ చేయాలంటే అందుకు తగ్గ పరిస్థితులు అవసరం. సరైన సమయంలో మంచి బంతులేసుంటే మా జట్టు ఇంకాస్త మంచి స్థితిలో ఉండేది" అని అన్నాడు.

Story first published: Friday, October 4, 2019, 16:21 [IST]
Other articles published on Oct 4, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+