Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

వరుస ఓటములు ఎదురైనప్పుడు రోహిత్ పిరికి తనాన్ని...

India vs South Africa: Indian Middle-order is Still Bit of a Worry, Says Mohinder Amarnath

హైదరాబాద్: దక్షిణాఫ్రికా పర్యటనలో ఉన్న భారత జట్టు ఓపెనింగ్ బ్యాట్స్‌మెన్ ఐదో వన్డే మినహాయించి అన్నింట్లోనూ పెద్దగా రాణించలేకపోయాడు. ఐదో వన్డేలో సెంచరీని పూర్తి చేసి అందరినీ ఆశ్చర్యపరిచాడు. వన్డేల్లో తానూ రాణించగలనని మళ్లీ నిరూపించుకున్నాడు. అయితే ఈ మ్యాచ్ అనంతరం సీనియర్లు రోహిత్‌ను ఏకధాటిగా ప్రశంసిస్తున్నారు.

భారత ఓపెనర్ రోహిత్ శర్మ ఎలాంటి దశలోనూ పిరికితనాన్ని దరిచేరనీయడని భారత మాజీ ఆల్‌రౌండర్ అమరనాథ్ ప్రశంసించాడు. 'ఐదో వన్డేలో మరో అత్యుత్తమ ఇన్నింగ్స్‌ని ఓపెనర్ రోహిత్ శర్మ ఆడాడు. అతని ఆటలో ఓ దూకుడు ఉంది..పిరికితనాన్ని దరిచేరనీయడు.' అని పేర్కొన్నాడు.

ఇంకా మాట్లాడుతూ.. 'సిరీస్‌లో వరుసగా నాలుగు సార్లు తాను ఔటైన షార్ట్ పిచ్‌ బంతి ఐదో వన్డేలో ఎదురైతే.. పిరికివాడిలా పక్కకి తప్పుకోకుండా మొండి ధైర్యంతో సిక్స్‌గా మలిచి సత్తా నిరూపించుకున్నాడు. స్కోర్లని భారీ ఇన్నింగ్స్‌లుగా మలచడమెలాగో..? రోహిత్ శర్మకి బాగా తెలుసు. దక్షిణాఫ్రికా పర్యటనలో భారత్ జట్టుకి రోహిత్ శర్మ ఫామ్‌లో ఉండటం చాలా కీలకం' అని అమరనాథ్ వివరించాడు.

భారత జట్టు ఆరో వన్డేలోనూ విజేతగా నిలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశాడు. కోహ్లీ జట్టుని నడిపించే తీరు బాగుందంటూ కొనియాడాడు. స్నిన్నర్లు జట్టుకు ప్రధాన బలంగా మారారని అభిప్రాయపడ్డాడు.

Story first published: Friday, February 16, 2018, 19:05 [IST]
Other articles published on Feb 16, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+