సిడ్నీ: ప్రపంచకప్ నేపథ్యంలో స్టార్ స్పోర్ట్స్‌లోని టపాకాయల యాడ్స్ ఆకట్టుకుంటున్న విషయం తెలిసిందే. దాని పైన భారత్ అభిమానులు ఆగ్రహావేశాలు కూడా వ్యక్తం చేస్తున్నారు. దక్షిణాఫ్రికా - భారత్ జట్ల మధ్య ఈ ఆదివారం మ్యాచ్ ఉంది. ఈ నేపథ్యంలో స్టార్ స్పోర్ట్స్ యాడ్‌కు కౌంటర్‌గా భారత్ అభిమానులు రూపొందించారు.
ఇందులో ముగ్గురు అభిమానులు మ్యాచ్ చూస్తుంటారు. కాలింగ్ బెల్ మోగడంతో ఓ అభిమాని వెళ్లి తలుపు తెరుస్తాడు. ఇద్దరు దక్షిణాఫ్రికా అభిమానులు టపాకాయల బుట్ట అతడి చేతికి ఇస్తారు. వెటకారంగా చూస్తారు. ఐతే భారత అభిమాని గోడ వైపు చూపిస్తాడు.

అక్కడ 1983లో కపిల్ దేవ్, 2011లో మహేంద్ర సింగ్ ధోనీ, సచిన్ టెండుల్కర్ ప్రపంచకప్‌తో ఉన్న ఫోటోలను చూపిస్తారు. దీంతో సఫారీ ఫ్యాన్స్ తెల్లమొహం వేస్తారు. దక్షిణాఫ్రికా ఇప్పటి వరకు ఒక్కసారి కూడా ప్రపంచకప్ గెలవలేదు. భారత్ రెండుసార్లు గెలిచింది. ఈ వ్యంగ్య ప్రకటన నెటిజన్లను ఆకట్టుకుంటోంది.