For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

India vs South Africa: 27వ సారి, అశ్విన్ ఖాతాలో మరో రికార్డు!

IND vs SA 2019,1st Test : Ravichandran Ashwin Takes His 27th Test Five Wickets During Vizag Test
India vs South Africa highlights 1st Test Day 3: Ashwin takes his 27th 5-wicket haul

హైదరాబాద్: విశాఖపట్నం వేదికగా దక్షిణాఫ్రికాతో జరుగుతుతున్న తొలి టెస్టులో టీమిండియా వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అరుదైన ఘనత సాధించాడు. ఈ మ్యాచ్‌లో రవిచంద్రన్‌ అశ్విన్ (128/5) ఐదు వికెట్లతో సత్తా చాటిన సంగతి తెలిసిందే. ఫలితంగా టెస్టు క్రికెట్‌లో 27వ సారి ఐదు వికెట్ల హాల్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు.

ఈ టెస్టులో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా ఓపెనర్లు మయాంక్ అగర్వాల్(215) డబుల్ సెంచరీతో చెలరేగగా... రోహిత్ శర్మ(176) సెంచరీతో రాణించడంతో తన తొలి ఇన్నింగ్స్‌ను 502/7 వద్ద డిక్లేర్ చేసింది. అనంతరం రెండో రోజైన గురువారం దక్షిణాఫ్రికా బ్యాటింగ్ ఆరంభించిన వెంటనే అశ్విన్ తన బౌలింగ్‌లో మార్‌క్రమ్(5), బ్రుయిన్(4) వికెట్లు తీసి భారత్‌కు బ్రేకిచ్చాడు.

1
46113

పుంజుకున్న దక్షిణాఫ్రికా జట్టు

అయితే, మూడో రోజైన శుక్రవారం దక్షిణాఫ్రికా జట్టు అద్భుతంగా పుంజుకుంది. దక్షిణాఫ్రికా టాపార్డర్‌లో కీలకమైన వికెట్లను భారత బౌలర్లు సాధించినప్పటికీ ఎల్గర్‌ మాత్రం పట్టువదలకుండా ఇన్నింగ్స్‌ ఆడాడు. ఈ క్రమంలో వికెట్లు తీసేందుకు భారత బౌలర్లు తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. పిచ్ స్పిన్నర్లకు అనుకూలించడంతో అశ్విన్, జడేజాలతో ఎక్కువ ఓవర్లు బౌలింగ్ చేయించాడు.

ఐదు వికెట్లు తీసిన అశ్విన్

ఈ క్రమంలో శుక్రవారం అశ్విన్ మూడు వికెట్లు పడగొట్టాడు. ముఖ్యంగా కీలక సమయంలో రాణించి దక్షిణాఫ్రికా పరుగుల ప్రవాహాన్ని అడ్డుకున్నాడు. ఈ క్రమంలో డుప్లెసిస్(55), క్వింటన్ డీకాక్(111), ఫిలాండర్(0)లను పెవిలియన్‌కు చేర్చాడు. ఇలా మొత్తం మూడో రోజు ఆట ముగిసే సమయానికి అశ్విన్ ఐదు వికెట్లు పడగొట్టాడు.

ఐదు వికెట్లు పడగొట్టడం 27వసారి

ఐదు వికెట్లు పడగొట్టడం 27వసారి

టెస్టుల్లో అశ్విన్ ఇలా ఐదు వికెట్లు పడగొట్టడం 27వసారి. టెస్టు క్రికెట్‌లో అశ్విన్ ఇప్పటికే అనేక రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు. టెస్టుల్లో అత్యంత వేగంగా 300 వికెట్లు తీసిన బౌలర్‌గా రికార్డుని సృష్టించిన అశ్విన్ భారత్ తరుపున ఇప్పటివరకు 65 టెస్టులాడి 25.44 యావరేజితో 342 వికెట్లు పడగొట్టాడు.

2014లో అర్జున అవార్డు

2014లో అర్జున అవార్డు

2014లో భారత ప్రభుత్వం నుంచి అర్జున అవార్డు అందుకున్న అశ్విన్... 2016లో ఐసీసీ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్, ఐసీసీ టెస్టు క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ అవార్డులను అందుకున్నాడు. 2015లో సఫారీ జట్టు భారత పర్యటనకు వచ్చిన సమయంలో దక్షిణాఫ్రికాపై 31 వికెట్లు తీసి 3-0తో టెస్టు సిరిస్‌ను నెగ్గడంలో కీలకపాత్ర పోషించిన సంగతి తెలిసిందే.

అరంగేట్ర మ్యాచ్‌లోనే 8 వికెట్లు

అరంగేట్ర మ్యాచ్‌లోనే 8 వికెట్లు

2011లో వెస్టిండీస్‌పై సుదీర్ఘ ఫార్మాట్‌లో అడుగుపెట్టిన అశ్విన్... 8 వికెట్లు తీసి అరంగేట్ర మ్యాచ్‌లోనే అత్యధిక వికెట్లు తీసిన భారత రెండో బౌలర్‌గా అరుదైన ఘనత సాధించాడు. ఈ జాబితాలో భారత మాజీ బౌలర్ నరేంద్ర హీర్వాణి (16 వికెట్లు) అగ్రస్థానంలో ఉన్నాడు. ఇక, 16 టెస్టుల్లోపే 9 సార్లు 5 వికెట్ల ఘనత సాధించాడు.

18 టెస్టుల్లోనే 100 వికెట్లు రికార్డు

18 టెస్టుల్లోనే 100 వికెట్లు రికార్డు

18 టెస్టుల్లోనే 100 వికెట్లు ఖాతాలో వేసుకొని అత్యంత వేగంగా వంద వికెట్లు సాధించిన ఎర్రపల్లి ప్రసన్న రికార్డును సైతం అశ్విన్ బద్దలు కొట్టాడు. ఇక, టెస్టుల్లో అశ్విన్ అత్యుత్తమం 7/59. అంతేకాదు ఒక ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లను 27 సార్లు... పది వికెట్లను 7 సార్లు సాధించాడు.

Story first published: Friday, October 4, 2019, 18:58 [IST]
Other articles published on Oct 4, 2019
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+