
ధోనీకి దక్కని చోటు:
భవిష్యత్తు ప్రణాళికల్లో భాగంగా యువ వికెట్ కీపర్, బ్యాట్స్‌మన్ రిషబ్ పంత్‌కు ఎక్కువ అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో ధోనీకి సెలక్టర్లు అవకాశం కల్పించలేదని సమాచారం. దీంతో 15 రోజుల పాటు సైన్యానికి సేవలందించి.. ప్రస్తుతం అమెరికా పర్యటనకు వెళ్లిన ధోనీకి నిరాశే ఎదురైంది. అయితే ధోనీ ఈ సిరీస్ కోసం తాను అందుబాటులో ఉండే విషయం బీసీసీఐతో ఏమైనా మాట్లాడారా అన్న విషయంపై సెలెక్టర్లు ఎలాంటి సమాధానం ఇవ్వలేదు.

భువీకి విశ్రాంతి:
ప్రపంచకప్ అనంతరం విశ్రాంతి తీసుకుంటున్న స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్య మళ్లీ జట్టులో చోటు దక్కించుకున్నాడు. వరుసగా మ్యాచ్‌లు ఆడుతున్న పేసర్ భువనేశ్వర్ కుమార్‌కు సెలెక్టర్లు విశ్రాంతినిచ్చారు. వెస్టిండీస్ పర్యటనలో విశ్రాంతిని ఇచ్చిన పేసర్ జస్ప్రీత్ బుమ్రాను కూడా కొనసాగించలేదు. పాండ్యా, భువీ మినహా వెస్టిండీస్‌ను చిత్తుచేసిన జట్టువైపే సెలెక్టర్లు మొగ్గుచూపారు.

యువకులకు పేస్ బాధ్యతలు:
ఫాస్ట్ బౌలర్లు బుమ్రా, భువనేశ్వర్‌లకు విశ్రాంతినిచ్చిన నేపథ్యంలో యువ ఆటగాళ్లైన ఖలీల్ అహ్మద్, దీపక్ చాహర్, నవదీప్ సైనీలు పేస్ బౌలింగ్ బాధ్యతలు చేపట్టనున్నారు. రవీంద్ర జడేజా, కృనాల్ పాండ్య, వాషింగ్టన్ సుందర్, రాహుల్ చాహర్‌లు స్పిన్ విభాగంలో ఎంపికయ్యారు. ప్రస్తుతం జట్టులో ముగ్గురు ఆల్‌రౌండర్‌లు ఉన్నారు.

ఇదే మంచి అవకాశం:
శ్రేయస్ అయ్యర్, మనీష్ పాండేలు నిరూపించుకునేందుకు ఇదే మంచి అవకాశం. వచ్చే ఏడాది టీ20 ప్రపంచకప్‌ను దృష్టిలో ఉంచుకొని పంత్‌తో పాటు మరో ఇద్దరు వికెట్ కీపింగ్ బ్యాట్స్‌మెన్‌కు చోటివ్వాలని సెలెక్టర్లు ముందుగా ఆలోచించినా... ప్రస్తుతానికి ఆ ప్రయోగాన్ని వాయిదా వేశారు. మూడు టీ20లు, మూడు టెస్టులు ఆడేందుకు దక్షిణాఫ్రికా జట్టు సెప్టెంబర్‌లో భారత పర్యటనకు రానుంది

జట్టు:
విరాట్ కోహ్లీ (కెప్టెన్), రోహిత్ శర్మ (వైస్ కెప్టెన్), శిఖర్ ధావన్, కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్, మనీష్ పాండే, రిషభ్ పంత్ (వికెట్ కీపర్), హర్దిక్ పాండ్య, రవీంద్ర జడేజా, కృనాల్ పాండ్య, వాషింగ్టన్ సుందర్, రాహుల్ చాహర్, ఖలీల్ అహ్మద్, దీపక్ చాహర్, నవదీప్ సైనీ.


Click it and Unblock the Notifications












