Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

India vs South Africa హెడ్ టూ హెడ్ వ‌న్డే రికార్డుల్లో అధిప‌త్యం ఎవ‌రిదంటే?

India vs South Africa Head To Head One Day Stats

టెస్టు సిరీస్ ముగిసింది. ఇక బుధ‌వారం నుంచి భార‌త్, సౌతాఫ్రికా మ‌ధ్య వ‌న్డే సిరీస్ ప్రారంభంకానుంది. కెప్టెన్ రోహిత్ శ‌ర్మ‌ గైర్హాజ‌రీలో లోకేష్ రాహుల్ టీమిండియాను న‌డిపించ‌నున్నాడు. పేస‌ర్ జ‌స్ప్రీత్ బుమ్రా వైస్ కెప్టెన్‌గా ఉండ‌నున్నాడు. ఈ సిరీస్‌లో మొత్తం మూడు వ‌న్డేలు జ‌ర‌గ‌నున్నాయి. బుధ‌వారం తొలి వ‌న్డే జ‌ర‌గ‌నుండ‌గా, 21, 23న రెండు, మూడు వ‌న్డేలు జ‌ర‌గ‌నున్నాయి. కాగా గ‌త సౌతాఫ్రికా ప‌ర్య‌ట‌న‌లో భార‌త జ‌ట్టు వ‌న్డే సిరీస్ గెలిచింది. దీంతో ఈ సారి కూడా వ‌న్డే సిరీస్‌ను నిల‌బెట్టుకోవాల‌ని టీమిండియా పట్టుద‌ల‌గా ఉంది. ఈ క్ర‌మంలో భార‌త్, సౌతాఫ్రికా వ‌న్డే రికార్డులను ఒక సారి ప‌రిశీలిద్దాం.

సఫారీల‌దే పై చేయి

సఫారీల‌దే పై చేయి

ఇప్ప‌టివ‌ర‌కు హెడ్ టూ హెడ్ వ‌న్డే రికార్డుల్లో సౌతాఫ్రికాదే పై చేయిగా ఉంది. ఇప్ప‌టివ‌ర‌కు ఇరు జ‌ట్లు 84 వ‌న్డే మ్యాచ్‌ల్లో త‌ల‌ప‌డ‌గా సౌతాఫ్రికా అత్య‌ధికంగా 46 మ్యాచ్‌ల్లో గెలిచింది. భార‌త్ 35 మ్యాచ్‌ల్లో మాత్ర‌మే గెలిచింది. 3 మ్యాచ్‌ల్లో ఫ‌లితం తేల‌లేదు. దీంతో సౌతాఫ్రికా విజయాల శాతం 57గా ఉండ‌గా.. భార‌త్‌ది 53గా ఉంది. ఇరు జ‌ట్ల పోటీలో అత్య‌ధిక స్కోర్ రికార్డు సౌతాఫ్రికా పేరు పైనే ఉంది. ఆ జట్టు ఓ మ్యాచ్‌లో 4 వికెట్ల‌కు 438 ప‌రుగుల భారీ స్కోర్ సాధించింది. అత్య‌ల్ప స్కోర్‌ రికార్డు మాత్రం భార‌త్ పేరు మీద ఉంది. భార‌త్ ఓ సారి 91 ప‌రుగుల‌కే ఆలౌటైంది.

సౌతాఫ్రికాలో భార‌త్ గెలిచిన మ్యాచ్‌లు

సౌతాఫ్రికాలో భార‌త్ గెలిచిన మ్యాచ్‌లు

సఫారీ గ‌డ్డ‌పై ఇప్ప‌టివ‌ర‌కు భార‌త్‌పై సౌతాఫ్రికాదే పై చేయిగా ఉంది. హోం గ్రౌండ్‌లో ఇప్ప‌టివ‌ర‌కు భార‌త్‌పై సౌతాఫ్రికా 22 మ్యాచ్‌ల్లో విజ‌యం సాధించింది. అదే టీమిండియా స‌ఫారీ గ‌డ్డ‌పై సౌతాఫ్రికాను 10 సార్లు ఓడించింది. ఇక భార‌త్‌లో ఇరు జ‌ట్లు త‌ల‌ప‌డ్డ‌ప్పుడు టీమిండియా 15 మ్యాచ్‌ల్లో గెల‌వ‌గా, సౌతాఫ్రికా 13 మ్యాచ్‌ల్లో గెలిచింది.

అత్య‌ధిక ర‌న్స్ రికార్డు స‌చిన్‌దే

అత్య‌ధిక ర‌న్స్ రికార్డు స‌చిన్‌దే

భార‌త్, సౌతాఫ్రికా వ‌న్డేల్లో త‌ల‌ప‌డినప్పుడు అత్య‌ధిక ప‌రుగులు చేసిన రికార్డు మాష్ట‌ర్ బ్లాష్ట‌ర్ స‌చిన్ టెండూల్క‌ర్ పేరు మీద‌నే ఉంది. 57 మ్యాచ్‌ల్లో సచిన్ 2001 ప‌రుగులు చేశాడు. అంత‌ర్జాతీయ క్రికెట్‌లో స‌చిన్ ఫ‌స్ట్ డ‌బుల్ సెంచ‌రీ చేసింది కూడా సౌతాఫ్రికా మీద‌నే. ఇక అత్య‌ధికంగా సౌతాఫ్రికా బౌలర్ పొలాక్ 48 వికెల్లు తీశాడు. ఓ మ్యాచ్‌లో అత్య‌ధికంగా జోషి 5 వికెట్లు తీశాడు. అత్య‌ధిక సెంచ‌రీలు చేసిన రికార్డు ఏబీ డివిలియ‌ర్స్ పేరు మీద ఉంది. డివిలియ‌ర్స్ 6 సెంచ‌రీలు చేశాడు. ఇక అత్య‌ధికంగా విరాట్ కోహ్లీ 21 క్యాచ్‌లు ప‌ట్టాడు. అత్య‌ధికంగా స‌చిన్ టెండూల్క‌ర్ 57 మ్యాచ్‌లు ఆడాడు. ఇక అత్య‌ధికంగా సౌతాఫ్రికా బ్యాట‌ర్లు గిబ్స్‌, కిర్‌స్టిన్ 235 ప‌రుగుల భాగ‌స్వామ్యాన్ని నెల‌కొల్పారు.

ప‌ట్టుద‌ల‌గా భార‌త్

ప‌ట్టుద‌ల‌గా భార‌త్

ఇప్ప‌టికే టెస్టు సిరీస్‌లో ఓడిపోయిన టీమిండియా వ‌న్డే సిరీస్‌ను ఎలాగైనా గెల‌వాల‌ని ప‌ట్టుద‌ల‌గా ఉంది. ఈ సిరీస్‌లో అంద‌రి చూపు కెప్టెన్ విరాట్ కోహ్లీపైనే ఉండ‌నుంది. చాలా కాలం త‌ర్వాత కెప్టెన్‌గా కాకుండా ప్లేయ‌ర్‌గా కోహ్లీ బ‌రిలోకి దిగుతున్నాడు.

Story first published: Tuesday, January 18, 2022, 18:06 [IST]
Other articles published on Jan 18, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+