'ఎంతకాలం ధావన్‌కు అవకాశమిస్తారు.. అతని టీ20 స్థానంపై ఓ నిర్ణయానికి రావాలి'

న్యూఢిల్లీ: వచ్చే ఏడాది జరిగే టీ20 ప్రపంచకప్‌ను దృష్టిలో ఉంచుకుని టీ20 జట్టులో వరుసగా విఫలమవుతున్న సీనియర్ ఓపెనర్ శిఖర్ ధావన్‌పై టీమిండియా మేనేజ్‌మెంట్ ఓ నిర్ణయానికి రావాలి అని మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ అభిప్రాయపడ్డాడు. ఓపెనింగ్ చేయడానికి చాలామంది ఆటగాళ్లు ఉన్నారు. జట్టు యాజమాన్యం ధావన్‌కు ఇంకా ఎంతకాలం అవకాశమిస్తారు అని లక్ష్మణ్ ప్రశ్నించాడు.
ఈ ఏడాది 7 టీ20 మ్యాచ్‌లాడిన శిఖర్ ధావన్ 105 పరుగులు చేసాడు. అతని సగటు 15గా ఉంది. ఇక విండీస్ టూర్‌లో జరిగిన మూడు టీ20ల్లో 27 పరుగులు మాత్రమే చేసి పేలవ ఫామ్ కొనసాగిస్తున్నాడు. ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియాపై చేసిన సెంచరీనే ఇటీవలి కాలంలో ధావన్ చెప్పుకోదగ్గ మంచి ప్రదర్శన. గాయం కారణంగా ప్రపంచకప్ నుండి అర్ధాంతరంగా వైదొలిగిన అనంతరం విండీస్ టూర్‌లో దారుణంగా విఫలమయి విమర్శల పాలయ్యాడు. అయితే కెప్టెన్ విరాట్ కోహ్లీ, కోచ్ రవిశాస్త్రి అతనిపై నమ్మకంగా ఉన్నారు. ఈ నేపథ్యంలో లక్ష్మణ్ స్పందించాడు.
లక్ష్మణ్ మాట్లాడుతూ... 'టీ20 ప్రపంచకప్‌కు సమయం దగ్గరపడుతోంది. టీమిండియాకు ఇంకా 20 మ్యాచులు ఉన్నాయి. కాబట్టి రోహిత్ శర్మతో కలిసి ఓపెనింగ్ చేసేది ఎవరనే విషయంలో జట్టు యాజమాన్యం ఓ స్పష్టతకు రావాలి. శిఖర్ ధవన్‌ను ఎలా చూస్తున్నారో చెప్పాలి. ధావన్‌ని ప్రపంచకప్‌లో ఆడించాలని టీమిండియా భావిస్తోందా?. లేదంటే ఇప్పుడే అతని టీ20 భవితవ్యంపై ఓ నిర్ణయం తీసుకుంటే మంచింది. ఎందుకంటే ఓపెనింగ్ చేయడానికి చాలామంది ఆటగాళ్లు ఉన్నారు. గత కొంతకాలంగా పేలవ ఫామ్‌తో నిరాశపరుస్తున్నాడు. ఎంతకాలం ధావన్‌కు అవకాశమిస్తారనేది చూడాలి' అని లక్ష్మణ్ అన్నాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications