భారత్, దక్షిణాఫ్రికా మధ్య ఎప్పుడూ టెస్టు జరిగిన ఎక్కడా లేని ఆసక్తి నెలకొంటుంది. దీనికి కారణం ఇరు జట్లు హోరాహోరిగా తలపడడం ఒక్కటి అయితే, రెండు జట్లలో స్టార్ ఆటగాళ్లు ఉండడం మరొక కారణం.కాగా భారత్, దక్షిణాఫ్రికా దాదాపు 30 ఏళ్లుగా టెస్ట్ ఫార్మాట్లో తలపడుతున్నాయి. భారత్, దక్షిణాఫ్రికా తొలిసారిగా టెస్ట్ సిరీస్‌లో 1991లో తలపడ్డాయి. ఈ సిరీస్‌లో 4 టెస్టు మ్యాచ్‌లు జరిగాయి. ఏకంగా 3 టెస్ట్ మ్యాచ్‌లు డ్రాగా ముగిశాయి. ఒక దాంట్లో సౌతాఫ్రికా విజయం సాధించింది. దీంతో దక్షిణాఫ్రికా వేదికగా జరిగిన ఈ సిరీస్‌ను ఆ జట్టు 1-0తో గెలుచుకుంది. ఆ తర్వాత 1996లో భారత్ వేదికగా ఇరుజట్ల మధ్య 3 టెస్టుల సిరీస్ జరిగింది. ఈ సిరీస్‌లో టీమిండియా 2, సౌతాఫ్రికా ఒక మ్యాచ్ గెలిచాయి. దీంతో భారత్ సిరీస్‌ను 2-1తో కైవసం చేసుకుంది. ఆ వెంటనే 1996లోనే ఇరుజట్లు సౌతాఫ్రికా వేదికగా 3 టెస్టుల సిరీస్‌లో మరోసారి తలపడ్డాయి. ఈ సిరీస్‌ను సౌతాఫ్రికా 2-0తో కైవసం చేసుకుంది. ఆ తర్వాత 1999లో ఇండియా వేదికగా రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో ఇరు జట్లు తలపడ్డాయి. ఈ సిరీస్‌ను దక్షిణాఫ్రికా 2-0తో గెలుచుకుంది.
2001లో దక్షిణాఫ్రికా వేదికగా రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో ఇరు జట్లు తలపడ్డాయి. ఈ సిరీస్‌ను కూడా సౌతాఫ్రికా 1-0తో గెలుచుకుంది. ఇలా వరుసగా మూడు సిరీస్‌ల్లో సౌతాఫ్రికానే గెలుపొందింది. ఆ తర్వాత 2004లో భారత్ వేదికగా 2 మ్యాచ్‌ల సిరీస్ జరగగా టీమిండియా 1-0తో గెలిచింది. ఆ తర్వాత 2006లో సౌతాఫ్రికా వేదికగా ఇరు జట్లు 3 మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో తలపడ్డాయి. ఆ సిరీస్‌ను సౌతాఫ్రికా 2-1తో గెలుచుకుంది. అనంతరం భారత్ వేదికగా 2007లో జరిగిన 3 మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ 1-1తో డ్రాగా ముగిసింది. ఆ తర్వాత 2009లో భారత్ వేదికగా జరిగిన రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ కూడా 1-1తో డ్రాగానే ముగిసింది. అనంతరం 2010లో సౌతాఫ్రికా వేదికగా జరిగిన 3 మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ కూడా 1-1తో డ్రాగానే ముగిసింది. తర్వాత 2013లో సౌతాఫ్రికా వేదికగా జరిగిన 2 మ్యాచ్‌ల సిరీస్‌ను సౌతాఫ్రికా 1-0తో గెలుచుకుంది. అనంతరం భారత్ వేదికగా 2015లో జరిగిన 4 మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌ను ఇండియా 3-0తో గెలుచుకుంది. కాగా 2017లో సౌతాఫ్రికా వేదికగా జరిగిన 3 మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌ను 2-1 తేడాతో సఫారీలు గెలుచుకున్నారు. ఇక చివరగా 2019లో భారత్ వేదికగా జరిగిన 3 మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌ను టీమిండియా 3-0తో క్లీన్ స్వీప్ చేసింది. అయితే భారత్‌లో దక్షిణాఫ్రికా టెస్టు సిరీస్ గెలిచినప్పటికీ ఇప్పటివరకు ఇండియా ఒక్కసారి కూడా సౌతాఫ్రికాలో టెస్ట్ సిరీస్ గెలవలేదు. ఈ 30 ఏళ్లలో ఇరుజట్లు 14 టెస్టు సిరీస్‌లలో పోటీ పడ్డాయి. ఈ పోటీలో భారత్‌పై దక్షిణాఫ్రికాదే పైచేయిగా ఉంది. ఈ 14 సిరీస్‌లో దక్షిణాఫ్రికా ఏకంగా 7 సిరీస్‌లు గెలుచుకుంది. భారత్ 4 సిరీస్‌లతోనే సరిపెట్టుకుంది. 3 సిరీస్‌లు డ్రాగా ముగిశాయి.