Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్‌: ఎవరికి అందనంత ఎత్తులో కోహ్లీసేన!

India vs South Africa: India take massive 140-point lead in World Test Championship

హైదరాబాద్: వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో పాయింట్ల పరంగా టీమిండియా అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఈ ఏడాది నుంచి టెస్టు క్రికెట్‌లో ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్‌‌ను ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. ఈ టెస్టు చాంపియన్‌షిప్‌ ప్రవేశ పెట్టిన తర్వాత నాలుగు టెస్టు మ్యాచ్‌లు ఆడింది. ఈ నాలుగు మ్యాచ్‌ల్లో టీమిండియా విజయం సాధించడంతో 200 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతోంది.

ప్రస్తుతం వరల్డ్‌ టెస్టు చాంపియన్‌షిప్‌ పాయింట్ల పట్టికలో టీమిండియా 200 పాయింట్లతో అగ్రస్థానంలో ఉండగా... న్యూజిలాండ్‌-శ్రీలంకలు సంయుక్తంగా 60 పాయింట్లతో రెండో స్థానంలో కొనసాగుతున్నాయి. ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ జట్లు ఐదు టెస్టు మ్యాచ్‌లాడి 56 పాయింట్లతో ఆ తర్వాతి స్థానాల్లో కొనసాగుతున్నాయి.

వెస్టిండిస్ పర్యటనలో రెండు టెస్టు మ్యాచ్‌ల సిరిస్

వెస్టిండిస్ పర్యటనలో రెండు టెస్టు మ్యాచ్‌ల సిరిస్

వన్డే వరల్డ్‌కప్ ముగిసిన తర్వాత టీమిండియా వెస్టిండిస్ పర్యటనలో భాగంగా రెండు టెస్టు మ్యాచ్‌ల సిరిస్ ఆడింది. ఈ టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌ను 2-0తో కైవసం చేసుకోగా.... ప్రస్తుతం స్వదేశంలో సఫారీలతో జరుగుతున్న మూడు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో భాగంగా పూణె వేదికగా జరిగిన రెండో టెస్టులో దక్షిణాఫ్రికా టీమిండియా ఇన్నింగ్స్ 137 పరుగుల తేడాతో విజయం సాధించింది.

మరో టెస్ట్ మిగిలుండగానే సిరిస్‌ కైవసం

మరో టెస్ట్ మిగిలుండగానే సిరిస్‌ కైవసం

ఫలితంగా మరో టెస్ట్ మిగిలుండగానే సిరిస్‌ను టీమిండియా కైవసం చేసుకుంది. సొంతగడ్డపై టీమిండియాకు ఇది వరుసగా 11వ టెస్టు సిరిస్ విజయం కావడం విశేషం. అక్టోబర్ 19న రాంచీ వేదికగా ఇరు జట్ల మధ్య ఆఖరి టెస్టు జరగనుంది. వరల్డ్‌ టెస్టు చాంపియన్‌షిప్‌లో ప్రతి సిరీస్‌కు 120 చొప్పున పాయింట్లు కేటాయిస్తారు.

టెస్టుల సంఖ్య ఆధారంగా పాయింట్లు

టెస్టుల సంఖ్య ఆధారంగా పాయింట్లు

సిరీస్‌లోని టెస్టుల సంఖ్య ఆధారంగా ఈ పాయింట్లను విభజిస్తారు. వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో గరిష్టంగా ఐదు టెస్టులు మాత్రమే ఆడాలి. రెండు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌ అయితే మ్యాచ్‌లో విజేతకు 60 పాయింట్ల చొప్పున కేటాయిస్తారు. మూడు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ అయితే మ్యాచ్‌లో విజయం సాధించిన జట్టుకు 40 పాయింట్లు కేటాయిస్తారు.

ఒక్కో టెస్టుకు 40 పాయింట్లు

ఒక్కో టెస్టుకు 40 పాయింట్లు

అదే నాలుగు టెస్టు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ అయితే మ్యాచ్‌ నెగ్గిన జట్టుకు 30 పాయింట్లు కేటాయిస్తారు. ఐదు టెస్టు మ్యాచ్‌ సిరీస్‌ జరిగితే మ్యాచ్‌లో విజయం సాధించిన జట్టుకు 24 పాయింట్లగా నిర్ణయించారు. ప్రస్తుతం స్వదేశంలో దక్షిణాఫ్రికాతో జరుగుతున్న టెస్టు సిరిస్ మూడు టెస్టు మ్యాచ్‌ల సిరిస్ కావడంతో ఒక్కో టెస్టుకు 40 పాయింట్లు కేటాయించారు.

టీమిండియా ఖాతాలో 200 పాయింట్లు

టీమిండియా ఖాతాలో 200 పాయింట్లు

తొలి రెండు టెస్టుల్లో టీమిండియా విజయం సాధించడంతో టీమిండియా ఖాతాలో 80 పాయింట్లు వచ్చి చేరాయి. అంతకుముందు విండీస్‌ పర్యటనలో రెండు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌ను క్లీన్‌స్వీప్‌ చేయడంతో భారత్‌కు 120 పాయింట్లు వచ్చాయి. ఇలా మొత్తం టీమిండియా ఖాతాలో 200 పాయింట్లు ఉన్నాయి.

Story first published: Monday, October 14, 2019, 13:44 [IST]
Other articles published on Oct 14, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+